ఆత్రేయపురం పూతరేకులు – 300 సంవత్సరాల చరిత్ర కలిగిన కోనసీమ ప్రసిద్ధ స్వీట్

By konaseema life

Updated On:

womens making paper sweets - Atreyapuram

 

కోనసీమ ప్రసిద్ద స్వీట్  ఆత్రేయపురం పూతరేకులు

ఆత్రేయపురం గ్రామానికి ఆ పేరు ఎలావచ్చింది                     

గోదావరి నదీ పరివాహక గ్రామం , ఆత్రేయపురం , బౌగోళికంగా  అత్రేయపురాననికి  ఒకప్రక్క వశిష్ఠ  గోదావరి ,  మరో పక్క గౌతమీ గోదావరి .  ఒకప్రక్క గోదావరి నది నుండి నుండి వచ్చిన పెద్దకాలువ లతో పచ్చని పంట పొలాలతో  , కొబ్బరిచెట్ల అందాలతో చూడ చక్కని  గ్రామం ఆత్రేయపురం .

హిందూ దర్మం ప్రకారం  సప్తరుషులు బ్రహ్మ మానస పుత్రులు . అంటే బ్రహ్మ మనసులోంచి  లోక కళ్యాణార్ధం  జన్మించినవారు , వారిలో  కశ్యపుడు , అత్రి , భరద్వాజుడు , విశ్వామిత్రుడు , గౌతముడు , వసిస్తుడు , జమదగ్ని .  ఈ   సప్త రుషు లు లో ఒకరైన అత్రి మహర్షి .   ఈ గోదావరి నది చెంతనే  ఆశ్రమం ఏర్పాటు చేసుకుని  లో తపస్సు చేసారని , ఇక్కడి ఇతిహాసాలను బట్టి తెలియచున్నది . అత్రిమహా ముని  ఈ ప్రాంతం లోతపస్సు చేయడం వలన ఈ  ఈ గ్రామానికి “ అత్రి ”యపురం  అని కాలక్రమం లో అత్రేయపురంగా మారిందని ఇక్కడి పెద్దలు చెబుతారు .

Atrimaharshi - Atreyapuram
Atrimaharshi – Atreyapuram

మండలకేంద్రం – గ్రామాలు    

Br అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఉన్న ఆత్రేయపురం మండలకేంద్రం,   ఒకప్రక్క గోదావరి నది , ఒకప్రక్క లొల్ల , మరోప్రక్క తాడిపత్రి , ఉచ్చులి గ్రామాలు హద్దులుగా ఉన్నాయి .  మండల కేంద్రం  లో 15 చిన్న గ్రామాలూ ఉన్నాయి .  అంకంపాలెం , ఉచ్చిలి , ఖత్తుంగ , నర్కేడిమిల్లి , పులిదిండి , పేరవరం , బొబ్బర్లంక , మెర్లపాలెం , రాజవరం , ర్యాలీ , లొల్ల , వద్దుపర్రు , వసంతవాడ , వాడపల్లి , ఒలిచేరు , ఈ మండలకేంద్రం లో ఉన్నాయి .  కోనసీమ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు ,వాడపల్లి ఏడూ శని  వారాల వెంకన్న , ర్యాలీ జగ్నమోహిని కేసవస్వామి వారి దేవాలయాలు  ఈ గ్రామానికి దగ్గరలోనే ఉన్నాయి .

ఆత్రేయపురం పూతరేకులు – పేపర్ స్వీట్ ప్రాముఖ్యత 

చుట్టూ సారవంతమైన నేలలు , గోదావరి నది చెంతన సంవృద్దిగా నీరులభించడం వలన వాణిజ్యపంటలు  కూరగాయలు ,  ఈ ప్రాంతం లో విరివిగా పండుతాయు . వరి కుడా ప్రధాన పంటగా పండిస్తున్నారు  .    ఒకప్పుడు చెరకు కుడా ఈ ప్రాంతం లో పండించే వారు . చేరకునుంది బెల్లం తీయడం గోదావరి వాసులకు బాగా పరిచయమే .

