అంతర్వేది లక్శ్మీ నరసింహ స్వామి ఆలయం – చరిత్ర & విశేషాలు

By konaseema life

Updated On:

Sri Lakshmi Narasimha temple - Antarvedhi

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చరిత్ర , అంతర్వేది లో చూడవలసిన ప్రదేశాల వివరాలు                                                                          

అంతర్వేది  ఈ పేరు చెప్పగానే  ఒక ఆద్యాత్మిక భావన !  గోదావరి  సంగమ ప్రదేశం కావడం తో ఇక్కడికి వచ్చే  పర్యాటకులు అధికంగానే ఉంటారు. అంతర్వేది లో చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి . అంతర్వేది లక్శ్మీ నరసింహ స్వామి దేవాలయం , అన్న చేల్లిలి గట్టు అనే పిలిచే  గోదావరి సంఘమ ప్రాంతం , ఆ సముద్రం  ప్రక్కనే  ఉన్న లైట్ హౌస్ ,వశిష్ట ఆశ్రమం , గోదావరి బ్యాక్ వాటర్ లో బోటింగ్ .

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము , br అంబేద్కర్ కోనసీమజిల్లా , సఖినేటిపల్లి మండలం లో చివరగా ఉన్న గ్రామం అంతర్వేది . పురాణాల ప్రకారం శ్రీరాముడు   ఇటువైపు పయనిచు నప్పుడు  సీతాదేవితో   సఖి నేడు ఈ పల్లి లో  ఈ  అంతర్వేదిక వద్ద విశ్రాంతి తెసుకొందుము . అని చెప్పే నని అప్పటినుండి ఈ ప్రాంతానికి  సఖినేటిపల్లి అని  అంతర్వేదిక  అంతర్వేది  గా మారిందని మరో కధనం ప్రచారం లో ఉంది .

అంతర్వేది
అంతర్వేది

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చరిత్ర             

 పురాణ కథలు :  కృతయుగం లో  వశిష్ట మహర్షి  గోదావరి లోని ఒక పాయను అంతర్వేది మీదుగా తీసుకుని వచ్చి  సముద్రం లో కలపి  , అక్కడి ప్రసాంతమైన వాతావరణం లో తపస్సు చేసుకోనసాగాడు . రక్త విలోచనుడు అనే రాక్షసుడు  వశిష్ట  గోదావరి చెంత  ఆ పరమ శివుని కోసం తప్పస్సు చేసి  శివుని వద్ద నుండి  వరం పొందుతాడు . మానవుల చె  తనకు చావు ఉండకూడదు అని తన రక్తం భూమి మీద పడినచో  క్రింద పడ్డ ప్రతి ఇసుక రేణువు లో  నుండి రక్తవిలోచనులు పుట్టుకు రావాలని  వరం పాడుతాడు  . తనకు చావు లేదని  రక్త విలోచనుడు  ఋషులను , యజ్న యాగాదులు  చేసే వారిని  హింసిస్తూ ఉంటాడు . వశిష్ట మహర్షి  ని కూడా ఇబ్బందులకు గురి చేస్తాడు .

అప్పుడు వశిష్టుడు    లక్ష్మి నరసింహ స్వామి ని ప్రార్ధించి  రక్షించమని  వేడుకొంటాడు .   రక్త విలోచనుడు  అనే రాక్షసుణ్ణి చంపడానికి  నరహరి గా  అవతరిస్తారు .  ఆ నరహరి  రక్త విలోచానికి ఘోర యుద్ధం జరుగుతుంది .  నరహరి రక్తవిలోచానుని శిరస్సు ఖండిచాగా , ఆ క్రింద పడిన రక్తం నుండి వేలమంది రక్త విలోచానులు పుట్టుకురాసాగారు . కొన్ని వారాల పాటు యుద్ధం సాగుతుంది . ఆ రక్తం ఏరులా పారుతుంది . గుడికి  దగ్గర లోనే ” రక్త తుల్య నది”  గా ఇప్పటికి ఉంది .  రక్తవిలోచనుల శిరస్సు లు నరహరి ఖండిస్తూనే ఉన్నారు .

