ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ- బ్రిటిష్ వారిచే అవార్డు పొందిన మహాతల్లి

By konaseema life

Updated On:

Dokka Setamma

డొక్కా సీతమ్మ ఎవరు? 

ఆంధ్ర రాష్ట్రము లో బ్రిటిష్ వారి కాలం లోనే   అన్నదానం చేయడం లో పేరు ప్రతిష్టలు పొందిన  సామాన్య గృహిణి  సీతమ్మ గారు .ఆమె సేవా గుణానికి  తెలుసు కుని బ్రిటిష్ దొరలూ ఆశ్చర్య పోయారు . కోనసీమ ప్రాంతంలో “అన్నదానం” అనే మాట వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది పేరు డొక్కా సీతమ్మ . ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఆమె సహజ గుణం . ఎవరైనా ఆమె ఇంటి ముందు వచ్చి ఆకలిగా ఉన్నామని చెబితే, వారిని ఖాళీ కడుపుతో వెళ్లనివ్వలేదు. అందుకే ప్రజలు ఆమెను అన్నదానం చేసిన అన్నపూర్ణమ్మ గా తల్లిగా గౌరవంగా గుర్తుంచుకుంటున్నారు.

డొక్కా సీతమ్మ గారి జీవితం కోనసీమ  లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది.  కోనసీమలోని సంప్రదాయాలు, ఆహార సంస్కృతి గురించి మరింత తెలుసుకోవాలంటే మా సైట్ లోని  కోనసీమ ప్రత్యేక రుచులు  కూడా తప్పక చూడండి.

Dokka -Setamma-Konaseema
Dokka -Setamma-Konaseema

డొక్కా సీతమ్మ గారి చరిత్ర    

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గన్నవరం మండలంలో ఉన్న చిన్న గ్రామం లంకలగన్నవరం. ఈ గ్రామం గోదావరి నది ఒడ్డున ఉన్న అందమైన ప్రాంతం. ప్రకృతి సోయగాలతో నిండిన ఈ గ్రామానికి ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది.

గోదావరి నది ప్రక్కనే ఉన్న ఈ ప్రాంతానికి అప్పట్లో పడవల ద్వారా , ఎడ్లుబల్లు , కాలినడకన  ప్రయాణాలు చేసేవారు .  గన్నవరం వరకు  ప్రయాణం చేసి   గోదావరి నది  పడవల పై  దాటి  రాజోలు , అంతర్వేది చేరుకునే వారు .  అలా  చీకటి పడిన తర్వాత వచ్చిన  ప్రయాణికులు చాలా అవస్తలు పడేవారు . చీకటి పడిన తర్వాత వచ్చిన ప్రయాణికులు  లంకల గన్నవరం లో ఉన్న సీతమ్మ గారి ఇంటికి చేరుకొని  ఆ రాత్రి అక్కడే  సీతమ్మ వారి  అన్న దానాన్ని స్వీకరించి  ఉదయం ప్రయాణం సాగించేవారు  ప్రయాణికులు, పేదవారు, ఆకలితో ఉన్నవారు సీతమ్మ గారి ఇంటికి చేరేవారు. వారందరికీ ఎలాంటి భేదం లేకుండా ఆమె భోజనం పెట్టి పంపించేవారని చెబుతారు. అందుకే ఆమెను అన్నదాన సీతమ్మ అని కూడా పిలుస్తారు.

డొక్కా సీతమ్మ గారి ఇల్లు లంకలగన్నవరం
డొక్కా సీతమ్మ గారి ఇల్లు లంకలగన్నవరం

సీతమ్మగారి  జీవితం

సీతమ్మ  గారు 1841 సంవత్సరం మండపేట లో అనుపిండి భవానీ శంకరం , శ్రీమతి  నరసమ్మ దంపతులకు జన్మించారు . అన్నార్డులకు  తండ్రి చేసే సహాయానికి  భవానీ శంకరం ను మండపేట లో బువన్న( బువ్వ అనగా అన్నం ) అని ముద్దుగా పెలుచుకునే వారు. తండ్రి చేసే అన్నదాన కార్యక్రమాలు  చిన్న నాటి నుండి  చూసి  సీతమ్మ గారు కుడా  అదే బాటలో  నడిచారు .చిన్నప్పటి నుంచే ఆమెకు దయగల మనసు ఉండేది. పెళ్లి అయిన తరువాత కూడా అదే స్వభావం కొనసాగింది.

లంకల గన్నవరం లో  వేదపండితుడు , పెద్దరైతు  డొక్కా జోగన్న పంతులు  గారు ,  వేదపండితుల సభకు వెళ్లి  వస్తుండగా  మధ్యాహ్నం  భోజనసమయం కావడం తో  మండపేట లోని  భవానీ  శంకరం గారి ఆహ్వానం  మేరకు  భోజనానికి జోగన్న గారు వెళ్లి  వారి  ఆతిద్యం స్వీకరించారు .

