200 సంవత్సరాల పురాతన మేడ
బోడసకురు లో దొమ్మేటి వారి మేడ చరిత్ర
కోనసీమలో 200 సంవత్సరాల పురాతన దొమ్మేటి వారి మేడ అనగానే, మనకు ఒక ఇంటి కథ మాత్రమే కాదు — ఒక గ్రామ చరిత్ర, ఒక వంశ పరంపర, తరతరాలుగా నిలిచిన సంప్రదాయాల జ్ఞాపకం గుర్తుకు వస్తుంది. బోడసకురు గ్రామంలో నిలిచిన ఈ చారిత్రక మేడ, అప్పటి కాలంలోని నిర్మాణ శైలి, కుటుంబ విలువలు మరియు గ్రామ జీవన విధానానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కాలం ఎంత మారినా, ఈ మేడ కోనసీమ చారిత్రక సంస్కృతికి గర్వకారణంగా నిలిచి, నేటి తరానికి చరిత్ర విలువను తెలియజేస్తోందని గ్రామస్తులు చెబుతారు .
అమలాపురం పాసర్లపూడి బ్రిడ్జి కి మద్య లో హైవే ప్రక్కనే గోదావరి నదిని అనుకుని ఉన్న అందమైన పురాతన పల్లెటూరు బోడసకుర్రు . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము , br అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం లో ఉంది ఈ బోడసకురు గ్రామం . . ఒక వైపు గోదావరి నది , పచని కొబ్బరి చెట్లు , పంట పొలాలతో చాలా అందమైన గ్రామం ఈ బోడసకురు . మండల కేంద్రమైన అల్లవరం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది. రాజోలు
నుండి పట్టణానికి 16 కిలోమీటర్ల దూరం లోను , కాకినాడ నుండి పట్టణానికి 69 కిలోమీటర్ల దూరం లోను ఉంది .
మేడ నిర్మాణం ఎలా ప్రారంభమైంది?
ఎవరు నిర్మించారు
అమలాపురం నుండి బోడసకురు హైవే రోడ్ నుండి కొచెం దూరం వెళ్ళేటప్పటికి దొమ్మేటి వారి మేడ గంబీరంగా ఒకసారి నిలబడి చూడాలి అనిపించేలా కనిపిస్తుంది . ఈ ఇంటిని 200 సంవత్సరాల క్రితం దొమ్మేటి వెంకట రెడ్డి గారు నిర్మించారు. సుమారు 50 గదులు , 50 గుమ్మాలు ఉన్న ఈ బావనం లోపల 2 మండువా లోగిళ్ళు ఉన్నాయి . సుమారు 4 ఎకరాల్లో నిర్మించిన ఈ భవనం గత చరిత్రకు నిదర్శనగా నిలిస్తుంది .
దొమ్మేటి వంశ పరంపర గ్రామానికి చేసిన సేవలు
వెంకటరెడ్డి గారు 1853 లో కోనసీమ లోని బోడసకురు గ్రామం లో జన్మించారు . వెంకటరెడ్డిగారి తండ్రి వెంకటస్వామి , తల్లి ఆచమ్మ గారు . పూర్వకాలం ఉపాది కోసం గాని , వ్యాపారం కోసం చాల మంది బర్మా దేశం వెళ్ళేవారు . అలా దొమ్మేటి వెంకట రెడ్డి గారు 1880 లో వ్యాపారం నిమిత్తం బర్మా దే దేశం వెళ్లారు . అయన షిప్పింగ్ బిజినెస్ లో చాల ఉన్నత శిఖరాలు అదిరోహించారు . వ్యాపార వేత్తగా పేరు ప్రతిష్టలు సంపాదించడమే కాకుండా , ఉపాది కోసం బర్మా దేశం వచ్చే వారిని , కుల మత ప్రాంత బేదం లేకుండా వారికి సహాయం చేసేవారు . బ్రిటిష్ కాలం లోనే బర్మా దేశం లో ( ప్రస్తుత మయన్మార్ లో ) ఎన్నో సేవాకార్యక్రమాలు చేసారు . వయోజన విద్య కోసం అప్పట్లోనే స్కూల్స్ ఏర్పాటుకు దొమ్మేటి వెంకట రెడ్డి గారు కృసి చేసారు . అలాగే బర్మా లో రామాలయం నిర్మించారు .
బర్మా దేశం లో అక్కడ తెలుగు వారందరితో కాళీ మాత ఉత్సవాలు చాల వైబవంగా జరిపించేవారట . అప్పటి ఫోటో లు కూడా ఇక్కడ మనము చూడవచు . దసరా కి కోనసీమ లో బేతాళ స్వామి ఉత్సవాలు ప్రారంబించింది కుడా దొమ్మేటి వెంకటరెడ్డి గారే నని వారి వారసులు చెబుతున్నారు .
కోనసీమలో 200 సంవత్సరాల పురాతన మేడ గత చరిత్రకు అదారమైన పురాతన ఫోటోలు వీరి బావనం లోపల చూడవచ్చు .
