IRCTC Godavari Temple Tour – పూర్తి వివరాలు
రైల్వే శాఖ నూతనంగా ప్రారంభించిన గోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం SHR029 ప్యాకేజీ కోడ్ పేరుతో 3 రాత్రులు, 4 రోజుల ప్రత్యేక టెంపుల్ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సౌత్ సెంట్రల్ రైల్వే – IRCTC గోదావరి టెంపుల్ టూర్
సౌత్ సెంట్రల్ రైల్వే, IRCTC ఆధ్వర్యంలో నిర్వహించే ఈ గోదావరి టెంపుల్ టూర్లో తూర్పు గోదావరి ప్రాంతంలోని అన్నవరం, రాజమండ్రితో పాటు కోనసీమలోని అంతర్వేది, అప్పనపల్లి, ఐనవిల్లి, ద్రాక్షారామం వంటి ప్రముఖ దేవాలయాలను సందర్శించవచ్చు.
IRCTC Temple Tour ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
IRCTC Godavari Temple Tour ప్రయాణం ప్రతి శుక్రవారం ప్రారంభమవుతుంది. శుక్రవారం లింగంపల్లి రాత్రి 2.30 గంటలకు, సికింద్రాబాద్‌లో 12.15 గంటలకు, రైలు నంబర్ 12738 (గౌతమీ ఎక్స్‌ప్రెస్) ద్వారా ఈ ప్రయాణం మొదలవుతుంది.
శనివారం – అన్నవరం, రాజమండ్రి
శనివారం ఉదయం 4.38 నిమిషాలకు రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో సిద్ధం అయ్యి, ప్రత్యేక AC బస్సులో అన్నవరం వెళతారు.
అన్నవరం దర్శనం పూర్తయిన తర్వాత సాయంత్రం రాజమండ్రికి తిరిగి వస్తారు. అనంతరం గోదావరి నది పక్కనే ఉన్న ఇస్కాన్ టెంపుల్ను సందర్శిస్తారు. వీలును బట్టి సమీపంలోని ఇతర దేవాలయాలను కూడా చూడవచ్చు.
తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు.
ఆదివారం – కోనసీమ దేవాలయాల దర్శనం
ఆదివారం ఉదయం హోటల్ ఖాళీ చేసి ముందుగా కోనసీమలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం మరియు అక్కడ ఉన్న బీచ్‌ను సందర్శిస్తారు.
అంతర్వేది గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకునే భక్తులు మా సైట్‌లోని **అంతర్వేది దేవాలయం మరియు రూమ్స్ వివరాలు గురించి కూడా తెలుసుకోవచ్చు.
అక్కడి నుంచి అప్పనపల్లి బాలబాలాజీ దేవాలయం, ఐనవిల్లి వరసిద్ధి వినాయక ఆలయం, ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం దర్శించుకుంటారు.
తదుపరి రాజమండ్రికి చేరుకొని రాత్రి 20.18 నిమిషాలకు రైలు నంబర్ 12738 (గౌతమీ ఎక్స్‌ప్రెస్) ఎక్కి తిరిగి ప్రయాణం అవుతారు.
సోమవారం – ప్రయాణం ముగింపు
సోమవారం ఉదయం 4.35 నిమిషాలకు సికింద్రాబాద్, 5.55 నిమిషాలకు లింగంపల్లి చేరుకోవడంతో ఈ గోదావరి టెంపుల్ టూర్ పూర్తి అవుతుంది.
