అంతర్వేది దేవస్థానానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అందుబాటు ధరల్లో రూమ్స్
ప్రతి సంవత్సరం అంతర్వేదికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు ఈ పుణ్యక్షేత్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను చూడాలని ఒకటి లేదా రెండు రోజులు ఇక్కడ ఉండాలని రూమ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. రూమ్స్ కోసం వెతికే వారికోసం ఈ పోస్ట్‌లో అంతర్వేదిలో రూమ్స్ – లాడ్జ్‌లు వివరాలు ఇవ్వబడుతున్నాయి.
అంతర్వేది దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే అంతర్వేది దేవాలయం చరిత్ర ఆర్టికల్‌ను చూడండి.

అంతర్వేదిలో లభించే రూమ్స్ రకాలు
అంతర్వేది వచ్చే Touristల సౌకర్యం కోసం అంతర్వేదిలో రూమ్స్ – లాడ్జ్‌లు వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నాయి. కుటుంబంతో వచ్చే వారి కోసం అంతర్వేది దేవస్థానం దగ్గరలోనే వసతి గృహాలు, రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో AC Rooms, Non-AC Rooms అందుబాటులో ఉన్నాయి. భక్తుల సౌకర్యాన్ని బట్టి వివిధ ధరల్లో రూమ్స్ లభిస్తాయి. దేవస్థానం ఎదురుగా ఉన్న రోడ్డులో ప్రైవేటు లాడ్జీలలో కూడా ఈ Rooms అందుబాటులో ఉన్నాయి.
Antarvedi Rooms – వివిధ లాడ్జీలలో సాధారణంగా రూమ్స్ ధరలు సుమారు ₹800 – ₹3500 వరకు ఉండవచ్చు. సీజన్, పండుగలు, రూమ్ రకం, సౌకర్యాలను బట్టి ధరలు మారే అవకాశం ఉంది. రూమ్ బుక్ చేసుకునే ముందు ప్రస్తుత ధరను లాడ్జి నిర్వాహకులతో నిర్ధారించుకోవడం మంచిది.
అంతర్వేది లో రూమ్స్ – లాడ్జ్ లు
గమనిక: ఈ రూమ్స్ మరియు లాడ్జీల ఫోన్ నంబర్లను నేను అంతర్వేదిని సందర్శించిన సమయంలో సంబంధిత నిర్వాహకులను/సిబ్బందిని సంప్రదించి సేకరించాను. రూమ్ ధరలు, ఖాళీ, సౌకర్యాలు కాలానుగుణంగా మారే అవకాశం ఉన్నందున బుక్ చేసుకునే ముందు ఫోన్ చేసి తాజా వివరాలను నిర్ధారించుకోండి.
1. Sri Lakshmi Narasimha Athidi Gruham శ్రీ లక్షి నరసింహ అతిధి గృహం
📍 Location: Temple దగ్గర
🛏 Rooms: AC / Non-AC / Family Rooms
🚗 Parking: Available 📞 Phone: 9440084065 , 9705865013
అంతర్వేది దేవస్తానం నందు ఆఫీస్ లో సంప్రదించి రూమ్ లు బుక్ చేసుకొనే అవకాసం ఉంది .
2. Sri Sai Lakshmi Narasimha Rooms – శ్రీ సాయి లక్ష్మి నరసింహ రూమ్స్
📍 Location: కొపనాతి కృష్ణమ్మ గారి విగ్రహం ఎదురుగా
🛏 Rooms Available:
🚗 Parking:
📞 Contact Number: 9908810955 , 8897629404
3. Adhi Krishna Rest House -ఆది కృష్ణ రెస్ట్ హౌస్
📍 Location: అంతర్వేది టెంపుల్ రోడ్ లో
🛏 Rooms Available: Ac/Non Ac
🚗 Parking: Yes
📞 Contact Number: 9491581216 , 9440471146
4. Akshay Rest House – అక్షయ్ రెస్ట్ హౌస్
📍 Location: అంతర్వేది టెంపుల్ రోడ్ లో
🛏 Rooms Available: Ac/Non Ac
🚗 Parking: Yes
📞 Contact Number: 7997531195 , 9951710264
5 .Rupa Lakshmi Narasimha Rest Rooms – రూపా లక్ష్మి నరసింహ రెస్ట్ rooms
📍 Location: అంతర్వేది లో 4 రోడ్ ల జంక్షన్ వద్ద
🛏 Rooms Available: Ac/Non Ac
🚗 Parking: Yes
📞 Contact Number: 9866344868 , 7989697868

