పులసచేప: వర్షాకాలం రాగానే గుర్తుకొచ్చే చేపకథ

పులస చరిత్ర

Latest Update – August 29, 2026

గోదావరి పులసకు తాజాగా భారీ ధర పలికింది. యానాం రేవులో 1.3 కిలోల బరువున్న మగ పులస చేప ₹24,000కు వేలంలో అమ్ముడైంది. పులస సీజన్‌లో చేపకు ఉన్న భారీ డిమాండ్‌కు ఈ ధర మరో ఉదాహరణగా నిలిచింది. తాజా పులస ధర వార్తను ఇక్కడ చదవండి.

గోదావరి నదిలోని ఎర్ర నీటిలో పులసచేప ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు, లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలు పెట్టడానికి, అవి ఎదగడానికి గోదావరి నది తీరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అందుకే సముద్రంలోని ఉప్పు నీటి ప్రాంతాల నుంచి మంచినీటి నదీ పాయల వైపు ఈ చేపలు వలస వస్తుంటాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోనసీమ లో లభించే  ఈ గోదావరి చేపకు  కు అపారమైన డిమాండ్ ఉంది.  గోదావరి నదికి  జూలై–ఆగస్టు నెలల్లో వరద నీరు చేరినప్పుడు,  ఈ  చేపలు సుదూర సముద్ర తీర ప్రాంతాల నుంచి తమ సంతతిని పెంచుకోవడానికి నీటికి ఎదురు ఈదుతూ గోదావరి నదిలోకి ప్రవేశిస్తాయి.  పులస చేప గోదావరి ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ప్రత్యేక చేప.  కోనసీమ సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలంటే కోనసీమ ప్రత్యేక వంటలు అనే మా ఆర్టికల్  చదవండి.         

శాస్త్రీయ నామం : Tenualosa ilisha   

పులస చేప
Godavari Pulasa fish

 

 గోదావరి చేప – ప్రత్యేకత 

పులసచేపను ఇలిష్, ఇలిషి, హిల్సా, హిల్షా హెర్రింగ్ లేదా హిల్సా షాడ్ అని కూడా పిలుస్తారు. ఇది Clupeidae ఫ్యామిలీకి చెందిన హెర్రింగ్ జాతి చేప. భారత ఉపఖండం అంతటా ఈ చేపలు లభించినప్పటికీ,  గోదావరి డెల్టాలో దొరికే ఈ చేపకు   ప్రత్యేకమైన రుచి, పేరు ఉంది.  కొనసీమ లో  వర్షాకాలం వచ్చిందంటే చాలు, మాంసాహార ప్రియులు 👉 “మార్కెట్లో పులసలు వచ్చాయా?”
అని అడగడం మొదలుపెడతారు.  గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలోనే  ఈ చేపలు ఎక్కువగా వేటకు చిక్కుతుంటాయి.
        

ఖండాలు దాటి ప్రయాణం

ఇలిషా లేదా హిల్సా చేపలు   సుదూర దేశాల సముద్ర ప్రాంతాల నుంచి ఉష్ణమండల ప్రాంతాల వైపు ప్రయాణించి,  భారత ఉపఖండంలోని నదీ తీరాలకు పిల్లలు  పెట్టేందుకు చేరుకుంటాయి.   ఈ ప్రయాణంలో మంచినీటి నదుల్లోకి  ఎదురు ఈదుతూ ముందుకు సాగుతుండగా  మత్స్యకారుల వలలకు  చిక్కుతుంటాయి. 

బంగ్లాదేశ్ జాతీయ చేప

హిల్సా చేప  బంగ్లాదేశ్ జాతీయ చేప. ప్రపంచవ్యాప్తంగా జరిగే హిల్సా చేపల ఎగుమతుల్లో సుమారు 86% బంగ్లాదేశ్ నుంచే జరుగుతాయి.  అందుకే 2017లో బంగ్లాదేశ్ ప్రభుత్వం  Hilsa Fish కు GI (Geographical Indication) హోదాను మంజూరు చేసింది.  ఈ చేపలు   బంగ్లాదేశ్లో:  బ్రహ్మపుత్ర, మేఘన, జమున డెల్టాలలో  ,భారత్లో: రుప్నారాయణ, హుగ్లీ, మహానది, నర్మదా, గోదావరి నదుల్లో లభిస్తున్నాయి.