ఈ ప్రాంతం లో వరిపంటలు  పండటం , బెల్లం లభించడం  వలన వరిపిండి తో  తినడానికి అనుకూలమైన  తీపిపదార్దాలు  చేయడం ప్రారంభమైంది .   పూర్వం ఒక వర్గం లో మాత్రమే  వరిపిండి తో  పోత పోసి పలచని  రేకుల తీసే వారు .  బెల్లం పొడి చల్లి , నెయ్యి చల్లి  తియ్యని , మెత్తని , కమ్మనైన  వరిపిండి  పోత రేకులు కాస్త  పూతరేకులు  గా మార్పు చెందాయని ఇక్కడి వారు చెబుతారు .

ఆత్రేయపురం పూతరేకులు చరిత్ర 

సాంప్రదాయ వంటగా  ఎలా మారింది

ఆత్రేయపురం పూతరేకులు  సుమారు ౩౦౦ సంవత్సరాల పూర్వం నుండి ఈ గ్రామం లో పూత రేకులు తాయారు చేయడం ఆనవాయితీ గా వస్తుంది . పూర్వికుల నుండి వారి వారసులు ఈ పేపర్ స్వీట్  చేయడం నేర్చుకున్నారు . పూర్వం ఒక కమ్యూనిటీ లో పూతరేకును , సారే , పండుగల సమయాలలో ఈ తీపి పదార్ధాన్ని తప్పని సరిగా ఆహారంగా  ఉపయోగించేవారు .  అలా ఈ గ్రామం లో పూతరేకులు తాయారు చేసే నైపుణ్యాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్నారు . ఈ ప్రాంతంలో  మహిళలు ముఖ్యంగా ఈ నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు .    నోట్లో వేస్తె  కరిగిపోయే కమ్మని రుచి  వలన ఈ పేపర్ స్వీట్   ప్రత్యేకత సంతరించు కుంది .

ఆత్రేయపురం పూతరేకుల తయారీ
ఆత్రేయపురం పూతరేకుల తయారీ

ఆత్రేయపురం లో పూతరేకులు  ఎలా చేస్తారు

ప్రదానంగా కావలసిన పదార్దములు

  1. మట్టికుండ  (  కింద మంట పెట్టడానికి వీలుగా ఉన్నది )  2.  వరి బియ్యం  (Rice )   3 . బెల్లం(  Jaggery ) లేదా చక్కర  4 . నెయ్యి  (Ghee )  5 . జీడిపప్పు పొడి  ( cashew powder )    6.  మంట పెట్టడానికి కొబ్బరి ఆకులు   7. మెత్తని  గుడ్డముక్క  ( cotton cloth )

తయారీ విధానం  ఒక కళ  :   ప్రత్యేకంగా ఈ పూతరేకులు తాయారు చేయడానికి  దొడ్డు బియ్యం లేదా కొంచెం లావుగా  ఉన్న బియ్యాన్ని శుబ్రంగా కడిగి  సుమారు 3 నుండి 4 గంటలు  నీటిలో నాన బెడతారు .  నాన బెట్టిన బియ్యని  గ్రైండర్ లో మెత్తగా రుబ్బుతారు . రుబ్బిన  వరిపిండి ని  పలుచగా  పోత పోయడానికి వీలుగా  బాగా పలచగా చేస్తారు .

మంతపెట్టడానికి వీలుగా ఉన్న  మట్టి కుండ ను శుబ్రం చేసి  పలుచగా చేసిన వరిపింది లో ,    మెత్తని గుడ్డను  ముంచి  వేడెక్కిన కుండపై   పోతలా గుడ్డను లాగుతారు  . ఈ విధానం లో  కుండ పై పలుచని పొరలా   వరి పిండి   ఏర్పడుతుంది .  సుమారు నిముషం లోపు   ఆ కుండ పై ఏర్పడిన పొరను జాగ్రత్తగా బయటికి తీస్తారు . ఇ పుతరేకులపై  బెల్లం పొడి , నెయ్యి , జీడిపప్పు, బాదాం పప్పు ముక్కలు వేసి చాల నైపుణ్యతతో చుడతారు  .  ఈ విధానం చాల నైపుణ్యం తో  కూడిన  కళ !

