కోనసీమలో 200 సంవత్సరాల పురాతన దొమ్మేటి వారి మేడ – బోడసకురు గ్రామానికి గర్వకారణం

200 సంవత్సరాల పురాతన మేడ  

             అమలాపురం పసర్లపూడి బ్రిడ్జి కి మద్య లో  హైవే ప్రక్కనే గోదావరి నదిని అనుకుని ఉన్న అందమైన పురాతన పల్లెటూరు  బోడసకుర్రు .  ఈ బోడసకురు గ్రామం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము , br అంబేద్కర్ కోనసీమ జిల్లాలో  మండల కేంద్రమైన అల్లవరం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం   నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది.  రాజోలు
నుండి పట్టణానికి
  16 కిలోమీటర్ల దూరం లోను ,  కాకినాడ నుండి పట్టణానికి  69 కిలోమీటర్ల దూరం లోను ఉంది .

           హై వే రోడ్ నుండి కొచెం దూరం వెళ్ళేటప్పటికి  దొమ్మేటి వారి మేడ గంబీరంగా ఒకసారి నిలబడి చూడాలి అనిపించేలా  కనిపిస్తుంది .   ఈ ఇంటిని 200 సంవత్సరాల క్రితం దొమ్మేటి వెంకట రెడ్డి గారు  నిర్మించారు
.
  సుమారు 50 గదులు , 50 గుమ్మాలు ఉన్న ఈ బావనం లోపల 2 మండువా  లోగిళ్ళు ఉన్నాయి .  సుమారు 4 ఎకరాల్లో నిర్మించిన ఈ బవనం గత చరిత్రకు నిదర్శనగా నిలిస్తుంది .

దొమ్మేటి
వారి మేడ

దొమ్మేటి వారి మేడ

 

 

దొమ్మేటి వెంకట రెడ్డి గారు1853 లో  కోనసీమ లోని బోడసకురు గ్రామం లో  జన్మించారు .  వెంకటరెడ్డిగారి తల్లి  వెంకటస్వామి
, తల్లి ఆచమ్మ గారు .    పూర్వకాలం ఉపాది కోసం గాని , వ్యాపారం కోసం చాల మంది  బర్మా దేశం వెళ్ళేవారు . అలా   దొమ్మేటి వెంకట రెడ్డి గారు  1880 లో  వ్యాపారంనిమిత్తం బర్మదేసం వెళ్లారు  .  అయన  షిప్పింగ్  బిజినెస్ లో  చాల
ఉన్నత శిఖరాలు అడిరోహించారు . వ్యాపార వేత్తగా పేరు ప్రతిష్టలు సంపాదించడమే కాకుండా
,  ఉపాది
కోసం బర్మా దేశం వచ్చే వారిని
, కుల మత ప్రాంత బేదం లేకుండా వారికి  సహాయం చేసేవారు . బ్రిటిష్ కాలం  లో నే బర్మా దేశం లో ( ప్రస్తుత మయన్మార్ లో  )  ఎన్నో  సేవాకార్యక్రమాలు చేసారు . వయోజన విద్య కోసం అప్పట్లోనే స్కూల్స్ ఏర్పాటుకు   దొమ్మేటి వెంకట రెడ్డి గారు కృసి చేసారు . అలాగే    బర్మ లో  రామాలయం నిర్మించారు .

          బర్మా దేశం లో  అక్కడ తెలుగు వారందరితో కాళీ మాత ఉత్సవాలు  చాల వైబవంగా జరిపించేవారట . అప్పటి ఫోటో లు కూడా ఇక్కడ మనము చూడవచు .  దసరా  కి  కొనాసీమ లో  బేతాళ స్వామి ఉత్సవాలు బ్రరంబించింది  కుడా దొమ్మేటి వెంకటరెడ్డి గారే  నని వారి వారి వారసులు చెబుతున్నారు .

