కోనసీమలో బెస్ట్ రిసార్ట్స్ – గోదావరి అందాల మధ్య సేదతీరేందుకు పూర్తి గైడ్
ఒక వైపు పచ్చని కొబ్బరి తోటలు, మరో వైపు గోదావరి నదీ సోయగాలు, మధ్యలో లంక గ్రామాలు… స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఒకరోజు గడపాలనుకునే వారికి ప్రకృతి ప్రసాదించిన అందమైన ప్రాంతం కోనసీమ. గోదావరి నదీ పాయల మధ్య ఏర్పడిన ఈ డెల్టా ప్రాంతం పచ్చని ప్రకృతి అందాలకు, కొబ్బరి తోటలకు, పంట పొలాలకు, గ్రామీణ వాతావరణానికి ఎంతో ప్రసిద్ధి చెందింది.
కోనసీమ ప్రాంతంలో వరి పంటలతో పాటు కొబ్బరి, పోక, మామిడి, నిమ్మ, జామ తోటలు, చేపల చెరువులు విస్తారంగా కనిపిస్తాయి. చుట్టూ గోదావరి నదీ పాయలు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో నగరాల రద్దీకి దూరంగా కొంత సమయం గడపాలనుకునే పర్యాటకులకు కోనసీమ మంచి గమ్యస్థానంగా నిలుస్తోంది.
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సౌకర్యవంతంగా బస చేయాలనుకునే పర్యాటకుల కోసం కోనసీమలో బెస్ట్ రిసార్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రిసార్ట్స్‌లో గోదావరి నది అందాలను ఆస్వాదించడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొత్త జంటలతో కలిసి ఆహ్లాదకరంగా సమయం గడపవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కొన్ని ప్రముఖ రిసార్ట్స్ గురించి ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం.

కోనసీమలో బెస్ట్ రిసార్ట్స్ ఎందుకు ప్రత్యేకం?
గోదావరి నది అందాల చెంతనే చల్లని, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ, శబ్ద కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో గడపడం కోనసీమలోని రిసార్ట్స్ ప్రత్యేకత. పచ్చని కొబ్బరి తోటలు, గోదావరి పాయలు, గ్రామీణ వాతావరణం కలగలిసిన ప్రకృతి అందాలు ఇక్కడి రిసార్ట్స్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
నగరాల రద్దీకి దూరంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒకరోజు లేదా వీకెండ్ ట్రిప్‌లో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ రిసార్ట్స్ మంచి ఎంపికగా ఉంటాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు కూడా ఇక్కడి వాతావరణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
కోనసీమలో కొన్ని రిసార్ట్స్‌ను ప్రభుత్వ సంస్థ AP Tourism నిర్వహిస్తుండగా, మరికొన్ని ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. రిసార్ట్‌ను బట్టి గదులు, రెస్టారెంట్, గోదావరి రివర్ వ్యూ, పార్కింగ్, స్విమ్మింగ్ పూల్, బోటింగ్ వంటి వివిధ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
కాబట్టి కోనసీమ పర్యటనలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సౌకర్యవంతంగా బస చేయాలనుకునే వారికి ఇక్కడి కోనసీమలో బెస్ట్ రిసార్ట్స్ మంచి అనుభూతిని అందించగలవు.
కోనసీమలోని ప్రముఖ రిసార్ట్స్
కోనసీమలో గోదావరి నది సమీపంలో ఉన్న పలు రిసార్ట్స్‌లో దిండి ప్రాంతంలోని Dindi Haritha Coconut Country Resort (APTDC), Dindi RVR Resort ప్రముఖమైనవి. వీటితో పాటు సోంపల్లి ప్రాంతంలోని Rio Vista Resorts కూడా గోదావరి రివర్ వ్యూ కోసం పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ఈ రిసార్ట్స్‌లో గోదావరి నది అందాలను ఆస్వాదించడంతో పాటు, కుటుంబంతో కలిసి ప్రశాంతంగా సమయం గడపడానికి అవసరమైన పలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
Dindi Haritha Coconut Country Resort (APTDC)
Location: దిండి గ్రామం, మలికిపురం మండలం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
గోదావరి నది ఒడ్డున ప్రకృతి అందాల మధ్య ఉన్న Dindi Haritha Coconut Country Resort కోనసీమలో పర్యాటకులను ఆకర్షించే రిసార్ట్స్‌లో ఒకటి. ఈ రిసార్ట్‌లో కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపడానికి అనువైన వాతావరణం ఉంటుంది.
సౌకర్యాలు:
- A/C రూమ్స్
- Conference Hall
- Restaurant
- Bar
- Swimming Pool
- Parking
- బోటింగ్ సదుపాయం
- phone : 98487 80524 , 99128 77055
ఇక్కడ స్థానికంగా లభించే తాజా చేపలతో చేపల కూర వంటి గోదావరి ప్రాంతపు వంటకాలను రుచిచూడవచ్చు.
ధర: రూమ్ ధరలు సుమారు ₹2,200–₹2,500 నుంచి ప్రారంభమవుతాయని సమాచారం. అయితే సీజన్, తేదీ, రూమ్ రకాన్ని బట్టి ధరలు మారవచ్చు.

