అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చరిత్ర , అంతర్వేది లో చూడవలసిన ప్రదేశాల వివరాలు
అంతర్వేది ఈ పేరు చెప్పగానే ఒక ఆద్యాత్మిక భావన ! గోదావరి సంగమ ప్రదేశం కావడం తో ఇక్కడికి వచ్చే పర్యాటకులు అధికంగానే ఉంటారు. అంతర్వేది లో చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి . అంతర్వేది లక్శ్మీ నరసింహ స్వామి దేవాలయం , అన్న చేల్లిలి గట్టు అనే పిలిచే గోదావరి సంఘమ ప్రాంతం , ఆ సముద్రం ప్రక్కనే ఉన్న లైట్ హౌస్ ,వశిష్ట ఆశ్రమం , గోదావరి బ్యాక్ వాటర్ లో బోటింగ్ .
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము , br అంబేద్కర్ కోనసీమజిల్లా , సఖినేటిపల్లి మండలం లో చివరగా ఉన్న గ్రామం అంతర్వేది . పురాణాల ప్రకారం శ్రీరాముడు ఇటువైపు పయనిచు నప్పుడు సీతాదేవితో సఖి నేడు ఈ పల్లి లో ఈ అంతర్వేదిక వద్ద విశ్రాంతి తెసుకొందుము . అని చెప్పే నని అప్పటినుండి ఈ ప్రాంతానికి సఖినేటిపల్లి అని అంతర్వేదిక అంతర్వేది గా మారిందని మరో కధనం ప్రచారం లో ఉంది .

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చరిత్ర
పురాణ కథలు : కృతయుగం లో వశిష్ట మహర్షి గోదావరి లోని ఒక పాయను అంతర్వేది మీదుగా తీసుకుని వచ్చి సముద్రం లో కలపి , అక్కడి ప్రసాంతమైన వాతావరణం లో తపస్సు చేసుకోనసాగాడు . రక్త విలోచనుడు అనే రాక్షసుడు వశిష్ట గోదావరి చెంత ఆ పరమ శివుని కోసం తప్పస్సు చేసి శివుని వద్ద నుండి వరం పొందుతాడు . మానవుల చె తనకు చావు ఉండకూడదు అని తన రక్తం భూమి మీద పడినచో క్రింద పడ్డ ప్రతి ఇసుక రేణువు లో నుండి రక్తవిలోచనులు పుట్టుకు రావాలని వరం పాడుతాడు . తనకు చావు లేదని రక్త విలోచనుడు ఋషులను , యజ్న యాగాదులు చేసే వారిని హింసిస్తూ ఉంటాడు . వశిష్ట మహర్షి ని కూడా ఇబ్బందులకు గురి చేస్తాడు .
అప్పుడు వశిష్టుడు లక్ష్మి నరసింహ స్వామి ని ప్రార్ధించి రక్షించమని వేడుకొంటాడు . రక్త విలోచనుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి నరహరి గా అవతరిస్తారు . ఆ నరహరి రక్త విలోచానికి ఘోర యుద్ధం జరుగుతుంది . నరహరి రక్తవిలోచానుని శిరస్సు ఖండిచాగా , ఆ క్రింద పడిన రక్తం నుండి వేలమంది రక్త విలోచానులు పుట్టుకురాసాగారు . కొన్ని వారాల పాటు యుద్ధం సాగుతుంది . ఆ రక్తం ఏరులా పారుతుంది . గుడికి దగ్గర లోనే ” రక్త తుల్య నది” గా ఇప్పటికి ఉంది . రక్తవిలోచనుల శిరస్సు లు నరహరి ఖండిస్తూనే ఉన్నారు .
అశ్వరూడంబిక ( గుర్రాలక్క ) :, అంతటా నరహరి తనసోదరి ఐన ఆశ్వరుడంబిక సహాయం కోరగా , ఆశ్వరుడంబిక తన నాలుకను పెద్దగా చాపి , గుర్రం పై తిరుగుతూ రక్త విలోచ నుని శిరస్సులు ఖండిచాగా వచ్చిన రక్తం భూమి మీద పడకుండా చేసేను . అంతట నరహరి రక్తవిలోచనుడి ని సంహరించి ఈ ప్రాంతమునకు విముక్తి కలిగించెను .
