కోనసీమ లో కొబ్బరి సాగు
కోనసీమ లో కొబ్బరికాయ ప్రాధాన్యం ఎందుకు ఎక్కువ?
గోదావరి జిల్లాలు పచ్చని పంట పొలాలు, కాలువ గట్టులు, ఎత్తైన కొబ్బరి చెట్లతో ఎంతో ఆకర్షణీయమైన ప్రాంతంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంత సౌందర్యానికి కొబ్బరి చెట్లు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. కొబ్బరి చెట్టును “కల్పవృక్షం” అని పిలుస్తారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం – ఆకులు, కాయలు, వేర్లు, చెక్కలు – అన్నీ మనిషికి ఉపయోగపడతాయి.
గోదావరి జిల్లాల్లో “ఒక కొబ్బరి చెట్టు ఉంటే చాలు, కొడుకు లేకపోయినా పర్వాలేదు” అనే నానుడి ప్రసిద్ధి చెందింది. ఇది ఇక్కడి ప్రజల జీవన విధానంలో కొబ్బరికాయ ప్రాధాన్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
ప్రతి ఇంటి లోను కొబ్బరి చెట్లు పెంచని వారు ఉండరు . వాణిజ్య పరంగా కొబ్బరి సాగు చేస్తున్న రైతులు ఎక్కువగానే ఉన్నారు . వేలాది ఎకరాలలో కొబ్బరి సాగు అవుతుంది . కోనసీమ ప్రాంతం అంబాజీపేట లో కొబ్బరి పరిశోదన కేంద్రం ఉంది . కొబ్బరిసాగు , ఈ కాయ లా దిగుబడికి తీసుకోవలైన సస్యరక్షణలు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా , నాణ్యమైన విత్తనాలను సేకరించి కొత్తరకం కొబ్బరి మెక్కలు ఇక్కడి పరిశోదన కేంద్రం లో తయారుచేసి రైతులకు అందిస్తున్నారు . అంబాజీపేట కొబ్బరి మార్కెట్ నుండి కోకోనట్స్ ఇతర రాష్ట్రాలకు వేల సంఖ్యల్లో ఎగుమతి అవుతున్నాయి . ముఖ్యంగా దసరా , శివరాత్రి , ఉగాది ,కార్తిక మాసం లలో కొబ్బరికి మంచి డిమాండ్ ఉంటుంది .
ఈ కాయను తమిళం లో టెంకాయ , సంస్కృతం లో నారికేళం , మలయాళంలో నాలికేరం అని కూడా పిలుస్తారు .

పండుగలలో కొబ్బరికాయ పాత్ర
కొబ్బరికాయ లేకుండా ఏ పూజా కార్యక్రమములు జరగవు అంటే అతిశయోక్తి కాదు . అంతటి పవిత్రమైనది కొబ్బరికాయ ! కొబ్బరికాయ హిందూ సంప్రదాయం లో ఒక భాగంగా ఉంది . ఎందుకంటే టెంకాయ పైన ఉన్న మూడు కన్నుల్లు త్రిమూర్తి స్వరూపం గా భావిస్తారు . కాయ పై ఉన్న పీచు ను మానవ జుట్టుగా , పెంకును తలగా , లోపల నీళ్ళు రక్తం గా , గుజ్జు మనవ మెదడుగా భావించి నారికేలము దేవునికి అర్పిస్తే నాలో ఉన అహం తొలగిపోవాలని , తన మనసు దేవునికి అర్పించు కోవాలని కొబ్బరిని ప్రతి పూజలో ను తప్పకుండ వాడతారు . విగ్నలను తొలగించే మెదటి పూజలు అందుకునే వినాయకునికి మెదటి టెంకాయ కొడితే కోరినకోరికలు తీరతాయని నమ్మకం .
కొబ్బరికాయ పెళ్ళిళ్ళలో ఆచారం
శుభకార్యాలు , పెళ్ళి ళ్ళు , పేరంటాలు , నూతన వ్యాపారాలు చేసే తప్పుడు టెంకాయను తప్పని సరిగా కొడతారు . కొబ్బరి లో జీవశక్తి దాగి ఉంది . ప్రాణశక్తి ఉన్న నారికేళంను జలో ఉపయోగించడం పవిత్రమైనది గా భావిస్తారు . పెళ్ళిళ్ళ తంతు లో ఈ కాయకు చాల ప్రాదాన్యత ఉంది. హిందూ సంప్రడాయంలో వరుడు , వధువు కు కళ్యాణ తిలకం దిద్దగానే మొదట పచ్చికొబ్బరి చేతిలో పెట్టి పెద్దలంతా ఆశీర్వదిస్తారు. కళ్యాణవేదిక లోకి ప్రవేశించడానికి ముందే చేతి లో టెంకాయ ఉంచి తీసుకువస్తారు . కళ్యాణం తంతు లో కన్యాదానం చేసే సమయం లోను ఈపచ్చి కాయను వధువు చేతి లో నుండి వరుడి చేతిలో పెట్టి కన్యాదానం చేయడం అనాదిగా వస్తున్నా మన సనాతన ఆచారం .