ఈ టూర్‌లో కవర్ అయ్యే దేవాలయాలు
ఈ IRCTC గోదావరి టెంపుల్ టూర్‌లో ప్రధానంగా కింది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు:
- అన్నవరం
- రాజమండ్రి
- అంతర్వేది
- అప్పనపల్లి
- ఐనవిల్లి
- ద్రాక్షారామం
IRCTC గోదావరి టెంపుల్ టూర్ టికెట్ ధరలు
IRCTC Godavari Temple Tour Package ధరలు
ఒకరి నుండి ముగ్గురు ప్రయాణికుల వరకు
కంఫర్ట్ (3AC):
- సింగల్ షేరింగ్ టికెట్ ధర – రూ.15,400
- ట్విన్ షేరింగ్ టికెట్ – రూ.8,990
- ట్రిపుల్ షేరింగ్ టికెట్ – రూ.7,230
- చైల్డ్ with బెడ్ (5–11 ఇయర్స్) – రూ.6,140
- చైల్డ్ without బెడ్ – రూ.5,020
స్టాండర్డ్ (SL):
- సింగల్ షేరింగ్ టికెట్ ధర – రూ.13,840
- ట్విన్ షేరింగ్ టికెట్ – రూ.7,430
- ట్రిపుల్ షేరింగ్ టికెట్ – రూ.5,670
- చైల్డ్ with బెడ్ (5–11 ఇయర్స్) – రూ.4,580
- చైల్డ్ without బెడ్ – రూ.3,460
నలుగురు నుండి ఆరుగురు ప్రయాణికుల గ్రూప్
కంఫర్ట్ (3AC):
- ట్విన్ షేరింగ్ టికెట్ – రూ.7,490
- ట్రిపుల్ షేరింగ్ టికెట్ – రూ.6,680
- చైల్డ్ with బెడ్ (5–11 ఇయర్స్) – రూ.6,140
- చైల్డ్ without బెడ్ – రూ.5,020
స్టాండర్డ్ (SL):
- ట్విన్ షేరింగ్ టికెట్ – రూ.5,930
- ట్రిపుల్ షేరింగ్ టికెట్ – రూ.5,120
- చైల్డ్ with బెడ్ (5–11 ఇయర్స్) – రూ.4,580
- చైల్డ్ without బెడ్ – రూ.3,460
టికెట్ బుకింగ్
ఈ IRCTC Godavari Temple Tourకు బుకింగ్ చేసే టికెట్లను 12 గంటల నుండి 4 రోజుల ముందుగా బుక్ చేసుకునే సదుపాయం ఉందని సమాచారం.
అయితే ప్రస్తుతం ప్యాకేజీ అందుబాటులో ఉందా, ధరలు, రైలు సమయాలు మరియు బుకింగ్ నిబంధనలు మారాయా అనే విషయాలను ప్రయాణానికి ముందు అధికారిక IRCTC Tourism వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి.
టెంపుల్ టూర్‌కు వెళ్లేవారు గుర్తుంచుకోవాల్సిన విషయం
దేవాలయాల దగ్గర ప్రయాణికులు తమకు ఇచ్చిన సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. లేని యెడల కొన్ని దేవాలయాల దర్శనం పూర్తి చేయలేకపోవచ్చు.
ముఖ్యంగా ఒకే ప్యాకేజీలో అనేక దేవాలయాలను సందర్శించే టూర్ కావడంతో ప్రతి ప్రాంతంలో సమయపాలన చాలా ముఖ్యం.
IRCTC గోదావరి టెంపుల్ టూర్ గురించి మరిన్ని వివరాలు
మరిన్ని వివరాల కోసం IRCTC Tourism అధికారిక వెబ్‌సైట్లో తాజా సమాచారం తెలుసుకోవచ్చు. ప్యాకేజీ ధరలు, ప్రయాణ తేదీలు, రైలు సమయాలు, బుకింగ్ లభ్యత వంటి వివరాలను బుకింగ్ చేసే ముందు ఒకసారి పరిశీలించడం మంచిది.
IRCTC Secunderabad Office:
- 8287932229
- 8287932228
- 9701360701
ముగింపు
గోదావరి జిల్లాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే టూర్‌లో దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈ IRCTC Godavari Temple Tour ఉపయోగకరమైన ప్రయాణ ప్యాకేజీగా ఉంటుంది. అన్నవరం నుంచి ప్రారంభమై రాజమండ్రి, అంతర్వేది, అప్పనపల్లి, ఐనవిల్లి, ద్రాక్షారామం వంటి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించే అవకాశం ఈ టూర్‌లో ఉంటుంది.
కోనసీమలోని ఆలయాలు, పర్యాటక ప్రదేశాల గురించి మరింత సమాచారం కోసం Konaseema Lifeలోని ఇతర కథనాలను కూడా చదవవచ్చు.
AI Image Note:Image created using AI for illustrative purposes.