బర్మా దేశం లో బ్రిటిష్ వారితో సమన హోదా తో షిప్పింగ్ వ్యాపారాలు చేసిన వెంకటరెడ్డి గారు మన కోనసీమ లో అమలాపురం లో ఒక లైబ్రరీ , పేరూరు లో 1906 లోనే స్కూల్ నిర్మించి దానికి పోషణ నిమితం 46 ఎకరాలు స్కూల్ కి రాసిచ్చారు . బోడసకురు గ్రామం లో కులమతాలకు అతీతం గా అందరికి అవసరమైన అన్నిరకాల సహకారాలు చేసేవారు . వెంకటరెడ్డి గారి గురించి గ్రామం లో ఎవరిని అడిగిన వారి గురించి , వారు చేసిన సేవలు గురించి చుబుతున్నారు.
కళ్ళు గీత కార్మికులు ఉన్న తమవారు ఈడుగ అనే పేరుతో పిలిచే పిలిపు తమ జాతి వారికి అవమాన కరంగా ఉందని , జాతిని ఏకం తమ జాతి పేరు శెట్టిబలిజ గా గవర్నమెంట్ రికార్డ్స్ లోకి చేర్చేలా దొమ్మేటి వెంకట రెడ్డి గారి
కృషి చేసారు . ఎప్పటికి శెట్బబలిజ కులస్తులు , సంఘాలు వెంకటరెడ్డి గారిని తమ ఆరాధ్య దైవంగా తమ గుండెల్లో నిలుపుకున్నారు . అందుకనే అయన విగ్రహాలు చాల గ్రామాలలో నెలకొల్పి ఆయన చేసిన సేవలు గుర్తుకు
చేసుకుంటున్నారు .
1906 లో నిర్మించిన పేరూరు హై స్కూల్
బ్రిటిష్ వారి కలం లో నే చదువు యొక్క విలువ గుర్తించిన రెడ్డి గారు తమ ప్రాంతం లో ఉన్నత విద్య చదివే అవకాసం లేక పోవడం తో స్వంతంగా ఖర్చులతో స్కూల్ నిర్మించారు . స్కూల్ ఫోషణ నిమిత్హం 46 ఎకరాలు ఈ స్కూల్ కి ఇచారు . బోడసకురు గ్రామం నుండి ప్రస్తుతం హైవే ప్రక్కన అకిరా హాస్పటల్ ప్రక్క రోడ్ లో వెళితే పేరూరు గ్రామం లో దొమ్మేటి వెంకట రెడ్డి గారు నిర్మించిన స్ల్కూల్ కనిపిస్తుంది .
ఇప్పటికీ దొమ్మేటి వారి వారసులు పిల్లలకి కి పుస్తకాలూ , అవసరమైన సహాయ సహకారాలు ఇప్పటికి వారు చేస్తుండటం వారి మంచి మనసుకు నిదర్శనం .
1906 నుండి ఈ స్కూల్ లో 10 క్లాసు వరుకు చదువుకుని పై చదువులు చదివి ఈన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు చాల మంది ఉన్నారు . వారుకూడా స్కూల్ కి కవలైసన మైలిక సదుపాయాల ఏర్పాటులో సహకరిస్తునారని హెడ్ మాస్టర్ గారు తెలిపారు . అత్యదునిక సదుపాయాలతో ఉన్న ఈ గవర్నమెంట్ స్కూల్ లో cc కెమెరా లు క్లాస్స్ రూమ్ పర్యవేక్షణ , సౌండ్ సిస్టం తో ప్రైవేటు స్కూల్స్ కి దీటుగా ఈ స్కూల్ ఉంది .
ముగింపు
కోనసీమలో 200 సంవత్సరాల పురాతన దొమ్మేటి వారి మేడ ఒక కట్టడం మాత్రమే కాదు, అది బోడసకురు గ్రామ చరిత్రకు నిలువెత్తు గుర్తు. తరతరాలుగా నిలిచిన ఈ మేడ, అప్పటి జీవన విధానం, కుటుంబ విలువలు మరియు గ్రామ ఐక్యతను నేటి తరానికి గుర్తు చేస్తోంది. ఇలాంటి పురాతన కట్టడాలను కాపాడుకోవడం మన బాధ్యత మాత్రమే కాకుండా, భవిష్యత్తు తరాలకు ఈ కట్మడాలు ఆ కాలం లో ఎలా కట్టేవారు , అంతదృడం గా ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలియజేయడానికి గొప్ప మార్గం కూడా. కోనసీమ లో పురాతనమైన ఈ మేడ, ఎప్పటికీ గ్రామానికి గర్వకారణంగా నిలుస్తుంది.
మా వెబ్సైట్ లో కోనసీమ లోని సాంప్రదాయ రుచులు గురించి మరిన్ని పోస్టులు చదవండి : పొట్టిక్కలు
ఈ కోనసీమలో 200 సంవత్సరాల పురాతన మేడ వీడియో లో చూడాలంటే ఈ లింక్ ను నొక్కి చూడగలరు : బోడసకురు