ఆ తర్వాత వశిష్టుడు తూర్పు అభి ముఖముగా కూర్చుని ఇక్కడే కొలువై ఉండాలని లక్ష్మి నరశింహ స్వామి ని వేడుకున్నారు . అంతటా స్వామి వారు పశ్చిమ ముఖముగా అవతరించి ఉన్నారు .
త్రేతాయుగం : త్రేతాయుగం లో రావణాసుర సంహారం అంనతరం రాముడు , లక్ష్మణుడు , ఆంజనేయస్వామి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్నారని బ్రహ్మ పురాణం లో చెప్పబడినది .
ద్వాపరయుగం : ద్వాపరయుగం లో అర్జునుడు తీర్ధ యాత్రలు చేయుచూ స్వామి వారిని దర్శించుకున్నారని బ్రహ్మ పురాణం లో చెప్పబడింది.
ఆలయ నిర్మాణము
కలియుగం లో ఈదేవాలయాన్ని మందపాటి కేశవదాసు అనే యాదవుడు మొదట నిర్మాణము కట్టెలతో నిర్మించి పూజించ సాగెను . తర్వాత కాలం లో పెద్దాపురం రెడ్డి రాజులు చెక్కలతో ఈ ఆలయం నిర్మించి నట్లు చరిత్ర బట్టి తెలుస్తుంది . క్రి శ . 1823 లో ఓడలరేవు కు చెందిన కొపనాతి కృష్ణమ్మ ప్రస్తుతం ఉన్న ఆలయం నిర్మించినట్లు ఇక్కడి శాసనాలను బట్టి తెలుస్తుంది . తర్వాత కాలం లో పెద్దాపురం సంస్తానాధీశులు , మొగల్తూరు రాజ వంశీయులు ఈ ఆలయాన్ని సంరక్షించారు .

పండుగలు & ఉత్సవాలు
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాఘ సుద్ద సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు స్వామి వారి ఉత్సవాలు జరుగుతాయి . రధసప్తమి తో అత్యంత వైబవంగా ఉత్సవాలు ప్రారంబమవుతాయు . దక్షిణ కాశి గా పోరొందిన లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ ఉత్సవాలు 10 రోజులు జరుగుతాయి . ఈ సమయం లో లక్షలాది మంది భక్తు లు స్వామి వారిని దర్శించుకుంటారు . కళ్యాణం అనతరం మద్యాహ్నం స్వామి వారి రధోత్సవం అత్యంత వైబవంగా జరుగుతుంది . ఈ రధోత్సవం లో మొగల్తూరు మహారాజ వారు కొబ్బరికాయ కొట్టి ఈ రధోత్సవం ప్రారంబిస్తారు .