 గత చరిత్రకు అదారమైన పురాతన ఫోటోలు వీరి బావనం లోపల చూడవచ్చు .

 

   బర్మా దేశం లో బ్రిటిష్ వారితో సమన హోదా తో  షిప్పింగ్    వ్యాపారాలు చేసిన  వెంకటరెడ్డి గారు  మన కోనసీమ లో అమలాపురం   లో  ఒక లైబ్రరీ ,  పేరూరు లో  1906 లోనే  high school నిర్మించి  దానికి పోషణ నిమితం  46 ఎకరాలు స్కూల్  కి  రాసిచారు.  బోడసకురు గ్రామం లో కులమతాలకు అతీతం గా అందరికి అవసరమైన  అన్నిరకాల సహకారాలు చేసేవారు . వెంకటరెడ్డి  గారి  గురించి గ్రామం లో ఎవరిని అడిగిన వారి గురించి , వారు చేసిన సేవలు గురించి చుబుతున్నారు.

                  కళ్ళు గీత కార్మికులు ఉన్న తమవారు  eduga  అనే పేరుతో  పిలిచే  పిలిపు తమ జాతి వారికి అవమాన కరంగా ఉందని  ,   జాతిని  ఏకం తమ జాతి పేరు శెట్టిబలిజ  గా గవర్నమెంట్ రికార్డ్స్ లోకి చేర్చేలా దొమ్మేటి వెంకట రెడ్డి గారి
కృషి
  చేసారు .  ఎప్పటికి శెట్బబలిజ కులస్తులు  సంఘాలు  వెంకటరెడ్డి గారిని తమ ఆరాధ్య దైవంగా తమ గుండెల్లో  నిలుపుకున్నారు . అందుకనే అయన విగ్రహాలు చాల గ్రామాలలో నెలకొల్పి ఆయన చేసిన సేవలు గుర్తుకు
తెచుకున్తున్నారు .
  

 

1906  లో నిర్మించిన పేరూరు highschool

 

 

        బ్రిటిష్ వారి కలం లో నే చదువు యొక్క విలువ  గుర్తించిన రెడ్డి గారు తమ ప్రాంతం లో ఉన్నత విద్య చదివే అవకాసం లేక పోవడం తో  స్వంతంగా ఖర్చులతో  స్కూల్ నిర్మించారు .  స్కూల్ ఫోషణ నిమిత్హం 46 ఎకరాలు ఈ స్కూల్ కి ఇచారు . బోడసకురు గ్రామం నుండి ప్రస్తుతం  హైవే ప్రక్కన అకిరా హాస్పటల్ ప్రక్క రోడ్ లో వెళితే  పేరూరు గ్రామం లో దొమ్మేటి వెంకట రెడ్డి గారు నిర్మించిన స్చ్చూల్ కనిపిస్తుంది . 

       ఇప్పటికీ దొమ్మేటి వారి వారషులు   పిల్లలకి కి పుస్తకాలూ , అవసరమైన సహాయ సహకారాలు ఇప్పటికి వారు చేస్తుండటం  వారి మంచి మనసుకు నిదర్శనం . 

        1906 నుండి ఈ స్కూల్ లో  10 క్లాసు వరుకు  చదువుకుని  పై చదువులు చదివి  ఈన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు చాల మంది ఉన్నారు  . వారుకూడా స్కూల్ కి కవలైసన మైలిక సదుపాయాల ఏర్పాటులో సహకరిస్తునారని  హెడ్ మాస్టర్ గారు తెలిపారు .  అత్యదునిక  సదుపాయాలతో ఉన్న ఈ గవర్నమెంట్ స్కూల్ లో  cc కెమెరా లు   క్లాస్స్ రూమ్ పర్యవేక్షణ ,  సౌండ్ సిస్టం తో  ప్రైవేటు స్కూల్స్ కి దీటుగా ఈ స్కూల్ ఉంది .

 

 

 

 

Leave a Comment