6. ABN Residency – ఏబిఎన్ రెసిడెన్సీ
📍 Location: అంతర్వేది లో దేవస్థానం రోడ్ లో ౩౦౦ మీటర్ల దూరం లో
🛏 Rooms Available: Ac/Non Ac
🚗 Parking: Yes
📞 Contact Number: 9581619236 ,9505226999 , 9603011333
7. RAJU గారి GUAST HOUSE – రాజు గారి గెస్ట్ హౌస్
📍 Location: క్షేత్ర పాలకుడు శ్రీ నీలకంటేశ్వర స్వామి వారి దేవాలయం ప్రక్కనే
🛏 Rooms Available: Ac/Non Ac
🚗 Parking: Yes
📞 Contact Number: 9908822995 , 8106366679
8. REKHA Guest ROOMS – రేఖ గెస్ట్ రూమ్స్
📍 Location: శ్రీ నీలకంటేశ్వర స్వామి వారి దేవాలయం వెళ్ళే దారిలో
🛏 Rooms Available: Ac/Non Ac
🚗 Parking: Yes
📞 Contact Number: 8897265665 , 8341891797
9. SAIKRISHNA Guest HOUSE – సాయి కృష్ణ గెస్ట్ హౌస్
📍 Location: శ్రీ నీలకంటేశ్వర స్వామి వారి దేవాలయం వెళ్ళే దారిలో
🛏 Rooms Available: Ac/Non Ac
🚗 Parking: Yes
📞 Contact Number: 8309449220 , 9951802080
10. KANAKA DURGA RENTED ROOMS – కనకదుర్గా రూమ్స్
📍 Location: శ్రీ నీలకంటేశ్వర స్వామి వారి దేవాలయం వెళ్ళే దారిలో
🛏 Rooms Available: Ac/Non Ac
🚗 Parking: Yes
📞 Contact Number: 9908767634 , 9676147201 , 9398411435

11. .JOHN Residency – జాన్ రెసిడెన్సీ
- 📍 Location: అంతర్వేది బీచ్ లో
🛏 Rooms Available: Ac/Non Ac
🚗 Parking: Yes
📞 Contact Number: 8712121917 , 9959930896 ,7671901465
- అంతర్వేది బీచ్ లో ఉంది ఈ జాన్ రెసిడెన్సీ . రూమ్ లు కావలసిన వారు rooms అందుబాటులో ఉన్నాయి . ac రూమ్ ఉంది . పర్సన్స్ బట్టి రూమ్ ధరలు ఉంటాయి . బీచ్ లో స్నానాలు చేసిన వారు వాష్ rooms సెపరేట్ గా ఉపయోగించుకోవచును .
- అంతర్వేది బీచ్ లో రూమ్ ధరలు 1200 నుండి 1800 రూపాయల వరకు ఉంది . ఉత్సవాల సమయం లో ధరలు పెరుగుతాయని ఈ రెసిడెన్సి వారు తెలియజేసారు .
అంతర్వేదిలో రూమ్స్ బుక్ ఎలా చేయాలి
- అంతర్వేదిలో రూమ్స్ – లాడ్జ్‌లు కావాలని చూస్తున్నారా? ఉత్సవాల సమయంలో, సంక్రాంతి లాంటి పండుగ సందర్భాలలో రూమ్‌లు దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుండి, సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారు ముందుగా ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. లేదా Directగా లాడ్జికి వెళ్లి రూమ్స్ చూసుకుని బుక్ చేసుకోవచ్చు. ఉత్సవాల సమయంలో, సంక్రాంతి సమయంలో ముందుగా బుక్ చేసుకోవడం ఉత్తమం. ఆఫ్-సీజన్ రోజుల్లో మీరు రూమ్స్ చూసుకుని నచ్చిన ప్రాంతంలో నచ్చిన రూమ్ బుక్ చేసుకోవచ్చు.
- అంతర్వేదిలో కొన్ని రూమ్స్ – లాడ్జీలలో WhatsApp ద్వారా రూమ్స్ వివరాలు తెలుసుకుని బుక్ చేసుకునే అవకాశం ఉంది. కొన్ని లాడ్జీలలో అడ్వాన్స్ పేమెంట్‌ను ఫోన్ లేదా UPI ద్వారా చెల్లించే అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి బుక్ చేసుకునే ముందు సంబంధిత లాడ్జి నిర్వాహకులను సంప్రదించి రూమ్ ధర, ఖాళీ, అడ్వాన్స్ పేమెంట్, బుకింగ్ విధానం వంటి వివరాలను తెలుసుకోవడం మంచిది.
- బుకింగ్ మరియు పేమెంట్ విధానం ఒక్కో లాడ్జికి ఒక్కో విధంగా ఉండవచ్చు. ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకునే ముందు లాడ్జి పేరు, రూమ్ ధర, బుకింగ్ తేదీ, అడ్వాన్స్ మొత్తం వంటి వివరాలను స్పష్టంగా తెలుసుకుని చెల్లింపు చేయండి.

