కోనసీమ సినిమా షూటింగ్ స్పాట్ | ఇక్కడ సినిమా తీస్తే హిట్టే !

By konaseema life

Updated On:

shooting locations Konaseema

 

 

కోనసీమ లో మనసు దోచే ప్రక్రుతి అందాలు  Konaseema Beautiful Location          

కోనసీమ లోని ప్రకృతి అందాలు మనసును మంత్రముగ్ధులను చేస్తాయి. గోదావరి ప్రాంతంలో చల్లని పైరు గాలి తగిలితే మనసు పులకించి పోతుంది. అలాంటి సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి అనువైన ప్రదేశాల్లో  ఈ సినిమా షూటింగ్ స్పాట్  కోనసీమలో ఉన్న ఈ లొల్లలాకులు.  పచ్చని పంటపొలాలు, కొబ్బరి చెట్ల మధ్య ప్రవహించే పంటకాలువలు, చక్కని పల్లె వాతావరణం మరియు వెండితెరపై మెరిసే ప్రకృతి రమణీయత  ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి . గోదావరి జిల్లాల్లో సినిమాలు తెరకెక్కితే, ఆ గోదావరి యాస, మమకారం, సరదా యటకారం వెండితెరపై చెరగని ముద్ర వేసి ప్రేక్షకులను మైమరిపిస్తాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం సమీపంలో ఉన్న ఈ అందమైన ప్రదేశం ప్రకృతి ప్రేమికులను తన సౌందర్యంతో ఆకర్షిస్తోంది. గోదావరి జిల్లాల  జీవనాడిగా నిలిచిన ఈ కాలువలు కేవలం సాగునీటి వనరు గానే  కాకుండా, పర్యాటకులకు  మరియు సినిమా అభిమానులకు  అపూర్వ అనుభూతిని అందిస్తాయి.  

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పంటపొలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో బ్రిటిష్ ఇంజనీర్ Sir Arthur Cotton నిర్మించిన ఈ లాకులు నేటికీ రైతుల పంటలకు ప్రధాన ఆధారంగా ఉన్నాయి.     

సినిమా షూటింగ్ స్పాట్
సినిమా షూటింగ్ స్పాట్

 

వర్షాకాలంలో ఈ లాకుల అందం   

జూన్  జూలై  నెలలో   గోదావరికి వరద నీరు చేరగానే ఈ పర్యాటక స్థలం  మరో  కొత్త అందాన్ని సంతరించుకుంటాయి .  దవలేశ్వరం  ఆనకట్ట వద్దనుండి    ప్రవహించే  గోదావరి ఎర్రనీరు  కాలవల ద్వారా  ,  నిండుగా  ప్రవహిస్తూ కనిపిస్తుంది.    ఈలాకుల నుంచి  జలపాతంలా పడే నీరు, చుట్టూ  విస్తరించిన  పచ్చని పంటపొలాలు…  చల్లని పైరు గాలి …ఈ  ఈ కాలువలు చూస్తే మనసు పులకించిపోతుంది . లాకుల నుంచి పడే నీటి చప్పుడు… చల్లని గాలి… ప్రశాంతమైన వాతావరణం… ఇక్కడి వారి సొంతం ! 

ఇక్కడ కొద్ది సేపు కూర్చుంటే చాలు… జీవితంలోని అలసట అంతా మాయమైపోతుంది. నేను చెప్పడం కాదండి… ఒకసారి మీరు స్వయంగా  వచ్చి ఆ జలపాతాల శబ్దం వినండి. అక్కడే ఉండి సేదతీరాలని అనిపిస్తుంది.

