Konaseema Sarees: Award-Winning Handloom Sarees from Andhra Pradesh

By konaseema life

Updated On:

 

అంగర గ్రామం చేనేత  పరిచయం  

కోనసీమ చేనేత చీరలు ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వస్త్రాలు.  కోనసీమ ప్రాంతంలోని అంగర గ్రామం చేనేత కళకు చిరునామాగా నిలిచింది.  konaseema  లో తరతరాలుగా చేతి మగ్గాలపై చీరలు నేసే నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు నివసిస్తున్నారు. వారి కృషి, అంకితభావానికి గుర్తింపుగా భారత ప్రధాని చేతుల మీదుగా బంగారు, వెండి పథకాలు పొందిన చేనేత కళాకారులు కూడా ఈ గ్రామంలో ఉన్నారు.   అంగర గ్రామంలో 1977 సంవత్సరంలో 22  మంది సభ్యులతో “గణపతి చేనేత సహకార సంఘం” ఏర్పాటు చేయబడింది. కాలక్రమంలో ఈ సంఘం అభివృద్ధి చెందుతూ, ప్రస్తుతం 670 మంది సభ్యులతో విజయవంతంగా కొనసాగుతోంది.                    

Konaseema Handlooms
రాట్నం పై నూలు వాడుకుతున్న మహిళ

కోనసీమ అంగర చేనేత చీరల గొప్పతనం

Konaseema లో ఈ చేనేత సహకార సంఘాల ద్వారానే ముడిసరుకైన నూలు, జరీ తదితర వస్తువులు నేతకారులకు అందజేయబడుతున్నాయి. నేతకారులుచేతి మగ్గాలపై తయారు చేసిన వివిధ రకాల చేనేత ఉత్పత్తులు తిరిగి ఈ సహకార సంఘాలకే అందించబడతాయి.అంగర గ్రామంలో తయారయ్యే గద్వాల్ చీరలు, జంధాని చీరలు, జరిచీరలు, డ్రెస్ మెటీరియల్, ధోతి,కండువాలు వంటి ఉత్పత్తులను ఈ సహకార సంఘాల ద్వారానే మార్కెటింగ్ చేయడం జరుగుతుంది.

ఈ చేనేత సహకార సంఘాలకు ప్రజలు నేరుగా వచ్చి తమకు నచ్చిన చీరలు,ఇతర చేనేత వస్త్రాలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. దీంతో మధ్యవర్తులు లేకుండా నేరుగా నేతకారులకు మద్దతు అందుతుంది.  అంగర గ్రామం చేనేత కళ కేవలం ఒక చీరలు నేయడమే మాత్రమే కాదు,  అది కోనసీమ సంస్కృతి,  సంప్రదాయానికి  ప్రతీకగా నిలిచిన జీవన విధానం.

Konaseema Handloom Sarees కోనసీమ లో చేనేత చీరాల తయారీ విధానం

రాట్నంపై నులు వడకడం 

Konaseema లో చేనేత చీరాల తయారికి కావలసిన నూలు  కావలసిన రంగులలో డైయింగ్ చేయబడి వస్తాయి.  ఈ నూలును  రాట్నం అనే  చక్రాలమీద తిరిగే  చిన్న డబ్బాలకు  ఈ నూలును దారం గా చుడతారు . ఈ పని చాల కష్టంతో కూడుకున్న పని . నూలు సరిగా లేకపోతే ఈ దారం తెగిపోతూ ఉంటుంది . దానిని మరల అతికి రాట్నం పై చుడతారు

మరాసు ( పెద్ద చక్రం ) 

నూలువడికినదారాలడబ్బాలు ఒకమగ్గానికిసుమురు 30 నుండి 32 అవసరం అవుతాయి . ఈ 32 డబ్బాలను    ఈమరసు  అనే పెద్దచక్రానికి ఈదారాలు వరసక్రమంలో మగ్గానికికావలిసిన డిజైన్ప్రకారంవరసగాచుడతారు .   ఇలాఒక  batch పూర్తీ అవడానికిమూడు గంటల సమయంపడుతుంది .  ఇది కరెంటు లేకుండా మనిషి సహాయంతో తిప్పబడుతుంది  . ఇలా దారాలన్నీ వరసక్రమంలోబయటికితీస్తారు .