గోదావరి నదిలో బోటింగ్ ప్రత్యేకత
Dindi Haritha Coconut Country Resort ప్రత్యేకతల్లో ముఖ్యమైనది బోటింగ్ సదుపాయం. పర్యాటకుల కోసం గోదావరి నదిలో విహరించేందుకు బోటింగ్ సదుపాయం అందుబాటులో ఉంది.
ఇక్కడ కేరళ తరహా హౌస్‌బోట్ సదుపాయం కూడా ఉండటం ప్రత్యేక ఆకర్షణ. హౌస్‌బోట్‌లో ప్రయాణించాలనుకునే వారు ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.
అలాగే పర్యాటకుల కోసం సుమారు 10–12 మంది ప్రయాణించగల మరో బోటు సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. రిసార్ట్‌లో టికెట్ తీసుకుని గోదావరి నదిలో కొంతసేపు బోటింగ్‌ను ఆస్వాదించవచ్చు.
చిన్న పిల్లల కోసం ఉయ్యాలలు, ఆడుకునే సదుపాయాలు కూడా ఉన్నాయి. రిసార్ట్‌ను సందర్శించడానికి వచ్చే వారికి ప్రవేశ రుసుముతో లోపలికి వెళ్లి, అందుబాటులో ఉన్న కొన్ని సదుపాయాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సదుపాయాలు, టికెట్ ధరలు మారే అవకాశం ఉన్నందున వెళ్లే ముందు రిసార్ట్‌తో నిర్ధారించుకోవడం మంచిది.
ఎవరికి అనుకూలం?
కుటుంబంతో కలిసి వెళ్లేవారికి, చిన్న పిల్లలతో పర్యటించే వారికి, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి, అలాగే కొత్త జంటలకు ఈ రిసార్ట్ మంచి ఎంపికగా ఉంటుంది.

Dindi RVR Resort ( Club Mahindra )
Location: దిండి గ్రామం, మలికిపురం మండలం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
దిండి ప్రాంతంలోని మరో ఆకర్షణీయమైన రిసార్ట్ Dindi RVR Resort. గోదావరి ప్రాంత ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ రిసార్ట్‌లో కుటుంబంతో కలిసి సౌకర్యవంతంగా గడపడానికి అనువైన వాతావరణం ఉంటుంది.
సౌకర్యాలు:
- A/C రూమ్స్
- Conference Hall
- Restaurant
- Swimming Pool
- Parking
- Phone : 92288 17201
- ఇతర రిసార్ట్ సదుపాయాలు
ఇక్కడ పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల భారతీయ వంటకాలు అందుబాటులో ఉంటాయి.
ధర: రూమ్ ధరలు సుమారు ₹10,500 నుంచి ప్రారంభమవుతాయని సమాచారం. అయితే రూమ్ రకం, తేదీ, సీజన్ మరియు అందుబాటులో ఉన్న ఆఫర్లను బట్టి ధరలు మారవచ్చు.
ప్రత్యేకత:
ఈ రిసార్ట్ చుట్టూ భవనాలు, మధ్యలో కొలను, అందులో కొబ్బరి చెట్లు, కలువ పూలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అందమైన నేపథ్యం కారణంగా ఫోటో షూట్లకు కూడా ఈ ప్రదేశం ఆకర్షణీయంగా ఉంటుంది.
రిసార్ట్‌లో గుర్రపు బండి ద్వారా విహరించే అవకాశం కూడా పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.
ఎవరికి అనుకూలం?
కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపాలనుకునే వారికి, చిన్న పిల్లలతో వచ్చే వారికి, అలాగే కొత్త జంటలకు ఈ రిసార్ట్ అనుకూలంగా ఉంటుంది.