అంతర్వేదిలో ఉండే వారికి ట్రావెల్ టిప్స్
- అంతర్వేదిలో రూమ్స్ – లాడ్జ్‌లు పండుగ రోజుల్లో ముందుగానే బుక్ చేసుకుంటే మంచిది. లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం అనంతరం అంతర్వేదిలో చూడవలసిన ప్రాంతాలు — వశిష్ట ఆశ్రమం, అన్నా–చెల్లెల్ల గట్టు, గోదావరి నది సంగమ ప్రాంతం, లైట్ హౌస్, వశిష్ట ఆశ్రమం దగ్గరలో ఉన్న గోదావరి నదిలో మడ అడవుల బ్యాక్‌వాటర్ బోటింగ్ వంటి వివరాలను ముందుగానే తెలుసుకుని Travel చేయడం వలన మీ సమయం కలిసి వస్తుంది.
- అంతర్వేది మాత్రమే కాకుండా కోనసీమలో చాలా అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే మా కోనసీమ పర్యాటక ప్రదేశాలు article చూడండి.
- కోనసీమకు వచ్చే వారు ఇక్కడి ప్రత్యేక వంటకాలైన కొబ్బరి వంటలు మరియు స్థానిక రుచులను కూడా ఆస్వాదించవచ్చు. వాటి గురించి తెలుసుకోవాలంటే మా కోనసీమ కొబ్బరి వంటలు article చదవండి.
- అంతర్వేది దేవస్థానం ఉత్సవాల సమయంలో చాలా బిజీగా ఉంటుంది. మిగతా సమయాల్లో కార్తిక మాసంలో కొంత crowd ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా Weekendలో కూడా crowd ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కార్తిక మాసంలో వనభోజనాలకు వచ్చే వారితో బీచ్ పరిసరాలు సందడిగా కనిపిస్తాయి.
google map link : Antervedhi Devastanam

ముగింపు
అంతర్వేదికి వచ్చే భక్తులకు అంతర్వేదిలో రూమ్స్ – లాడ్జ్‌లు వివిధ ధరలకు అందుబాటులో ఉన్నాయి. పండుగలు లేదా సంక్రాంతి సమయంలో ముందుగానే ఫోన్ ద్వారా బుక్ చేసుకుంటే మంచిది. దేవాలయం దగ్గర లాడ్జ్ తీసుకుంటే దర్శనం కూడా సులభంగా ఉంటుంది. ముందుగా సరైన రూమ్ ఎంపిక చేసుకుంటే మీ అంతర్వేది యాత్ర ప్రశాంతంగా మరియు సుఖవంతంగా ఉంటుంది.
FAQ
Q1: అంతర్వేదిలో రూమ్స్ ధరలు ఎంత ఉంటాయి?
సాధారణంగా అంతర్వేది దేవస్థానం దగ్గరలో లాడ్జ్ రూమ్స్ సుమారు ₹800 నుండి ₹3500 వరకు ఉండవచ్చు. రూమ్ రకం, సీజన్, పండుగల సమయంలో ధరలు మారే అవకాశం ఉంది. బుక్ చేసుకునే ముందు ప్రస్తుత ధరను లాడ్జి నిర్వాహకులతో నిర్ధారించుకోవడం మంచిది.
Q2: అంతర్వేదిలో ముందుగా రూమ్స్ బుక్ చేయాలా?
పండుగల సమయంలో, ముఖ్యంగా సంక్రాంతి మరియు దేవస్థానం ఉత్సవాల సమయంలో ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.
Q3: అంతర్వేదిలో కుటుంబం కోసం మంచి లాడ్జీలు ఉన్నాయా?
అవును, అంతర్వేది ప్రాంతంలో కుటుంబంతో ఉండేందుకు వివిధ రకాల లాడ్జీలు, రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. AC, Non-AC వంటి రూమ్స్ కూడా కొన్ని లాడ్జీలలో లభిస్తాయి.
Q4: Antervedi Temple Timings – అంతర్వేది దేవస్థానం దర్శన సమయాలు ఏమిటి?
నేను అంతర్వేదిని సందర్శించిన సమయంలో ఆలయం వద్ద ఉన్న బోర్డుపై ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు, తరువాత మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు దర్శన సమయాలు ఉన్నట్లు చూశాను.
- ఉదయం : 6:30 AM – 1:00 PM
- మధ్యాహ్నం: 3:00 PM – 7:30 PM
పండుగలు, ప్రత్యేక పూజలు మరియు ఉత్సవాల సమయంలో సమయాల్లో మార్పులు ఉండవచ్చు. వెళ్లే ముందు తాజా సమయాలను నిర్ధారించుకోవడం మంచిది.
———————————————————————————————-
మా సైట్‌లోని మరికొన్ని ఆర్టికల్స్ చదవండి
- అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి చరిత్ర: అంతర్వేది దేవాలయం చరిత్ర, విశేషాలు మరియు చూడవలసిన ప్రదేశాల గురించి మా పూర్తి ఆర్టికల్ చూడండి.
- కోనసీమ చూడవలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు: కోనసీమలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడానికి కోనసీమ తిరుమల వాడపల్లి ఆర్టికల్ చదవండి.
- కోనసీమ సాంప్రదాయ రుచులు: కోనసీమ ప్రత్యేక వంటకాల గురించి తెలుసుకోవడానికి ఆత్రేయపురం పూతరేకులు, అంబాజీపేట పొట్టిక్కలు ఆర్టికల్స్ చదవండి.








