కోనసీమ పొట్టిక్కలు అంటే ఏమిటి?
konaseema లో ప్రసిద్ధ సంప్రదాయ ఆహారం. ఈ వంటకం ముఖ్యంగా అంబాజీపేట ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. కోనసీమలో ప్రకృతి అందాలతో పాటు ఆహారప్రియులు ఇష్టంగా తినే అనేక రకాల సంప్రదాయ ఆహారాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది, చాల ప్రాచీనమైన ఆహారం అయిన ఈ పనస ఆకులతో చేసే వంటకం . గోదావరి జిల్లాలలో, ముఖ్యంగా కోనసీమలో కొబ్బరి పంటలు మరియు ఉద్యాన పంటలు అధికంగా పండిస్తారు. అందులోనూ అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో పనస తోటలు ఎక్కువగా ఉండటంతో, ఈ వంటకం తయారికి తాజా పనస ఆకులను ఉపయోగించి కొబ్బరి ఇనలతో చిన్న బుట్టలుగా తయారు చేస్తారు. ఈ పనస ఆకులతో చేసే పిండి వంటకాన్నే పొట్టిక్కలు అని పిలుస్తారు.

కోనసీమ లో ఎందుకు ఈ సంప్రదాయం ?
కొన్ని వందల సంవత్సరాలుగా , పొలాల అమావాస్య రోజు పనస ఆకులతో చేసిన పిండి వంటకం ను పూజ లో ఉపయోగించే వారు . శ్రావణమాసం లో మొదటగా బహుళ అమవాస్యను పొలాల అమావాస్య అంటారు . ఈ పొలాల అమవాస్య రోజు చాల ప్రాంతాలలో పూజలు చేస్తారు . సౌబాగ్యం కోసం , సంతానం కోసం స్త్రీలు ఈ పూజ చేస్తారు . ముక్యం గా ఈ పొలాల అమావాస్య కి సంతానం లేని వారు చేస్తే మంచి పలితం ఉంటుందని గ్రామిన ప్రాంతాలలలో ఇప్పటికి ఈ ఆచారం ఉంది .
పోలాలదేవి అనే దేవతను ప్రసన్నం చేసుకోవడానికి పూజ లో నైవేద్యం గా కంద మొక్కలు లేదా వాటి పిలకలు, బూరెలు , మరియు పనస ఆకులతో చేసిన ఈ పిండి వంటకం ప్రసాదం గా పెడతారు . అలా పొలాలదేవి ప్రసాదం పవిత్రమైనది , రుచి లోను అమోఘ మైనది . గోదావరి జిల్లాలలో ఈ పోట్టిక్కలు ఈ పూజ లో ఉపయోగిస్తుంటారు .
పోలాలదేవి పూజ విదానం ఈ లింక్ ద్వారా తెలుసుకోండి : https://www.poojalu.com/polala-amavasya-pooja-

పొట్టిక్కలు కోనసీమ లో తయారు చేసే విధానం
తయారీకి కావలసిన పదార్థాలు
1.పనస ఆకులతో చేసిన తాజా బుట్టలు 2. మినప పిండి 3. వరిపిండి 4. తగినంత ఉప్పు
మినపపప్పు ను సుమారు 6 నుండి 8 గంటలు నానబెట్టి పొట్టు తీస్తారు . పొట్టు తీసిన మినప పప్పు ను ఇడ్లి పిండిలా రుబ్బుతారు . అలా రుబ్బిన మినప పిండిలో ఇడ్లి నూక ను తగినంగా కలుపుతారు . రుచికి తగినంతగా ఉప్పును కలుపుతారు . అలా కలిపినా మినప పిండి ని పనస ఆకుల బుట్టలో నిండుగా గరిటతో నింపుతారు . ఈ నింపిన బుట్టలను ఆవిరి మీద ఉడికిస్తారు . ఒక మాటలో చెప్పాలంటే ఇడ్లి ఉడికించినట్ట్టు ఉడికిస్తారు .