Rio Vista Resorts
Location: సోంపల్లి, రాజోలు మండలం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సోంపల్లి గ్రామంలోని పుష్కరాల రేవు సమీపంలో ఉన్న Rio Vista Resorts గోదావరి రివర్ వ్యూ కోసం ఆకర్షణీయమైన ప్రదేశంగా చెప్పవచ్చు.
రిసార్ట్ నుంచి గోదావరి నదిని, నదిలో ప్రయాణించే పడవలను, చేపల వేటను ప్రత్యక్షంగా చూడవచ్చు. గోదావరి నదిని ఎదురుగా చూస్తూ ప్రశాంతంగా సమయం గడపాలనుకునే వారికి ఈ రిసార్ట్ ప్రత్యేకంగా నచ్చవచ్చు.
సౌకర్యాలు:
- A/C రూమ్స్
- Conference Hall
- ఇతర వసతి సదుపాయాలు
- Phone : 79895 22511
ధర: సుమారు ₹3,500 నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. ధరలు మారే అవకాశం ఉన్నందున బుకింగ్‌కు ముందు ప్రస్తుత ధరను నిర్ధారించుకోవడం మంచిది.
ప్రత్యేకత:
గోదావరి రివర్ వ్యూ ఈ రిసార్ట్ ప్రధాన ఆకర్షణ. నదిలో తిరిగే పడవలు, చేపల వేట వంటి గోదావరి ప్రాంత జీవనశైలిని దగ్గరగా చూడటానికి అవకాశం ఉంటుంది.
ఎవరికి అనుకూలం?
కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా గడపాలనుకునే వారికి, చిన్న పిల్లలతో వచ్చే వారికి, అలాగే కొత్త జంటలకు ఈ రిసార్ట్ అనుకూలంగా ఉంటుంది.

ఈ రిసార్ట్స్‌లో లభించే సౌకర్యాలు
కోనసీమలోని ఈ రిసార్ట్స్‌లో రిసార్ట్‌ను బట్టి వివిధ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా A/C రూమ్స్, రెస్టారెంట్, పార్కింగ్ వంటి ప్రాథమిక సదుపాయాలతో పాటు కొన్ని రిసార్ట్స్‌లో స్విమ్మింగ్ పూల్, బోటింగ్, గోదావరి రివర్ వ్యూ వంటి అదనపు సౌకర్యాలు కూడా ఉన్నాయి.
కుటుంబంతో వెళ్లేవారు పిల్లల కోసం ఉన్న సదుపాయాలు, బోటింగ్ అందుబాటులో ఉందా లేదా, రెస్టారెంట్‌లో భోజన సదుపాయం ఉందా వంటి విషయాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది.
రిసార్ట్ బుక్ చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
కోనసీమలోని రిసార్ట్స్‌లో సాధారణ రోజుల్లో రూమ్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉన్నప్పటికీ, వారాంతాలు, వేసవి సెలవులు, పండుగలు మరియు పర్యాటక రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.
రిసార్ట్ బుక్ చేసుకునే ముందు రూమ్ ధర, Check-in మరియు Check-out సమయాలు, భోజన సదుపాయం, బోటింగ్ ఛార్జీలు, స్విమ్మింగ్ పూల్ వినియోగ నిబంధనలు, పార్కింగ్ వంటి వివరాలను తెలుసుకోవాలి.
ముఖ్యంగా హౌస్‌బోట్ లేదా ఇతర ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించాలనుకునే వారు ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది.
ధరలు మరియు సదుపాయాలు కాలానుగుణంగా మారవచ్చు కాబట్టి బుకింగ్ చేసే ముందు సంబంధిత రిసార్ట్‌ను సంప్రదించి తాజా వివరాలను తెలుసుకోవడం ఉత్తమం.
రిసార్ట్స్ చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు
కోనసీమ రిసార్ట్స్ లో బస చేసే పర్యాటకులు సమీపంలోని అనేక పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.
ముఖ్యంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, గోదావరి నది సముద్రంలో కలిసే సంగమ ప్రాంతం, అప్పనపల్లి బాల బాలాజీ దేవస్థానం, అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.
అలాగే సమీపంలోని పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా పర్యాటకులకు ముఖ్యమైన సందర్శనా ప్రదేశంగా ఉంటుంది.
కోనసీమ ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారు కొబ్బరి తోటలు, ఉప్పుటేరులు మరియు గ్రామీణ వాతావరణాన్ని కూడా చూడవచ్చు. కేశనపల్లి, శంకరగుప్తం వంటి ప్రాంతాలు ప్రకృతి, గ్రామీణ జీవనశైలిని ఆస్వాదించాలనుకునే వారికి ఆసక్తికరంగా ఉంటాయి.
రాజోలు పరిసర ప్రాంతాల్లో గోదావరి నది ఒడ్డున ఉన్న కొన్ని ప్రదేశాలు సినిమా షూటింగ్ లొకేషన్లుగా కూడా కనిపిస్తాయి.