 

మరాసు (పెద్దచక్రం ) Traditional Weaving Method
మరాసు (పెద్దచక్రం )
మరాసు ను ఉపయోగిస్తున్న నేతన్న

 

పడుగు 

సైజింగ్ ) మరాసుఅనేచక్రంనుండితెచ్చినదారాలసముదాయాన్నిగంజిపెట్టిపొడవుగాసాగదీస్తారు . ఈపనిచేయడానికి 3 నుండినలుగురుమనుషులుఅవసరంఅవుతారు . ఈపనినిసాదారణంగాఉదయంపూటచేస్తారు . ఇలాపడుగుమీదసాగదీసిమగ్గానికిఎక్కించడానికివీలుగాచుడతారు .  ఈప్రాసెస్అంటాఅవడానికి 3 నుండి5గంటలుసమయంపడుతుంది . ఈపడుగుమీదసాగదీసిననూలుదారాలుఒక batch కిసుమారు 9 నుండి 10 చీరాలనుమగ్గంమీదనేయగలరు .

మగ్గం  

పడుగు నుండి వచ్చిన  నూలు దారాల చుట్ట ని  మగ్గం పై ఎక్కించి , మగ్గానికి ఉన్న  దారాల కి అటాచ్ చేయబడతాయి . దీనిలోనే జరి మరియి చీర  డిజైన్  కూడా నేతన్నలు  ఏర్పాటు చేస్తారు . మగ్గం కుర్చుని ఒక  వ్యక్తి  ఉదయం నుండి సాయంత్రం వరకు ఆగకుండా చేస్తే 2 రోజులకు ఒక చీర పూర్తి అవుతుందని  అంగర గ్రామం లోని  నేతన్న తెలియజేసారు .

Konaseem Traditional Weaving cheneta మగ్గం నేస్తున్న మహిళ
మగ్గం నేస్తున్న మహిళ

  అద్బుతమైన అందమైన చీరలు నేయడానికి ఒకకుంటుంబం మొత్తం శ్రమ పడవలసి వస్తుంది.నూలు  వడకడం నుండి మరాసు ,పడుగు చేయడం ,మగ్గ్గం నేయడం అన్నీ పనులు  కుటుంబం లోనిసబ్యులు చేస్తుంటారుఇలా చేయడానికి లేని వారు కూలికి మనుషులను పెట్టి చేయించ వలసి వస్తుంది .  ఇంత స్టే కష్టపడి చీర తాయారు చేస్తే   ఒక చీరకు  5 వందల  నుండి  8 వందలు   మిగలటంచాలా కష్టం గా ఉందని  చెబుతున్నారు .

ముడిసరుకు కొరత     

నూలు డబ్బాలు
Handloom Materials
నూలు డబ్బాలు

   
సహకారాసంగాల ద్వారా లబించే  నూలు సరిగా లబించడం లేదని ,  గ్రామం లో ఉన్న మగ్గాలకి 
సరిపడా నూలు  అండడం లేదని ఇక్కడి నేతన్నలు తెలిపారు .   ముడి సరుకు కొరత కారణంగా  బయటి దళారుల వైపు చుడవలసి వస్తుంది .  బయటి  వ్యాపారులుఅంగర గ్రామంలోచేనేతకళాకారులకు  ముడిసరుకు ఇచ్చి చీరలు నేయించు కుంటారు .   గ్రామం లోయారు చేసిన చీరలకు వీరే బ్రాండింగ్ వేసుకుని అమ్ముకుంటారని  ఇక్కడి వారు అన్నారు .  కనీసం పని దొరికుతుంది కదా అని చీరలు చేసినా… ఆశించిన ఆదాయం పొందడం లేక పోతున్నారు .   సహకార సంగం ద్వారా చీర తయారు చేస్తే కొంచెం లాభం ఉంటుందని చెబుతున్నారు .