ఆత్రేయపురం పూతరేకులు  తయారీ విధానం  ఒక కళ

పేద మహిళ ల ఆర్ధిక భరోసా  !  గ్రామిన మహిళల   ఆర్ధిక స్వలంబనకు  ఆత్రేయపురం పూతరేకులు  ఎంతగాను దోహద పడుతున్నాయి .  ఇక్కడి  మహిళలు  పూతరేకులు తయారుచేయడం లో మంచి నైపుణ్యం కలిగిఉన్నారు . కుటీర పరిశ్రమ గా   సుమారు 400 కుటుంబాలు  పూతరేకులు  తయారుచేయడం , పూతరేకులు చుట్జుటడం పై  ఆధారపడి జీవిస్తున్నారు .   రోజుకు ఒక మహిళ సుమారు 400 నుండి 500  పూతరేకులు  పోత పోసి తయారు తయారు చేయగలుగు తున్నారు . ఆత్రేయపురం పూతరేకులు  పెరుగు తున్న డిమాండ్  వల్ల    ఆత్రేయపురం మండలం లోనే రోజుకి  2 లక్షల నుండి 4 లక్షల వరకు పూతరేకులు ఉత్పత్తి చేస్తున్నారని స్తానికంగా  జి . సత్యనారాయణరాజు గారు తెలియజేసారు .

ఆత్రేయపురం పూతరేకుల ప్రత్యేకత ఏమిటి? GI Tagging

ఆంధ్ర లోని ఇతర ప్రాంతాలలో  పూతరేకులు తయారుచేస్తున్నప్పటికి ,  అనాదిగా  ఈ గ్రామం లోనే పూతరేకులు తయారు చేయడం ,  వినియోగదారుల మన్ననలు   పొందడం  తో  “సర్ అర్తోర్ కాటన్  అత్రేయపూతరేకుల వెల్ఫేర్ అసోసియేషన్ ” వారు , వైజాగ్  లోని దామోదరం సంజీవయ్య  నేషనల్ లా యూనివర్సిటీ  , ఇంటిలిక్టువాల్ ప్రాపర్టీ  వారిచే ,  చెన్నై లోని  జియోగ్రాఫికాల్ ఐడెంటిఫికేషన్  వారి ద్వారా   ఈ  ఆత్రేయపురం పూత రేకులు   GI tagging  పొంది ఉన్నారు .

ఆత్రేయపురం పూతరేకులు Gi Tagging
ఆత్రేయపురం పూతరేకులు Gi Tagging

కోనసీమలో పూతరేకుల సాంస్కృతిక ప్రాధాన్యం

పెళ్లిళ్లు & శుభకార్యాలలో స్థానం

గోదావరి జిల్లాలలో ఎక్కడ  ఏ శుభకార్యం జరిగినా తప్పని సరిగా  ఈ పూతరేకులు  భోజనాలలో  వడ్డించి భందువుల మన్ననలు పొందుతారు . అలాగే దీపావళి , దసరా సందర్బాలో  స్నేహితులకు , బందువులకు  బహుమతిగా   పంపడానికి  ఈ ఆత్రేయపురం పూతరేకులు  విరివిగా వాడుతున్నారు .

విదేశాలకు ఎగుమతి  – Papersweet Export 

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఆత్రేయపురం పూతరేకులు ఖ్యాతి మరింత విస్తరించింది. ఇతర రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా, విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారిని కూడా ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

విదేశాల్లో ఉన్న మన తెలుగు వారి కోసం, అలాగే ఇతర రాష్ట్రాల వారి కోసం ఆత్రేయపురం నుండి పూతరేకులను ప్రత్యేక ప్యాకింగ్‌తో  విదేశాలకు పంపిస్తున్నారు.