పుస్తలు అమ్మి ఐన పులసతినాలి అనేది గోదావరి జిల్లాల నానుడి .

ఈ చేపల రుచిని తెలుసుకున్న మాంసాహార ప్రియులు, ఈ చేపను ఒక్కసారైనా రుచి చూడాలని అనుకుంటారు. గోదావరి జిల్లాల్లో ఉన్నవారు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు, స్నేహితులకు లేదా అధికారులకు ఇవ్వడానికి ఈ చేపను ఎగబడి మరీ కొంటారు. అందుకే ఈ చేపకు సీజన్‌లో ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది.

పులసతో పాటు కోనసీమలో అనేక సాంప్రదాయ వంటకాలు కూడా ప్రసిద్ధి చెందాయి. వాటిలో అంబాజీపేటకు చెందిన పొట్టిక్కలు సాంప్రదాయ వంటకం కూడా ఒకటి.

గోదావరి నదీ  తీరంలో తగ్గిన చేపలు :  

గోదావరి నది లో కలుస్తున్న జలకాలుష్యం , గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుగా కడుతున్న బ్రిడ్జిలు వలన ఈచేపప్రయాణంలోఆటంకాలు ఏర్పడి, పులసచేపలు  గోదావరిలో ప్రయనించ లేకపోతున్నాయి.  మత్యకారులు ఈ  చేపలు పట్టడం కోసం ప్రత్యేకంగా వలలు సిద్దం చేస్తారు .గోదావరి నది లో ప్రవాహ వేగం లోనే ఈ వేట  సాగిస్తుంటారు . ఇలా రోజంతా కష్టపడితే ఒక చేప  దొరికినా వారికి సంతోషమే . కాని ఈ సీజన్లో లో గోదావరి లోకి  ఈ చేపలు  రావటం తగ్గిందని, కోనసీమ లోని స్తానిక మత్యకారులు చెబుతున్నారు .

fishgodavari pulasa

ధరలు ఆకాశంలోకి

గోదావరి పులస రుచిని తెలుసుకున్న మాంసాహార ప్రియులు, ఈ చేపను ఒక్కసారైనా రుచి చూడాలనుకుంటారు. గోదావరి జిల్లాల వారు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు, స్నేహితులకు, అధికారులకు కూడా ఈ చేపను బహుమతిగా పంపిస్తారు. అందుకే పులసకు సీజన్‌లో ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. చేప బరువు, సీజన్‌, మార్కెట్ పరిస్థితులను బట్టి పులస ధర మారుతుంది. 2024లో కోనసీమలో 1.5 కిలోల పులస రూ.24,000కు అమ్ముడైనట్లు ABP Telugu నివేదించింది. ధరల వివరాలకు ABP Telugu వార్త

తగ్గుతున్న గోదావరిచేపలు  – ఆందోళన

గోదావరి నదిలో పెరుగుతున్న జల కాలుష్యం, నది ప్రవాహానికి అడ్డుగా నిర్మిస్తున్న బ్రిడ్జీలు, బ్యారేజీలు
వల్ల  చేపల ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 
మత్స్యకారులు ప్రత్యేకంగా వలలు సిద్ధం చేసి, గోదావరి ప్రవాహ వేగంలోనే  వేట సాగిస్తారు.  రోజంతా కష్టపడ్డాక  ఒక చేప  దొరికినా వారికి అదే సంతోషం.
కానీ ఇటీవల కాలంలో గోదావరిలోకి చేపలు  రావడం తగ్గిందని కోనసీమ లోని  స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.