కొబ్బరికాయతో చేసే కోనసీమ ప్రత్యేక వంటకాలు
4.1 కొబ్బరికాయ – బెల్లం ఉండలు
బెల్లం ముదురు పాకం రాగానే అందులో కొబ్బరితురుము వేసి చిన్న చిన్న ఉండలుగా చుడతారు . కొబ్బరిఉండలు , స్థానికంగా కొబ్బరి నౌజు అని పిలిచే ఈ ఉండలు రుచి కి కమ్మగా ఉండి బెల్లం తో తినడం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి .ఇలాగే బెల్లం పాకం బాగా ముదిరిన తర్వాత తురుము వేసి కొబ్బరిఅచ్చులు కుడా తాయారు చేస్తారు . ఇవి ఎక్కువ కాలం నిలవ ఉంచుకోవడానికి వీలుగా తయరుచేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు . కొబ్బరితురుముతో బూరెలు కుడా చేస్తారు . పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే ఆహారం కొబ్బరిబూరెలు .
4.2 కొబ్బరిపచ్చడి
కొబ్బరిపచ్చడి ఇష్టపడని వారు ఉండరు అనడం లో అతిశయోక్తి లేదు . కొబ్బరిపచ్చడి పచ్చిమిర్చి గాని , ఎండుమిర్చి గాని, చింతపండు గాని , పచ్చి మామిడికాయ గాని , పచ్చి చింత కాయలు కొత్తిమీర కలపి సమపాలల్లో తయారు చేస్తే జిహ్వచాపల్యం తీరవలసిందే ! ఈ తరం వారి కంటే పెద్దవారు ఈ పచళ్ళు రోటిలో రుబ్బి పసందైన రుచిని తీసుకువచ్చే వారు. కొబ్బరితురుము కుడా మిక్షి లో వేయకుండా చేతితో తీసి తయారు చేయడం ఉత్తమమైన పద్దతి . అల్పాహరాలలో కొబ్బరి పచ్చడి తప్పకుండ ఉపయోగిస్టారు. అంబాజీపేట లో లభించే పొట్టిక్కలు కొబ్బరి పచ్చడి తో తింటే భలే రుచిగా ఉంటాయి .
4 .3 కొబ్బరి కూరలు
గోదావరి జిల్లా లలో , ముఖ్యంగా కోనసీమ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పచ్చికొబ్బరి తరుము కలపి చాల కూరలు వండుతారు . అందులో కొన్ని…. పచ్చిశనగ పప్పు- కొబ్బరి కూర , దొండకాయ -కొబ్బరి వేపుడు మరియు ఇగురు , కొబ్బరి -కంది పప్పు , గోరు చిక్కుడు -కొబ్బరి, పొట్లకాయ-కొబ్బరి , గోంగూర-కొబ్బరి, కారెట్ -కొబ్బరి ఇలా కూరగాయ లతో కొబ్బరి ని సాదారణంగా ఉపయిగిస్తుతారు . కొబ్బరి పాలతో ప్రతేకం గా చేసే కొబ్బరి అన్నం ఆహార ప్రియులకు ప్రీతి పాత్రమైనది .
అరుదుగా లభిచే పోషకాల కొబ్బరిపువ్వు
కొబ్బరికాయలు మొలకలు రావడానికి సిద్దంగా ఉన్నప్పుడు అంతే కొబ్బరి లో నీళ్ళు ఆరిపోయి ,కొద్దిగా వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు కొబ్బరి పిలకలు రావడం ప్రారంభం అవుతాయి .సాదారణంగా కొబ్బరి నిల్వచేసే కొబ్బరి వ్యాపారులు నిల్వచేసే కొబ్బరిలో ఇలా పిలకలు ప్రారంభం కాగానే వాటిని స్థానికం గా ఉన్న చిరు వ్యాపారులకి అమ్ముతారు . కోనసీమలో చాలా ప్రాంతాలలో కొబ్బరి పువ్వులు అమ్ముతూ కనిపిస్తారు . ముక్యంగా ఈ పువ్వులు అక్టోబర్ నుండి జనవరి వరకు అధికంగా లభిస్తాయి . అరుదుగా లభించడం , పోషక ఆహారం అవడం వలన వీటిని చాల ఇష్టంగా తింటారు .

ముగింపు
ఆహారం నుండి ఆరోగ్యం వరకు, సౌందర్య సాధనాల నుండి వ్యాపార రంగం వరకు ప్రతి విషయంలో కొబ్బరికాయ తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. కొబ్బరి నూనె, కొబ్బరి తురుము, కొబ్బరి పాలు ఇలా ప్రతి రూపంలోనూ మన జీవితానికి మేలు చేస్తుంది.
ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో తమ తోటల్లో పండిన కొబ్బరికాయ నుండి నూనె తీసుకుని తలకు మరియు శరీరానికి ఉపయోగించడం ఒక ప్రత్యేక సంప్రదాయం. అన్ని విధాలా ఉపయోగపడే ఈ కొబ్బరికాయ చెట్టును “కల్పవృక్షం” అని పిలవడం లో ఎలాంటి సందేహం లేదు.
మా వెబ్ సైట్ లోని మరికొన్ని ఆర్టికల్ చదవండి : ప్రముఖ tourism స్పాట్ దిండి రిసార్ట్స్ , అంబాజీపేట పోట్టిక్కలు,
పోలవరం మండల లో గోదావరి మద్యలో ఉన్న పట్టిసం చరిత్ర ,
కొబ్బరితో చేసిన కొన్ని వంటలు వీడియో క్రింద ఉంది చూడగలరు .
.