Konaseema  Handlooms Marketing చేనేత చీరల మార్కెటింగ్ 

అంగర గ్రామం లో ఉన్న గణపతి చేనేత సహకార సంఘం సభ్యులకి ముడిసరుకు ఇచ్చి చీరలు తయారీ చేయిస్తారు  . ఇలా తయారైన  గద్వాల్ , జందాని , వేంకటగిరి జరి చీరలు  సహకార సంగాల ద్వార మార్కెటింగ్   హోల్ సేల్ గా   రిటైల్ గా మార్కెటింగ్ చేయబడతాయి . మనం కూ డా   నేతన్నలు  తయారు చేసిన  చీరలను  కొనుగోలు చేయవచ్చు .  ఆప్కో ద్వారా  చేనేత కాటన్ చీరలు వివిధ ప్రముఖ పట్టణాలలో అమ్మబడుతున్నాయి .   అంగర గ్రామం లో ఉన్న గణపతి చేనత సహకారసంఘం   సంవత్సరానికి 2 కోట్ల  టర్నోవర్  తో ఉంది.

అంగర లో నేత కార్మికులు - కపిలేశ్వరపురం మండలం
అంగర లో నేత కార్మికులు – కపిలేశ్వరపురం మండలం

ముగింపు 

నేటి ఆధునిక యుగంలో చేనేతరంగాన్ని చాలామంది తక్కువగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.  అయితే మనం కొనుగోలు చేసే ఒక్క చేతి మగ్గం చీర కూడా ఒక నేతన్నకు అందించే చిన్నసహాయంగా మారుతుంది. తరతరాలుగా మనకు అందిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వ సంపదే చేనేతరంగం. మనుగడ కోసం పోరాడుతున్న ఈ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే. Konaseema లో అందమైన ప్రదేశాలు మాత్రమే కాదు చేనేత చీరలు లభిస్త్రాయి .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమజిల్లా, కపిలేశ్వరపురం  మండలం   అంగరగ్రామం లో తయారయ్యే చేనేత చీరలు  దీనికి సజీవ ఉదాహరణ. అవకాశం దొరికితే అంగర గ్రామాన్ని సందర్శించి, లేదా మీ ఊరిలోని చేనేతసహకార సంఘాన్ని దర్శించిఈ నేతన్నలు తయారు చేసినచీరలను కొనుగోలు చేసి వారి జీవితాలకు తోడ్పాటు అందిద్దాం. 

చేనేతను ఆదరించడం అంటే ఒక వృత్తిని కాదు, ఒక సంస్కృతిని, ఒక జీవన విధానాన్ని కాపాడటమే.

ఆన్ లైన్  లో ఈ శారీలు కొనుగోలు చేయడానికి ఈ మొబైల్ నెంబర్ ను కాంటాక్ట్ చేయండి  : 910304 8964      

మా వెబ్ సైట్  లో  గోదావరి జిల్లా లోని  మరికొన్ని ఆర్టికల్స్  గురించి చదవండి : వాడపల్లి 

అయినవిల్లి గణపతి ఆలయం ఈ వీడియోలోచూడండి  : అయినవిల్లి గణపతి ఆలయం

Konaseema Sarees: Award-Winning Handloom Sarees
Konaseema Sarees: Award-Winning Handloom Sarees

 

అంగర చేనేత సంఘం - బోర్డు - కపిలేశ్వరపురం
అంగర చేనేత సంఘం – బోర్డు – కపిలేశ్వరపురం
చేనేత శారీస్ - అంగర - కోనసీమ
చేనేత శారీస్ – అంగర – కోనసీమ

 

ఈ  క్రింద వీడియో ద్వారా అంగర గ్రామం లో తయారయ్యే చేనేత చీరలను  చూడండి             

 

 

 

 

Related Post

Leave a Comment