ఈ రధోత్సవం లో లక్ష్మి నరసింహస్వామి వారి సోదరి గుర్రలక్క గుడి వరకు వెళ్లి అక్కడ తన సోదరికి పట్టువస్త్రాలు సమర్పించి తిరిగివస్తారు . దీనికి ఉన్న కధనం ప్రకారం తన సోదరుడికి ప్రతియేటా కళ్యాణం అని మూతి తిప్పు కున్నారని అందుకనే సోదరికి ముందుగా పట్టు వస్త్రాలు సమర్పించి వస్తారని పురాణాలను బట్టి తెలుస్తుంది . పూర్వం ఈ రధోత్సవం ఈ గుర్రలక్క గుడి వరకు వెళ్లి తిరిగి వచ్చేది . ప్రస్తుతం రోడ్ లు వీలులేక గుర్రలక్క గుడి కి కొంచే ముందు వరకు వెళ్లి మరలా స్వామి వారి గుడి వద్దకు రధాన్ని తీసుకు వస్తారు . రధోత్సవం తరువాత చక్రస్నానం చివరగా తెప్పోత్సవం తో స్వామి వారి ఉత్సవాలు ముగుస్తాయి . కార్తిక మాసం లో రొజూ వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు . మాఘమాసం లో కుడా ప్రత్యేకపుజలు జరుగుతుంటాయి . ప్రతి రోజు ఉదయం 10 గంటలకు భక్తుల కోసం శ్రీ నరసింహ సుదర్శన హోమం జరుగును
అన్నదానం : స్వామి వారి సన్నిధి లో సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం నిత్య అన్నదానం ప్రతి రోజు జరుగుతుంది . వచ్చిన భక్తులకు రుచి కరమైన మంచి భోజనం భక్తులకు అందిస్తున్నారు . ఈ కార్యక్రం దాతల నుండి తీసుకున్న విరాళాల ద్వారా జరుగుతుంది . ఈ దేవస్తానం లో వడ్డించే పెరుగు రుచి చుస్తే చాల అద్బుతంగా ఉంటుంది .

🕒 Antervedi Temple Timings -దర్శన సమయాలు
అంతర్వేది ఆలయ దర్శనసమయాలు ఉదయం 6.30 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు తదుపరి 3 గంటల నుండి సాయంత్రం 7: 30 గంటల వరకు ఉంటుంది .
అంతర్వేది లో చూడవలసిన ప్రదేశాలు
గోదావరి సంగమ ప్రాంతం
గోదావరి నది -సముద్ర సంగమం : మహారాష్ట లోని నాసిక త్రయంబకం లో పుట్టిన మన జీవనది గోదావరి నది మహారాష్ట్ర ( , తెలంగాణా 560 km), ఆంధ్రప్రదేశ్ ( 772 km) గుండా మొత్తం 1465 కిలోమీటర్లు ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోని br అంబేద్కర్ కోనసీమ జిల్లా లో అంతర్వేది వద్ద సముద్రం లో కలుస్తుంది . ఈ సంగమ ప్రదేశం చూడటానికి సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తుంటారు .
అన్నా చెల్లిల్ల గట్టు : గోదావరి జిల్లా లలో ఈ గోదావరి నది సముద్రం లో కలిసే ప్రాంతానికి అన్న చెల్లిల్ల గట్టు అని పిలుస్తుంటారు .
లైట్ హౌస్ ప్రాముఖ్యత
బ్రిటిష్ కాలం లో నిర్మించిన ఈ లైట్ హౌస్ నావికుల కు తీరప్రాంతం గుర్తింపు కోసం ఉపయోగ పడేది . కాల క్రమం లో పాతది సముద్రం లో కలసి శిధిల మవగా కొత్త్తగా ప్రస్తుత లైట్ హౌస్ నిర్మాణం జరిగింది . పురాతన లైట్ హౌస్ కి వెనుక లోపల సుమారు ఆరు కిలోమీటర్ల లోపల మత్సకార గ్రామమ ఉండేదని ఇక్కడి గ్రామం లోని పెద్దవారు చెబుతున్నారు . ఆ గ్రామం కా లాక్రమం లో సముద్రం లో కలసిపోయిందని తెలియజేస్తున్నారు .
పర్యాటకులకు , ఫోటోగ్రాఫర్ లకు ఈ లైట్ హౌస్ మంచి ఉత్తేజితమైన ప్రాంతము . ఈ మద్య కొత్త జంట లకు ఈ ప్రాంతం లో ఫోటో షూట్ లు విరివిగా జరుగుచున్నాయి .ఈ లైట్ హౌస్ పై నుండి చుస్తే గోదావరి సముద్ర సంగమ ప్రాంతం , అలాగే అంతర్వేది లక్ష్మి నరసింహస్వామి దేవాలయం , పల్లిపాలెం గ్రామం కనుల విందుగా కనిపిస్తుంది . కార్తిక మాసం లో వనభోజనలతో ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది .
ముఖ్యప్రమాద హెచ్చరిక : గోదావరి సంఘమ ప్రాంతం లో నీటిలో స్నానాలు , సేల్ఫీ లా కోసం దిగటం అత్యత ప్రమాద కరం !
బ్యాక్ వాటర్ బోటింగ్
స్తానిక వశిష్ట గోదావరి లో బోటింగ్ పాయింట్ ఉంది . ఈ బోటింగ్ పాయింట్ నుండి అన్నాచేల్లిలగట్టు వరకు బోటింగ్ చేయవచును . అలాగే ఇక్కడ ఉన్న బ్యాక్ వాటర్ లో బోటింగ్ చేసి , మడ అడవుల సహజ సౌందర్యం ఆస్వాదించ వచ్చును .
బోటింగ్ కాంటాక్ట్ నంబర్ : 99494 11191
వశిష్ట ఆశ్రమం : లక్ష్మి నరసింహస్వామి వారి గుడికి సమీపం లో గోదావరి చెంతనే వశిష్టుడు ఈ ప్రాంతం లో తపస్సు చేసిన పవిత్ర పుణ్యస్థలం ఈ వశిష్టఆశ్రమం .ఈ మద్య కాలం లో నిర్మితమైన ఈ ఆశ్రమానికి కలువపువ్వు ఆకారం లో చుట్టూ నీరు ఉండి , అద్బుతమైన కట్టడం ఇది. ధ్యానం చేసే వారికి ప్రశాంత వాతావరణం ఇక్కడ లభిస్తుంది .

అంతర్వేది ఎలా చేరుకోవాలి?
సమీప బస్సు స్టేషన్ : రాజోలు
లక్ష్మీనరసింహస్వామి దేవస్తానం చేరుకోవడానికి సమీప నగరం రాజోలు నుండి ప్రతి గంటకు బస్సులు నడపబడుతున్నవి . పాలకొల్లు నుండి చించినాడ బ్రిడ్జి మీదుగా అంతర్వేది చేరుకోవచ్చు .ఉత్సవ సమయాలలో రాజమండ్రి , రావులపాలెం , కాకినాడ , భీమవరం ,పాలకొల్లు నుండి ప్రత్యెక సర్వీసులు నడుపుతారు . పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి గోదావరి నది పై పంటి ( జెట్టి ) దాటి సఖినేటిపల్లి చేరుకొని అక్కడ నుండి అంతర్వేది చేరుకోవచ్చు .
సమీప రైల్వే స్టేషన్ : నర్సాపురం , పశ్చిమగోదావరి జిల్లా . విజయవాడ నుండి అంతర్వేది చేరుకోవాలను వారికి ఈ నరసాపురం మీదుగా గోదావరి నది దాటి సఖినేటిపల్లి మీదుగా అంతర్వేది చేరుకోవచ్చు . హైదరాబాద్ నుండి వచ్చే వారు ఈ నర్సాపురం రైల్వే స్టేషన్ ఉపయోగించుకోవచును .
సమీప ఎయిర్పోర్ట్ : రాజమండ్రి కోరుకొండ లో కలదు .
వసతి గృహాలు- Rented Rooms :
ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు వసతి గృహాలు , సత్రాలు అందుబాటులో ఉన్నాయి . అంతర్వేది వచ్చిన పర్యాటకులు ఈ వసతి గృహాలు రుసుము చెల్లించి ఉపయోగించుకోవచును . అంతర్వేది లో రూమ్ లు లాడ్జీలు ధరలు వివరాలు మా ఆర్టికల్ లో చూడగలరు
మా వెబ్ సైట్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాల గురించి చదవండి : అయినవిల్లి ఆది గణపతి ఏడూ శనివారాల వేంకటేశ్వరుడు వాడపల్లి పురాతన పలివెల శివాలయం
ఈ వీడియో లో అంతర్వేది విశేషాలు చూసి తెలుసుకోండి !









