Konaseema Haritha Coconut Resorts Best Tourist Place
గోదావరి నదీ ఒడ్డ్డున అద్బుతమైన పర్యాటక కేంద్రం River Side Best Tourist Place
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో కోనసీమ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది . కోనసీమ లోని ప్రక్రుతి అందాలు , బీచ్ లు , కేరళ లోని అల్లెప్పి లా , గోవా లా కనిపిస్తాయి . ఎందుకంటే ఇక్కడి వచ్చిన పర్యాటకులు అదే మాట ఆనందం అదే మాట చెబుతారు . బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , మల్కిపురం మండలం దిండి గ్రామం లో ఉన్న ఏపి tourisum వారి River Side Best Tourist Place హరిత కోకో నట్ రిసార్ట్స్ ప్రత్యేక గుర్తింపు పొందింది . సహజమైన అందాలతో , ప్రశాoతమైన వాతావరణం లో గడపాలి అనుకునే వారి కి గోదావరి నది ఒడ్డున నిర్మించబడిన ఈ రిసార్ట్స్ ( Haritha coconut resorts ) ప్రక్కన చక్కని ప్రదేశం.

River Side Best Toursit Place గోదావరి నది ఒడ్డున ప్రక్రుతి అందాలు
ఒక ప్రక్క పచ్చని కొబ్బరి తోటలు, ప్రశాంత మైన నిశ్శబ్ద వాతావరణం, గోదావరి నది సోయగాలు, దూరం గా చిన్న చిన్న పడవల లో గోదావరి లో చేపలు పదుతూ కనిపించే జాలరులు , పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. శబ్ద కాలుష్యం , వాయు కాలుష్యం లేని ప్రశాంతంగా విశ్రాంతి పొందాలనుకునే వారికి ఇది ఉత్తమమైన పర్యాటక కేంద్రం.
హరిత కోకోనెట్ హౌస్ బోట్స్ – ప్రత్యెక ఆకర్షణ
హౌస్ బోట్స్ సదుపాయాలు: ఈ రిసార్ట్స్‌లోని ప్రధాన ఆకర్షణ కేరళ తరహా హౌస్ బోట్స్. కేరళలో ఏ విధమైన బోటింగ్ ఉందొ , అటువంటి బోటింగ్అ నుభూతిని మన గోదావరి నదిలో ఉన్న హౌస్ బోట్స్ పర్యాటకులకు అందిస్తున్నారు . ఈ హౌస్ బోట్స్ లో డబుల్ బెడ్ రూమ్, సూట్ రూమ్ , మంచి భోజన సదుపాయం తో పాటు , గోదావరి నదిలో విహారం చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది . పర్యాటకులు గంటల లెక్కన హౌస్ బోట్స్ బుక్ చేసుకుని గోదావరి నదిలో విహరించవచ్చు. రాత్రి వేళలో హౌస్ బోట్స్‌లో బస చేసిన వారికి, గోదావరి ప్రత్యేక వంటకాలు మరియు గోదావరి లో లభించే తాజా చేపల కూరలు కోనసీమ సంప్రదాయ భోజనం తాజాగా వండి అందిస్తున్నారు.