ఎక్కడ కొనాలి? (Buying Guide)

ఆత్రేయపురం లో ప్రసిద్ధ దుకాణాలు      

ఆత్రేయపురం గ్రామం లో  మెయిన్ రోడ్  పొడవునా  షాప్ లు అందుబాటులో ఉన్నాయి .  ఈ షాప్ లలో నిత్యం పూతరేకులకు  బెల్లం పొడి చల్లి , నెయ్యి వేసి , జీడిపప్పు , బాదాం పప్పు  వేసి చుట్టడం మనం గమనించ వచ్చు . ఈ పూతరేకులు   క్వాలిటీ  ని బట్టి 10 రూపాయల నుండి 25 రూపాయల వరకు ధర ఉన్నాయి .  గ్రామం లో ప్రతి ఇంటిలోనూ  పూతరేకులు  తయారు చేయడం  అమ్మడం మనం చూడవచ్చు .  ఆంధ్ర లోని  ఇతర ప్రాంతాలలో   పూతరేకులు  తయారు చేసినప్పటికీ   ఆత్రేయపురం పూతరేకులకు  ప్రత్యేకమైన డిమాండ్ ఉంది .వేసవి కాలం లో  ఇక్కడ మామిడితాండ్ర  కూడా విరివిగా తయారు చేస్తారు .

ఆన్‌లైన్ ఆర్డర్ చేసే అవకాశాలు

వినియోగదారుల  డిమాండ్ అనుసరించి   ఆత్రేయపురం లో   తయారయ్యే పూతరేకులు  ఆన్లైన్ ద్వారా  అమ్మకాలు  సాగుతున్నాయి .  ఈ గ్రామం లోని కొంతమంది ఆన్లైన్ వ్యాపారం   ప్రారంబించి  saccess సాదించారు .ఆత్రేయపురం కాకుండా కొన్ని డూప్లికేట్ సంస్తలు ఇందులో ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు .   ఆత్రేయపురం లో ఆన్లైన్  వ్యాపారం  చేసే నేను  స్వయంగా  వెళ్చూలి  చూసిన  ఆన్లైన్ లింక్ క్రింద చూడగలరు .

ఆత్రేయపురం పూతరేకుల షాప్స్
ఆత్రేయపురం పూతరేకుల షాప్స్

ముగింపు

కాగింతంలా పలచని పొర లా ఉఉన్న ఈ స్వీట్ కు ఆంగ్లం లో సరియిన పేరు లేకపోయినా మనం పేపర్ స్వీట్ అని పిలవడం ఏ తప్పు అ లేదని పిస్తుంది .   కమ్మని సువాసనతో , జీడిపప్పు , బాదాం పప్పు పలుకులతో  , ఘుమ ఘుమ లాడే  నెయ్యి తో  ఆత్రేయపురం పూతరేకులు  అందరిని ఆకర్షిస్తున్నాయి . కాలానికి అనుగుణంగా ఈ పూతరేకులు  రకరకాల వెరైటీ లలో తయారవుతున్నాయి .  తీపి తినలేని వారి కోసం ప్రత్యేకంగా  కాకరకాయ పొడి , షుగర్ లెస్ చెక్కర ఉపయోగించి  ఈ పూతరేకులు తయారుచేస్తున్నారు . కొంచెం సృజనాత్మకత ఎక్కువైనా వారు అప్పటికప్పుడు తినే  కారెట్  పూతరేకులు   వెరైటే గా తాయారు చేస్తున్నారు .  ఇటుగా వచ్చిన పర్యాటకులు  ఈ తయారీ విధానం చూసి  ఆత్రేయపురం పూతరేకులు రుచి చూసి  ఆశ్చర్య పోతుంటారు .

మీరు ఒకసారి వీలు ఐతే   కోనసీమ లోని  అత్రేయపురం పూతరేకులు రుచి చూసేయండి  !!

ఆత్రేయపురం పూతరేకులు
ఆత్రేయపురం పూతరేకులు

 

మా వెబ్ సైట్ లో మరిన్ని ఆర్టికల్స్ చదవండి  !

అంబాజీపేట పోట్టిక్కలు        గోదావరి మద్యన  వీరభద్రుని గుడి  పట్టిసీమ       కోనసీమ లో చేనేత పరిశ్రమ

 

 

 

 

 

https://youtu.be/i9Ug_dpki9U

 

Related Post

Leave a Comment