కోనసీమ రిసార్ట్స్‌కు వెళ్లేందుకు ఉత్తమ సమయం
కోనసీమ పర్యాటక ప్రదేశాలను ప్రకృతి అందాలతో ఆస్వాదించాలనుకునే వారికి సాధారణంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచి సమయంగా చెప్పవచ్చు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో బయట ప్రదేశాలను సందర్శించడం సౌకర్యంగా ఉంటుంది.
డిసెంబర్, జనవరి నెలల్లో ఉదయం వేళల్లో కనిపించే మంచు, పచ్చని కొబ్బరి చెట్లు, నీలాకాశం, గోదావరి నది అందాలు కోనసీమ ప్రకృతికి మరింత ఆకర్షణను తీసుకొస్తాయి.
వర్షాకాలంలో వాతావరణం కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, రిసార్ట్స్‌లోనే ఎక్కువ సమయం గడపాలనుకునే వారికి అది పెద్ద సమస్య కాకపోవచ్చు.
వేసవిలో గోదావరి నది సమీపంలోని రిసార్ట్స్‌లో స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలను ఆస్వాదిస్తూ కుటుంబంతో సమయం గడపవచ్చు. అయితే వేసవిలో బయట పర్యటనలకు వెళ్లేటప్పుడు వేడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

కోనసీమ రిసార్ట్స్‌కు ఎలా చేరుకోవాలి?
కోనసీమలోని ఈ రిసార్ట్స్‌కు ప్రధానంగా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. రాజోలు, అమలాపురం, రావులపాలెం, పాలకొల్లు వంటి పట్టణాల నుంచి రోడ్డు మార్గంలో దిండి మరియు ఇతర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు.
రాజోలు ప్రాంతంలో బస్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి ఆటోలు, టాక్సీలు వంటి స్థానిక రవాణా సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు.
సమీప ప్రాంతాల నుంచి దూరాలు సుమారుగా ఇలా ఉంటాయి:
- రాజోలు నుంచి దిండి రిసార్ట్స్: సుమారు 8.5 కి.మీ.
- రావులపాలెం నుంచి దిండి రిసార్ట్స్: సుమారు 45 కి.మీ.
- అమలాపురం నుంచి దిండి రిసార్ట్స్: సుమారు 30 కి.మీ.
- కాకినాడ నుంచి దిండి రిసార్ట్స్: సుమారు 88 కి.మీ.
- పాలకొల్లు నుంచి దిండి రిసార్ట్స్: సుమారు 15 కి.మీ.
- విజయవాడ నుంచి దిండి రిసార్ట్స్: సుమారు 153 కి.మీ. (మచిలీపట్నం మార్గం)
- విశాఖపట్నం నుంచి దిండి రిసార్ట్స్: సుమారు 270 కి.మీ.
- హైదరాబాద్ నుంచి దిండి రిసార్ట్స్: సుమారు 480 కి.మీ.
రైలులో వచ్చే పర్యాటకులు పాలకొల్లు రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దిండి వైపు ప్రయాణించవచ్చు. విమాన ప్రయాణం చేసేవారు సమీప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కోనసీమకు చేరుకోవచ్చు.
ప్రయాణానికి ముందు రహదారి పరిస్థితులు, రవాణా సదుపాయాలు మరియు కోనసీమలో బెస్ట్ రిసార్ట్స్ కు సంబంధించిన తాజా లొకేషన్ వివరాలను ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది.

ముగింపు
గోదావరి నది అందాలు, పచ్చని కొబ్బరి తోటలు, ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం కలిసిన కోనసీమలో రిసార్ట్ స్టే ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. కుటుంబంతో కలిసి ఒకరోజు లేదా వీకెండ్ ట్రిప్‌కు వెళ్లాలనుకున్నా, ప్రకృతి మధ్య ప్రశాంతంగా సమయం గడపాలనుకున్నా, కోనసీమ రిసార్ట్స్ మంచి ఎంపికగా ఉంటాయి.
దిండి ప్రాంతంలోని Haritha Coconut Country Resort, Dindi RVR Resortతో పాటు సోంపల్లి ప్రాంతంలోని Rio Vista Resorts వంటి ప్రదేశాలు తమ ప్రత్యేకమైన వాతావరణం మరియు అందుబాటులో ఉన్న సదుపాయాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
మీ అవసరానికి, బడ్జెట్‌కు మరియు ప్రయాణ ప్రణాళికకు అనుగుణంగా సరైన కోనసీమలో బెస్ట్ రిసార్ట్స్ ను ఎంచుకుని, గోదావరి అందాలను ఆస్వాదిస్తూ కోనసీమలో మంచి సమయాన్ని గడపవచ్చు.
గమనిక: రూమ్ ధరలు, బోటింగ్ ఛార్జీలు, ప్రవేశ రుసుములు, Check-in/Check-out సమయాలు మరియు ఇతర సదుపాయాలు కాలానుగుణంగా మారవచ్చు. బుకింగ్‌కు ముందు సంబంధిత రిసార్ట్‌ను సంప్రదించి తాజా వివరాలను నిర్ధారించుకోవడం మంచిది.