హరిత కోకోనెట్ రిసార్ట్స్ లో సదుపాయాలు
AP Tourism వారు నిర్వహిస్తున్న ఈ హరిత కోకోనట్ రిసార్ట్స్ లో అన్ని వయస్సుల వారికి అనుకూలమైన సదుపాయాలు ఉన్నాయి. చిన్న పిల్లల కోసం ఊయలలు , టాయ్ కార్స్ , స్విమ్మింగ్ పూల్ , ఫ్యామిలీ రెస్టారెంట్ , బార్ సదుపాయం అందుబాటులో ఉంది . చక్కని వాతావరణం లో గోదావరి నది ప్రక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ లో స్నానాలు చేయడానికి అన్నీ వసతులు ఉన్నాయి . ప్రత్యేకంగా చిన్న పిల్లలకు స్విమ్మింగ్ పూల్ లో ఆడుకోవడానికి వీలుగా వాటర్ బెలూన్స్ అందుబాటులో ఉన్నాయి.
రిసార్ట్స్ లోని వసతి గృహాలు లో బసచేసే పర్యాటకులు , ఈ సదుపాయాలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. కేవలం రిసార్ట్స్ చూడడానికి వచ్చే వారు ఎంట్రీ ఫీజు ₹10 తీసుకుని లోపలికి పంపిస్తారు . ఎలా వచ్చిన వారు కుడా స్విమ్మింగ్ పూల్ రుసుము చెల్లించి వాడుకోవచ్చు . అలాగే బోటింగ్ చేయవచును . రెస్టారెంట్ లో భోజనాలు మన ఆర్డర్ పై తయారుచేయించుకుని రుచి చూడవచ్చు .
Godavari River Side Boting గోదావరి నదిలో బోటింగ్ వివరాలు
హౌస్ బోటు , చిన్న పడవ పై గ్రూప్ గా బోటింగ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది . ఈ సదుపాయాలు పర్యాటకులు రుసుము చెల్లించి ఉపయోగించుకోవచ్చును . దిండి రిసార్ట్స్ లో ఉన్న బోటింగ్ వివరాలు , కెపాసిటి వివరాలు . Vasista godavari boat వశిష్ట గోదావరి బోట్ కెపాసిటీ: 10 మంది , పెద్దవారికి: ₹80 రూపాయలు , చిన్నపిల్లలకు: ₹60 రూపాయలు తీసుకుని 15 నిమిషాలు గోదావరి నది లో తిప్పుతారు . దిండి రిసార్ట్స్ నుండి దగ్గరలోని చించినాడ బ్రిడ్జి క్రింది నుండి కొంచెం దూరం గోదావరి నదిలో పరిసర గ్రామ అందాలు వివరిస్తూ మరల తిరిగి బోటింగ్ పాయింట్ కి తీసుకు వస్తారు. ఈ బోటింగ్ లో లైఫ్ జాకెట్స్ కుడా ప్రయాణికులకు అందిస్తారు . వేగవంతమైన బోటింగ్ అనుభవం గంట / 2 గంటల పాటు బుక్ చేసుకునే అవకాశం ఉంది .
హరిత కోకో నట్ రిసార్ట్స్ చిరునామా :
దిండి గ్రామం , మలికిపురం మండలం , బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , ఆంధ్రప్రదేశ్ , ఇండియా
Godavari River Side Best Toursit Place ఈ రిసార్ట్స్ ను ఎలా చేరుకోవాలి .
🚍 బస్సు రవాణా సౌకర్యాలు
సమీప బస్ స్టాండ్: రాజోలు . రాజోలు నుండి ప్రైవేట్ వాహనాలలో రిసార్ట్స్ చేరుకోవచ్చు. రాజోలు నుండి దిండి రిసార్ట్స్ కి సుమారు 5 కిలోమీటర్లు దూరం ఉంటుంది . జిల్లా కేంద్రం అమలాపురం నుండి సుమారు 36 కిలోమీటర్లు దూరం ఉంటుంది.
🚆 సమీప రైల్వే స్టేషన్లు
ఈ రిసార్ట్స్ కి దగ్గర సమీప రైల్వే స్టేషన్ పశ్చిమ గోదావరిజిల్లా , పాలకొల్లు సుమారు 15 కిలోమీటర్లు ఉంటుంది . అలాగే మరో రైల్వే స్టేషన్ నర్సాపురం – సుమారు 18 కిలోమీటర్లు ఉంది . రాజమండ్రి లో రైల్వేస్టేషన్ సదుపాయాన్ని కుడా ఉపయోగించు కో వచ్చును .
✈️ సమీప విమానాశ్రయం
రాజమండ్రి కోరుకొండ లో విమానాశ్రయం కలదు . హరిత కోకోనట్ రిసార్ట్స్ నుండి – సుమారు 60 కిలోమీటర్లు ఉంది .
దగ్గర లోని పర్యాటక పుణ్యక్షేత్రాలు
దిండి రిసార్ట్స్ నుండి కోనసీమ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించు కోవచ్చు . ముఖ్యంగా ఆత్రేయపురం మండలం లో ఉన్న ఏడూ శని వారాల వెంకన్న వాడపల్లి దేవస్టానం , 55 కిలోమీటర్ల దూరం ఉంది . అలగే బదిలీలస్వామి గా పేరుపొందిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవస్తానం , ర్యాలీ , అలాగే మామిడికుదురు మండలం లో ఉన్న అప్పనపల్లి బాల బాలాజీ దేవస్థానం , సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉంది . అలాగే సఖినేటిపల్లి మండలం లో ఉన్న అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం , 20 కిలోమీటర్ల దూరం ఉంది . అంతర్వేది లో గోదావరినది సముద్రం లో కలిసే సముద్ర సంగమ ప్రాంతం (అన్నచెల్లిల గట్టు ) దర్శించు కోవచ్చు . ఈ ప్రాంతాలకు వెళ్లేందుకు సొంత వాహనం ఉంటే మరింత సౌకర్యం, లేకపోతే ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి .

ముగింపు
కుటుంబం తో పాటు సెలవు దినాలు గడపాలి అనుకునే వారికి గోదావరి జిల్లాలు చక్కని అనుభూతిని కలిగిస్తాయి . ముక్యంగా కోనసీమ లో కొబ్బరి చెట్లు , చల్లని సూర్య అస్తమయ సమయం చాల ఆహ్లాదముగా అనిపిస్తుంది . ప్రకృతి అందాలు, గోదావరి నది విహారం, హౌస్ బోట్స్, రుచికరమైన కోనసీమ సాంప్రదాయ రుచుల అనుభవం కావాలంటే River Side Best Tourist Place కోనసీమ హరిత కోకోనట్ రిసార్ట్స్ తప్పనిసరిగా సందర్శించాల్సిన పర్యాటక కేంద్రం.
Dindi Haritha Coconut Resorts : 9848780524
మా వెబ్ సైట్ లో మరికొన్ని ఆర్టికల్స్ చదవండి : అంబాజీపేట పొట్టిక్కలు
మా వెబ్ సైట్ లో మరికొన్ని దేవాలయాల గురించి చదవండి : వాడపల్లి
అయినవిల్లి గణపతి ఆలయం ఈ వీడియోలోచూడండి : అయినవిల్లి గణపతి ఆలయం
కోనసీమ లోని హరిత కోకో నట్ రిసార్ట్స్ వీడియో లో చుడండి : దిండి రిసార్ట్స్