కోనసీమలో – సినిమా వారి ఫేవరెట్ లొకేషన్

మా గోదావరి జిల్లాల్లో సినిమా తీస్తే అది సూపర్ హిట్ అవుతుందనే మాట ఊరికే రాలేదు.   అందుకే ఈప్రాంతం   అనగానే సినిమా వాళ్లకు ప్రత్యేకమైన ప్రేమ.   ఈ లాకులు మద్యలో ఉన్న ప్రాంతం లో మామిడి చెట్లు  ఇక్కడికి వచ్చే  పర్యాటకులకు  వేసవికాలం లో చక్కని నీడనిచ్చి  సేదతీరుస్తాయి .   కార్తీకమాసం లో అయితే  సెలవుదినాలలో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది .  వనభోజనాలతో  ఈ ప్రాంతం అంతా చాలా సందడిగా కనిపిస్తుంది .  అక్టోబర్ నుండి ఫిబ్రవరి నెల్లల్లో ఇక్కడ ఏదోఒక  షూటింగ్ జారుతూ సినిమా   వారితో సందడిగా ఉంటుంది .    ఈ  ప్రదేశం లో  అందమైన పరిసరాలలో  వందలాది సినిమాల్లో సాంగ్స్ ,  సీన్స్ చిత్రీకరించారు.  ఇక్కడి  అందాలు  వెండి తెరపై మెరిస్తే ఆ సినిమా హిట్ట్ కొడతాది అనే సెంటిమెంట్ బాగా ఉంది . అందుకే కోనసీమ లో సినిమా వారికి  ఇష్టమైన ప్రాంతం గా  ఈ లొల్ల లాకులు ప్రసిద్ది చెందాయి . 

కోనసీమలోని ఈ ప్రాంతం పై  చిత్రీకరించిన  ప్రముఖ సినిమాలు  కొన్ని  వందల్లో  ఉంటాయి . కొన్ని సునీల్ నటించిన  అందాలరాముడు లో  సాంగ్   , రమ్యకృష్ణ వెంకటేష్ – ముద్దులప్రియుడు   ,  నాగచైతన్య వెంకటేష్ -వెంకీమామ    మామ  , రవితేజ నటించిన – నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్  , అల్లుఅర్జున్ నటించిన – గంగోత్రి , మనసిచ్చి చూడు , పల్నాటి పౌరుషం , మా పెళ్ళికి రండి ,  సీతయ్య   , యువత ని ఉర్రుతలుగించిన RX100  సినిమా  ఈ ప్రాంతం లోనే తీసారు . 

ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. ఈ లాకుల అందం వెండితెరపై కనిపించిన ప్రతీసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఫిలిం షూటింగ్ స్పాట్ కోనసీమ
ఫిలిం షూటింగ్ స్పాట్ కోనసీమ

 

కోనసీమ లో ఈ లాకులు ఎందుకు  చూడాలి ?   

సహజమైన ప్రకృతి అందాలను  ప్రసాంతమైన  వాతావరణం  దగ్గరగా చూడాలంటే  కాలువ లలో  నీరు జాలు వారే జల పాతాల  శబ్దం  వినాలంటే  తప్పని సరిగా ఆత్రేయపురం మండలం లో ఉన్న ఈ ప్రకృతి అందాలు చూసి తీరాలి .  గోదావరి జిల్లా లలో  కోనసీమ ను  పర్యటించాలి అనుకునే వారు తప్పనిసరిగా ఈ  ప్రదేశాన్ని  సందర్శించాలి .

సమీపం లో చూడవలసిన పర్యాటక ప్రాంతాలు , ఈ ప్రాంతానికి దగ్గరలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రం  ఏడు శనివారాల వెంకన్న వాడపల్లి దేవాలయం కలదు .  అక్కడికి గ్గరలోనే  బదిలీల స్వామి గా పేరుగాంచిన  ర్యాలీ  జగన్మోహిని కేశవస్వామి ఆలయం కలదు .  మండలకేంద్రం ఆత్రేయపురం లో  సాంప్రదాయ వంటకం  “పూతరేకులు”  రుచి లోను  సుచి లో మంచి  ప్రసిద్ది చెందాయి .  మీకు సమయం కుదిరితే  ఈ ప్రదేశాలు  చూసి రావచ్చు.