భోజనసమయం లో సీతమ్మ గారి అణుకువ , పెద్దల పట్ల వినయవిధేయతలు , అతిధులను గౌరవించే  సంస్కారం  అన్నీ చూసి   జోగన్న గారు సీతమ్మ గారిని వివాహం చేసుకోవాలనుకున్నారు . అలా వారి వివాహం 1850 లో  అత్యంత వైభవముగా  బువన్న గారు జరిపించారు . మెట్టినింట అడుగెట్ట గానే  సీతమ్మ గా తన ఉదార స్వభావాన్ని  మరచిపోలేదు . వయసుతో పాటు సీతమ్మ గారి సేవాగుణం మరింత  పెరిగింది . అనోన్య మైన దాంపత్య జీవితం తో ,  దాన ధర్మాలతో  ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లోనే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించింది  వారి కుటుంబం .

ఆకలితో వచ్చినవారికి అన్నం పెట్టిన తల్లి

గోదావరి తీర ప్రాంతం  వరదల సమయం లో  ముంపుకు గురి అవుతూ ఉండేది . గ్రామం లోని ప్రజలు నిలువు నీడ లేక  ఆకలితో అలమటించే వారు . అటువంటి సమయం లో వరదలలో ఇబ్బంది పడుతున్న  వారికి  , ఆకలి తో అలమటిస్తున్న వారందరికి  భర్త సహకారం తో  అన్నం వండి  వారి  ఆకలి తీర్చిన  దేవత గా  కొనియాడబడింది .  డొక్కా సీతమ్మ గారు ఇంట్లో ఎప్పుడూ వంట ఉండేదని చెబుతారు.  ఎవరైనా వచ్చినా వెంటనే వారికి అన్నం పెట్టేందుకు సిద్ధంగా ఉండేది. పేదవారైనా, ధనవంతులైనా – ఆమెకు అందరూ ఒకేలా. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం ఆమెకు పెద్ద పుణ్యంగా భావించేది.

రాజోలు , అంతర్వేది  మొదలగు ప్రాంతాలకు   ప్రయాణాలు  లంకల గన్నవరం రేవు  మీదుగా సాగేవి . అలా  ప్రయాణికులు గోదావరి దాటేటప్పుడు చాలా సార్లు ఆకలిగా ఉండేవారు. అప్పుడు వారు సీతమ్మ ఇంటి దగ్గరికి వచ్చేవారు.  ఆమె వారిని ఎంతో ప్రేమగా ఆహ్వానించి భోజనం పెట్టేది. భర్త డొక్కా జోగన్న గారు  ఖర్చు కు  లెక్కచేయకుండా  సరుకులు సమకూర్చి ”  అన్నిదానల్లో అన్నదానం మిన్న ” అని నమ్మి  ఇరువురు దంపతులు  అన్నదానం చేసేవారు .

ఒక సారి అంతర్వేది ఉత్సవాల సమయం లో డొక్కా సీతమ్మ గారు  వేరే ప్రాంతానికి  వెళ్ళవలసి వచ్చి  ప్రయాణం అయ్యారు . మద్యలో  కొంతమంది ప్రయాణికులు ఇలా మాట్లాడుకుంటున్నారు . “ఈ రోజు చీకటి పడిన తర్వాత లంకల గన్నవరం లో డొక్కా సీతమ్మ గారి కమ్మనైన భోజనం తో  కడుపునింపు కోవాలి ”  అనే మాటలు సీతమ్మ గారు  విని వారి ప్రయాణాన్ని విరమించుకుని  తిరిగి ఇంటికి చేరుకొని  వచ్చే వారి కోసం ముందుగానే వంటలు సిద్డ్డం చేసారని కోనసీమ లోని చాల మంది చెబుతారు .

సమయానికి  కూరగాయలు లేక పోయినా  గరిక గడ్డి తో పచ్చడి స్యయంగా అద్బుతంగా  చేసే వారాట.

డొక్కా సీతమ్మ సేవలకు వచ్చిన గౌరవం

సీతమ్మ సేవలు  , అన్నదానం గురించి  ప్రజలు ఎంతో గొప్పగా  చెప్పుకునేవారు . కులమతాలకు అతీతంగా  ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టే సీతమ్మగా గారి  గురించి తెలుసుకున్న  బ్రిటిష్ చక్రవర్తి  7 వ  ఎడ్వర్డ్  1903 లో తన పట్టాభిషేకానికి  ఇంగ్లాండ్  రావాలని ఆహ్వానం  పంపించినారు .సముద్ర ప్రయాణం చేయడం ఇష్టం లేని  సీతమ్మ గారు , ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు .

సీతమ్మ గారి ఫోటో పంపమని  తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కి చక్రవర్తి  లేఖ రాసారు . బ్రిటిష్ ప్రభువుల ఆదేశాలతో  ఫోటో కోసం వెళితే సీతమ్మగారు  కుదరదని చెప్పారు . మీరు ఫోటో తీయించు కోక  పోతే మా ఉద్యోగాలు  పోతాయని  కలెక్టర్ గారు  ప్రాదేయపడితే  ఒప్పుకున్నారు .

బ్రిటిష్ చక్రవర్తి  7 వ  ఎడ్వర్డ్  పట్టాభిషేకం : సీతమ్మ గారి ఫోటో ని గౌరవంతో నమస్కరించి 7 వ  ఎడ్వర్డ్  పట్టాభిషేకం చేసుకున్నారని చెబుతారు . పట్టిభిషేకం అనతరం  సీతమ్మ గారికి పంపిన ప్రశంసా పత్రం లో ఈ విషయాలు  మనకు తెలుస్తున్నాయి .

Dokkaseetamma-British Certificate Proof with Books
Dokkaseetamma-British Certificate Proof with Books

 

1980-85 దశకం లో డొక్కా సీతమ్మ గారి సేవలు – జీవితచరిత్ర గురించి  ఎలిమెంటరీ పాటశాల  తెలుగు పుస్తకాలలో  పాఠం గా  భోచించే వారు .

కోనసీమలో 2000 సంవత్సరంలో గన్నవరం వద్ద గోదావరి నదిపై నిర్మించిన కొత్త వంతెనకు  “డొక్కా సీతమ్మ వారధి అని పేరు పెట్టారు. ఆమె చేసిన అన్నదాన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ వంతెన ద్వారా ప్రజలు నేటికీ డొక్కా సీతమ్మ గారిని స్మరించుకుంటున్నారు.

డొక్కా సీతమ్మ గారి సేవలకు గుర్తింపుగా  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాటశాల లో  అమలు చేస్తున్న మద్యహ్నాన భోజన పథకానికి  “డొక్కాసీతమ్మ  మధ్యాహ్నన భోజన పధకం అని పేరుపెట్టి ఆమె పేరును  చిరస్తాయిగా  గౌరవిస్తున్నారు .

Dpkka Sethamma varadhi
Dpkka Sethamma varadhi

 

కోనసీమ లో నేటికి  సీతమ్మ గారి ఇల్లు

లంకల గన్నవరం లో సీతమ్మ గారు వాడిన వస్తువులు , వంటసామానులు , భావి , తదిరములు అన్ని పర్యాటకులు చూడటానికి వీలుగా ఆ ఇంటిలోనే పదిలంగా ఉంచారు వారి వారసులు .ఇప్పటికీ లంకలగన్నవరం గ్రామం కోనసీమ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. డొక్కా సీతమ్మ గారి సేవలను గుర్తు చేసుకుంటూ ఈ గ్రామాన్ని చూడడానికి చాలామంది పర్యాటకులు  వస్తుంటారు.

సీతమ్మ గారి ఇల్లు ఎలా  చేరుకోవాలి ?

రాజమండ్రి నుండి  రావులపాలెం నుండి గన్నవరం బ్రిడ్జి దాటి లంకల గన్నవరం చేరుకోవచ్చు .

అమలాపురం నుండి  లంకల గన్నవరం చేరుకోవచ్చు . సుమారు 18 కిలోమీటర్లు ఉంటుంది .

పాలకొల్లు మీదుగా రాజోలు మీదుగా లంకలగన్నవరం చేరుకోవచ్చును . సుమారు పాలకొల్లు నుండి గన్నవరం  35 కిలోమీటర్లు దూరం లో ఉంది .

ముగింపు

కుల మత బేదములు లేకుండా  ” అతిధి దోవోభవ ” అని ఆకలితో  వచ్చిన వారికి అన్నం పెట్టిన దేవత  సీతమ్మ గారు . అందుకే  గోదావరి జిల్లా లలోనే కాకుండా మద్రాస్ రాష్ట్రము  లోనే మంచి పేరుప్రతిష్టలు సంపాదించి  ఇంగ్లాండ్ వరకు డొక్కా సీతమ్మ గారి సేవలు  తెలిసేలా చేసాయి .   జీవితం మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. మన దగ్గర ఉన్నదాంట్లో కొంతైనా అవసరమైన వారికి పంచితే అది ఎంతో గొప్ప పని అవుతుంది.   అందుకే డొక్కా సీతమ్మ పేరు ఇప్పటికీ రాష్ట్ర చరిత్రలో  చిరస్థాయిగా నిలిచింది.

కోనసీమలో ప్రసిద్ధి చెందిన అంతర్వేది క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే మా అంతర్వేది పోస్టు కూడా చదవండి.

మా వెబ్ సైట్ లోని కొన్ని   ఆర్టికల్స్ చదవండి : వాడపల్లి    ఆత్రేయపురం  దిండి రిసార్ట్స్  

Related Post

Leave a Comment