అశ్వరూడంబిక  ( గుర్రాలక్క ) :,  అంతటా నరహరి తనసోదరి ఐన  ఆశ్వరుడంబిక   సహాయం కోరగా , ఆశ్వరుడంబిక  తన నాలుకను పెద్దగా  చాపి , గుర్రం పై తిరుగుతూ  రక్త విలోచ నుని శిరస్సులు ఖండిచాగా వచ్చిన రక్తం భూమి మీద పడకుండా చేసేను . అంతట నరహరి  రక్తవిలోచనుడి ని సంహరించి ఈ ప్రాంతమునకు విముక్తి కలిగించెను .

ఆ తర్వాత వశిష్టుడు తూర్పు అభి ముఖముగా  కూర్చుని  ఇక్కడే కొలువై ఉండాలని  లక్ష్మి నరశింహ స్వామి  ని వేడుకున్నారు . అంతటా స్వామి వారు  పశ్చిమ ముఖముగా  అవతరించి ఉన్నారు .

త్రేతాయుగం : త్రేతాయుగం లో రావణాసుర సంహారం అంనతరం రాముడు , లక్ష్మణుడు , ఆంజనేయస్వామి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్నారని బ్రహ్మ పురాణం లో చెప్పబడినది .

ద్వాపరయుగం : ద్వాపరయుగం లో అర్జునుడు తీర్ధ యాత్రలు చేయుచూ  స్వామి వారిని దర్శించుకున్నారని బ్రహ్మ పురాణం లో చెప్పబడింది.

ఆలయ  నిర్మాణము  

కలియుగం లో ఈదేవాలయాన్ని  మందపాటి కేశవదాసు అనే యాదవుడు  మొదట నిర్మాణము  కట్టెలతో  నిర్మించి పూజించ సాగెను .  తర్వాత కాలం లో  పెద్దాపురం  రెడ్డి రాజులు చెక్కలతో ఈ ఆలయం నిర్మించి నట్లు చరిత్ర బట్టి తెలుస్తుంది .  క్రి శ . 1823 లో ఓడలరేవు కు చెందిన  కొపనాతి కృష్ణమ్మ   ప్రస్తుతం ఉన్న ఆలయం నిర్మించినట్లు  ఇక్కడి శాసనాలను బట్టి తెలుస్తుంది .  తర్వాత కాలం లో   పెద్దాపురం సంస్తానాధీశులు , మొగల్తూరు రాజ వంశీయులు ఈ ఆలయాన్ని సంరక్షించారు .

కొపనాతి కృష్ణమ్మ
కొపనాతి కృష్ణమ్మ

పండుగలు & ఉత్సవాలు   

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి  ఉత్సవాలు   ప్రతి సంవత్సరం మాఘ సుద్ద సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు  స్వామి వారి  ఉత్సవాలు  జరుగుతాయి . రధసప్తమి తో అత్యంత వైబవంగా  ఉత్సవాలు ప్రారంబమవుతాయు . దక్షిణ కాశి గా పోరొందిన లక్ష్మీనరసింహస్వామి వారి  కళ్యాణ ఉత్సవాలు  10 రోజులు జరుగుతాయి .   ఈ సమయం లో లక్షలాది మంది భక్తు లు  స్వామి వారిని దర్శించుకుంటారు .  కళ్యాణం అనతరం  మద్యాహ్నం  స్వామి వారి రధోత్సవం అత్యంత వైబవంగా జరుగుతుంది .  ఈ రధోత్సవం లో  మొగల్తూరు మహారాజ వారు కొబ్బరికాయ కొట్టి ఈ రధోత్సవం  ప్రారంబిస్తారు .

ఈ రధోత్సవం  లో  లక్ష్మి నరసింహస్వామి వారి సోదరి  గుర్రలక్క  గుడి వరకు వెళ్లి  అక్కడ తన సోదరికి పట్టువస్త్రాలు సమర్పించి  తిరిగివస్తారు . దీనికి  ఉన్న కధనం ప్రకారం  తన సోదరుడికి  ప్రతియేటా  కళ్యాణం  అని మూతి తిప్పు కున్నారని  అందుకనే సోదరికి ముందుగా పట్టు వస్త్రాలు సమర్పించి  వస్తారని  పురాణాలను బట్టి తెలుస్తుంది . పూర్వం ఈ  రధోత్సవం ఈ గుర్రలక్క గుడి వరకు వెళ్లి తిరిగి వచ్చేది  . ప్రస్తుతం రోడ్ లు  వీలులేక  గుర్రలక్క గుడి కి కొంచే ముందు వరకు వెళ్లి   మరలా స్వామి వారి గుడి వద్దకు రధాన్ని తీసుకు  వస్తారు  .  రధోత్సవం తరువాత  చక్రస్నానం చివరగా తెప్పోత్సవం  తో స్వామి వారి ఉత్సవాలు ముగుస్తాయి .  కార్తిక మాసం  లో  రొజూ  వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు  . మాఘమాసం లో కుడా ప్రత్యేకపుజలు జరుగుతుంటాయి . ప్రతి రోజు  ఉదయం 10 గంటలకు  భక్తుల కోసం  శ్రీ నరసింహ సుదర్శన హోమం జరుగును