ఎలా చేరుకోవాలి         

సమీప బస్సు స్టేషన్  :  రావులపాలెం 

రావులపాలెం నుండి సుమారు 8 కిలోమీటర్లు ,  ఆత్రేయపురం నుండి  సుమారు  2 కిలోమీటర్లు ,  రాజమండ్రి నుండి  సుమారు  24 కిలోమీటర్లుదూరం లో ఉంది .   రావులపాలెం నుంచి ఆత్రేయపురం లేదా  వాడపల్లి వైపు ప్రయాణిస్తుంటే,  దారి మద్యలో లొల్ల అనే గ్రామం కనిపిస్తుంది . ఈ లొల్ల గ్రామం లో పెద్ద  పంట కాల్వ పై  కట్టిన ఈ అందమైన లాకులు  కనిపిస్తాయి .   రాజమండ్రి  వైపునుండి  వస్తుంటే ధవళేశ్వరం  బ్యారేజి దాటినా తర్వాత బొబ్బర్లంక మీదుగా  వస్తుంటే  రోడ్  ప్రక్కనే  పెద్ద  పంటకాలువ  రోడ్ వైపే సాగుతుంది . ఆత్రేయపురం    గ్రామము  దాటగానే  కనిపిస్తాయి  .  ఈ అందమైన  సినిమా షూటింగ్ లొకేషన్స్ !     ఈ ప్రదేశాన్ని చూడాలి అనుకునే వారు ఇక్కడ ఉండాతానికి   

సమీప రైల్వే స్టేషన్ : రాజమండ్రి       

సమీప ఎయిర్పోర్ట్  :  రాజమండ్రి ( కోరుకొండ  )

ఎక్కడ స్టే  చేయాలి :  ఈ ప్రదేశాన్ని చూడాలి అనుకునే వారు ఈ ప్రాంతం లో ఉండటానికి   రూమ్ లు అందుబాటులో ఉండవు , రాజమండ్రి గాని , రావులపాలెం , అమలాపురం  వంటి పట్టణ   ప్రాంతాలలో  సౌకర్యవంతమైన  అద్దేవసతులు  ఉంటాయి .   

పంటపొలాలు - ఆత్రేయపురం
పంటపొలాలు – ఆత్రేయపురం

ముగింపు    

తన సహజ అందాలతో   సినిమా వారి మనసు దోసి ,  వెండితెరపై  పసుపు , పచ్చని రంగుల హరివిల్లు  ఈ పర్యాటక ప్రాంతం .   కోనసీమ జిల్లా లోని పర్యాటక  ప్రాంతం  కేవలం ఒక సాగునీటి నిర్మాణం కాదు… ఇది  ఎంతో మంది రైతుల  ఆత్మ బందువు  !  గోదావరి నీటితో  రైతుల  పంట పొలాలలో  సిరులు  పండటానికి  ఏర్పడిన ఈ ప్రధాన పంట కాలువ  ,  ప్రకృతి ప్రేమికులకు ,  ఫోటోగ్రాఫర్ లకు  , సినిమా వారికి   అభిమాన మైన  ప్రాంతం కావడం వేశేషం !           మీరు రావులపాలెం – ఆత్రేయపురం –  వాడపల్లి వైపు వెళ్తుంటే ,  ఒక్కసారి  ఈ   ప్రకృతి అందాలు  చూసి వెళ్లండి…   ఈ అనుభూతి మీ మనసులో చాలా రోజుల పాటు నిలిచిపోతుంది ! 

మా వెబ్ సైట్ లోని కొన్ని ఆర్టికల్స్ చదవండి  :  అంబాజీపేట పోట్టిక్కలు

కొత్త పేట మండలం  , పలివెల గ్రామం లో ఉన్న  పురాతన శివాలయం  స్టొరీ

 

 

 
 

 

Related Post

Leave a Comment