ఎలా తింటారు? – తినే పద్ధతులు
ఈ పొట్టిక్కలు వేడి వేడిగా తింటే చాల రుచిగా ఉంటాయి . గోదావరి జిల్లాల లో చాల ప్రాంతాలలో హోటలలో ఈ అల్పాహారం అందుబాటులో ఉన్నాయి . అయితే కోనసీమ లోని అంబాజీపేట ప్రాంతం లో లభించే వీటి రుచి లోను , సుచి లోను మంచి పేరును సంపాదించుకుని ఒక అంబాజీపేట బ్రాండ్ పేరు సంపాదించు కున్నాయి . అంబాజీపేట స్తానిక హోటల్ లో ప్రముకంగా వండి వడ్డిస్తారు . కొబ్బరి పచ్చడి , నెయ్యి & కారం , అల్లంపచ్చడి , సాంబారు తో వీటిని తింటే ఆ రుచి మరచి పోలేరు . నోట్లో వేసుకోగానే మెత్తగా కరిగిపోయే అల్పాహారం పనస ఆకుల సువాసన తో చాల కమ్మని సంతృప్తి కలిగిస్తాయి .
అంబాజీపేట లో ఎందుకు ప్రసిద్ధి చెందాయి?
పచ్చని పనస ఆకులతో బుట్టలు చేయడం , దానిలో వండడం ఈ తరం వారికి కొంచెం కొత్తగా అనిపిస్తాయి . అందుకే గోదావరి జిల్లా లలో లబించే ఈ పొట్టిక్కలు మంచి ప్రాముఖ్యత సంపాదించు కున్నాయి . కొనసీమ ను సందర్శించే పర్యాటకులు ఈ రుచిని ఆస్వాదించి మరో పదిమందికి చెబుతారు . అలా పురాతన మైన ఈ వంటకం ప్రసిద్ది చెందింది .సినిమా వారు ఇటు వైపు వస్తే తప్పకుండా వీటి రుచి చూస్తారని అంబాజీపేట లోని ఒక హోటల్ యజమాని సంతోషంగా చెప్పారు . ఇలా తనికెళ్ళ భరణి గారు , గౌతంరాజు గారు , పెద్ద వంశీ గారు ఈ పిండి వంట రుచి చూసిన వారే .

పొట్టిక్కలు – ఆరోగ్య ప్రయోజనాలు
నానబెట్ట్టి రుబ్బిన మినప పిండి , సన్నని వరి నూక కలపి , ఏవిధమైన నూనే ఉపయోగించకుండా వీటిని తయారుచేయడం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాల ఉన్నాయి . గుండె సంబందిత రోగాలు ఉన్నవారు అల్పాహారం తినడం మంచిదని చెబుతారు . రక్తపోటు ఉన్నవారు నిరబ్యంతరంగా వీటిని తినవచ్చు . తాజా పనస ఆకులో ఉన్న ఆరోమాలు మన శరీరానికి కావలసిన పోషకాలు పరోక్షంగా అందిస్తాయని చెబుతారు .
నేటి తరం & కోనసీమ సంప్రదాయ ఆహారం
ఈ తరం పిల్లలకి పురాతన కాలం నాటి మన సంప్రదాయ రుచులు రుచి చూపించ వలసిన బాద్యత మనందిరి పైన ఉన్నది .నేటి ఆదునిక కాలం లో పిల్లలు ఆదునికంగా తయారైన ప్లాస్టిక్ ప్యాకెట్ ఫుడ్ కి అలవాటు పడి ఎన్నో అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు . మన తాత ముత్తాతలు ఎటువంటి ఆహారం తెసుకునే వారు వ, వారు ఎంత కాలం ఆరోగ్యంగా ఉన్నారు అనేది పిల్లలకు తెలియజేయవలసిన అవసరం చాల ఉన్నది . గ్రామీణ ప్రాంతాలలో ఉదయం సాయంత్రం అల్పాహారం గా తీసుకునే ఈ పనస ఆకులతో చేసే వంటకం రుచిని ,ఈ తరం పిల్లలకు రుచి చూపించి మన తర్వాత తరం కి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది .
ఎటువంటి ఆరోగ్యసమస్యలు లేని సహజంగా తయారైన మన పల్లెటూరు రుచులు గురించి పిల్లలకి తెలియజేయడం మనందరి బాద్యత . సాధారణ పదార్థాలతో అసాధారణ రుచి , తక్కువ ఖర్చు తో కడుపు నింపే అల్పాఆహారం ఈ వంటకం . ఈ మద్య కాలం లో రావులపాలెం లో , అమలాపురం లో , అంబాజీపేట లలో ఈ ఆహారం విరివిగా లబిస్తున్నాయి . ఒకసారి గోదావరి జిల్లాలు వస్తే మీరు కుడా తప్పక రుచి చూడవలసిన ఆహారం ఇది .
ఈ విధంగా కోనసీమ గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే సంప్రదాయ వంటకాలు చాలా ఉన్నా సహజమైన పనస ఆకుల తో చేసే ఈ వంటకం విబిన్నమైనది .

Ambajipeta Pottikkalu -Traditional Food -Konaseema
కోనసీమ గురించి మరిన్ని పోస్టులు చదవండి : వాడపల్లి వెంకన్న దర్శనం
అంబాజీపేట పొట్టిక్కల గురించి ఈ వీడియో లో చూడండి ! అంబాజీపేట పొట్టిక్కలు