అన్నదానం :  స్వామి  వారి సన్నిధి లో    సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం  నిత్య అన్నదానం ప్రతి రోజు జరుగుతుంది . వచ్చిన భక్తులకు  రుచి కరమైన  మంచి భోజనం భక్తులకు అందిస్తున్నారు . ఈ కార్యక్రం దాతల నుండి తీసుకున్న విరాళాల  ద్వారా  జరుగుతుంది .  ఈ దేవస్తానం లో  వడ్డించే  పెరుగు రుచి చుస్తే  చాల అద్బుతంగా ఉంటుంది .

Antarvedi Radhotsavam
Antarvedi Radhotsavam

🕒 Antervedi Temple Timings -దర్శన సమయాలు       

  • అంతర్వేది ఆలయ  దర్శనసమయాలు ఉదయం  6.30 గంటల నుండి  మద్యాహ్నం  1 గంట  వరకు  తదుపరి  3  గంటల నుండి సాయంత్రం  7: 30  గంటల వరకు ఉంటుంది .

అంతర్వేది లో చూడవలసిన ప్రదేశాలు

గోదావరి సంగమ ప్రాంతం  

గోదావరి నది -సముద్ర సంగమం :  మహారాష్ట లోని నాసిక త్రయంబకం లో పుట్టిన  మన జీవనది గోదావరి నది   మహారాష్ట్ర  (  , తెలంగాణా  560 km),   ఆంధ్రప్రదేశ్ ( 772 km)  గుండా  మొత్తం 1465   కిలోమీటర్లు   ప్రవహించి   ఆంధ్ర ప్రదేశ్ లోని  br అంబేద్కర్ కోనసీమ జిల్లా లో  అంతర్వేది వద్ద సముద్రం లో కలుస్తుంది .  ఈ సంగమ ప్రదేశం  చూడటానికి  సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తుంటారు .

అన్నా చెల్లిల్ల గట్టు :  గోదావరి జిల్లా లలో   ఈ  గోదావరి నది సముద్రం లో కలిసే  ప్రాంతానికి అన్న చెల్లిల్ల గట్టు  అని  పిలుస్తుంటారు .  

లైట్ హౌస్  ప్రాముఖ్యత

బ్రిటిష్ కాలం  లో నిర్మించిన  ఈ లైట్ హౌస్  నావికుల కు  తీరప్రాంతం గుర్తింపు కోసం ఉపయోగ  పడేది . కాల క్రమం లో పాతది   సముద్రం లో కలసి  శిధిల మవగా కొత్త్తగా  ప్రస్తుత లైట్ హౌస్  నిర్మాణం జరిగింది .  పురాతన  లైట్ హౌస్ కి వెనుక   లోపల  సుమారు ఆరు కిలోమీటర్ల  లోపల మత్సకార గ్రామమ ఉండేదని ఇక్కడి గ్రామం లోని పెద్దవారు చెబుతున్నారు . ఆ గ్రామం కా లాక్రమం లో  సముద్రం లో కలసిపోయిందని  తెలియజేస్తున్నారు .

పర్యాటకులకు ,   ఫోటోగ్రాఫర్ లకు  ఈ లైట్ హౌస్  మంచి ఉత్తేజితమైన  ప్రాంతము .   ఈ మద్య కొత్త జంట లకు  ఈ ప్రాంతం లో ఫోటో షూట్ లు విరివిగా జరుగుచున్నాయి .ఈ లైట్ హౌస్ పై నుండి చుస్తే  గోదావరి సముద్ర సంగమ ప్రాంతం , అలాగే అంతర్వేది లక్ష్మి నరసింహస్వామి దేవాలయం , పల్లిపాలెం గ్రామం కనుల విందుగా కనిపిస్తుంది . కార్తిక మాసం లో వనభోజనలతో ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది .

ముఖ్యప్రమాద హెచ్చరిక : గోదావరి సంఘమ ప్రాంతం లో నీటిలో  స్నానాలు , సేల్ఫీ  లా కోసం  దిగటం అత్యత ప్రమాద కరం !

బ్యాక్ వాటర్ బోటింగ్

స్తానిక వశిష్ట గోదావరి లో బోటింగ్ పాయింట్  ఉంది .  ఈ బోటింగ్ పాయింట్  నుండి  అన్నాచేల్లిలగట్టు వరకు బోటింగ్ చేయవచును . అలాగే ఇక్కడ ఉన్న  బ్యాక్ వాటర్ లో బోటింగ్ చేసి , మడ అడవుల సహజ సౌందర్యం  ఆస్వాదించ వచ్చును  .

బోటింగ్ కాంటాక్ట్ నంబర్ : 99494 11191

వశిష్ట ఆశ్రమం : లక్ష్మి నరసింహస్వామి వారి  గుడికి సమీపం లో  గోదావరి చెంతనే వశిష్టుడు ఈ ప్రాంతం లో తపస్సు చేసిన  పవిత్ర  పుణ్యస్థలం ఈ వశిష్టఆశ్రమం .ఈ మద్య కాలం లో నిర్మితమైన  ఈ ఆశ్రమానికి కలువపువ్వు ఆకారం లో  చుట్టూ నీరు ఉండి , అద్బుతమైన కట్టడం ఇది. ధ్యానం  చేసే వారికి  ప్రశాంత వాతావరణం ఇక్కడ లభిస్తుంది .

Antervedhi Light House
Antervedhi Light House

అంతర్వేది ఎలా చేరుకోవాలి?    

సమీప బస్సు స్టేషన్  :  రాజోలు

లక్ష్మీనరసింహస్వామి   దేవస్తానం చేరుకోవడానికి సమీప నగరం రాజోలు నుండి ప్రతి గంటకు బస్సులు నడపబడుతున్నవి . పాలకొల్లు నుండి చించినాడ బ్రిడ్జి మీదుగా అంతర్వేది చేరుకోవచ్చు .ఉత్సవ సమయాలలో రాజమండ్రి , రావులపాలెం , కాకినాడ , భీమవరం ,పాలకొల్లు నుండి ప్రత్యెక సర్వీసులు నడుపుతారు .    పశ్చిమ  గోదావరి జిల్లా  నరసాపురం  నుండి గోదావరి నది పై పంటి ( జెట్టి ) దాటి సఖినేటిపల్లి చేరుకొని  అక్కడ నుండి అంతర్వేది చేరుకోవచ్చు .

సమీప రైల్వే స్టేషన్  : నర్సాపురం , పశ్చిమగోదావరి జిల్లా  .   విజయవాడ నుండి అంతర్వేది చేరుకోవాలను వారికి ఈ నరసాపురం మీదుగా గోదావరి నది దాటి సఖినేటిపల్లి  మీదుగా అంతర్వేది  చేరుకోవచ్చు . హైదరాబాద్  నుండి వచ్చే వారు ఈ నర్సాపురం రైల్వే స్టేషన్  ఉపయోగించుకోవచును .

సమీప ఎయిర్పోర్ట్   : రాజమండ్రి   కోరుకొండ  లో కలదు .

వసతి గృహాలు- Rented Rooms :

ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు వసతి గృహాలు  , సత్రాలు అందుబాటులో ఉన్నాయి . అంతర్వేది  వచ్చిన పర్యాటకులు  ఈ వసతి గృహాలు రుసుము చెల్లించి ఉపయోగించుకోవచును .  అంతర్వేది లో రూమ్ లు  లాడ్జీలు  ధరలు  వివరాలు మా ఆర్టికల్ లో చూడగలరు

మా వెబ్ సైట్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాల గురించి చదవండి :  అయినవిల్లి ఆది గణపతి    ఏడూ శనివారాల వేంకటేశ్వరుడు వాడపల్లి      పురాతన పలివెల శివాలయం

 

ఈ వీడియో లో అంతర్వేది విశేషాలు చూసి తెలుసుకోండి !

 

Related Post

Leave a Comment