డూప్లికేట్ పులసల సందడి

ఒడిశా నుంచి వచ్చే చేపలు కూడా కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి. నేను స్వయంగా మార్కెట్‌కు వెళ్లి పరిశీలించినప్పుడు, వీటి ధర సుమారు రూ.300 నుంచి రూ.1,500 వరకు ఉన్నట్లు గమనించాను.  అయితే చేప పరిమాణం, సీజన్‌, మార్కెట్ పరిస్థితులను బట్టి ధర మారవచ్చు.

నేను స్వయంగా రుచి చూసిన అనుభవం ప్రకారం, గోదావరి పులసతో పోలిస్తే ఒడిశా చేప రుచి కొంత తక్కువగా అనిపించింది.

Pulasa fish peaces webp
Pulasa fish peaces webp

 

గోదావరి జిల్లా లో ఎలా  వండుతారు ?

ఈ చేపను కోనసీమ లో ప్రత్యేకంగా వండుతారు దానికి  కావలసిన పదార్దాలు :   చేపముక్కలు ,  ఉల్లిపాయ ముక్కలు  , కారం , పసుపు , పచ్చిమిర్చి ,  కొత్తిమీర , నూనే   , ఆవకాయ నుండి తీసిన నూనే ,   బెండకాయ ముక్కలు , చింతపండు , ఉప్పు .

మషాలా దినుసులు  :  దనియాలు , జీలకర్ర , గసగసాలు , దాల్చిన చెక్క , వెల్లుల్లి  తగినంత తీసుకుని మెత్తగా  రుబ్బి సిద్దం గా ఉంచుకోవాలి .

ముందుగా సిద్దం చేసిన  చేపముక్కలకు , తగినంత ఉప్పు , కారం పట్టించి ఉంచు కోవాలి . చేపలకూర సంప్రదాయంగా  కట్టెల పోయ్యి మీద  వండితే మంచి రుచి వస్తుంది . స్టవ్ మీద కడాయి పెట్టి  స్టవ్ వెలిగించి కొద్ది ఎక్కువగానే  నూనే  వేయాలి .  నునే కొద్దిగా వేడి ఎక్కినా తరువాత ,  సిద్దంగా ఉన్న ఉల్లిపాయ ముక్కలు ,  నిలువుగా చీరిన పచ్చి మిర్చి ముక్కలు వేసి  సన్నని సెగ మీద వేగనివ్వాలి .  ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి .  ఉల్లిపాయ ముక్కలు  బంగారు వర్ణం లోకి రాగానే  , సిద్దంగా ఉంచిన చేప ముక్కలు వేసి వేగ నియ్యాలి . సుమారు  ఒక నిముషం  తర్వాత ముక్కలు విడిపోకుండా  గరిట పెట్ట కుండా కడాయి ని జాగ్రత్తగా ముక్కలకు  నూనే పట్టేలా తిప్పు కోవాలి .

Pulasa curry preparation webp
Pulasa curry preparation webp

 

చేపముక్కలకు  ఆయిల్ పట్టగానే , సిద్దంగా ఉంచిన  రుబ్బిన  మషాలాను  ఎందులో వేసి  పచివాసన పోయే వరకు జాగ్రత్తగా  కలపాలి . మషాలా పచ్చి వాసన  పోయిన తర్వాత   , 4 బెండకాయ ముక్కలు  వేసి వేగనిచ్చి ,   సిద్దం గా ఉంచు కున్న తగినంత  చింతపండు  రసాన్ని  పిండుకోవాలి .  ఇప్పుడు కారం , ఉప్పు  సరిచూసి  , 10 నుండి 15 నిముషాలు బాగా ఉడకనివ్వాలి .  ఎలా ఉడుకుతున్న తరుణం లో ఆవకాయ నుండి తీసిన  నూనే  కొద్దిగా వేసుకుని , కొత్తిమీర  పైన చల్లు కోవాలి .

ఇలా వండిన చేపల కూర బాగా చల్లారిన తర్వాత తింటే దాని రుచి అబ్డుతం గా ఉంటుంది . అయితే పులసకూరను  రాత్రి వండి మరునాడు తింటే రుచి ఇంకా పెరుగుతుంది.  ఈ ఒరిజినల్ గోదావరి చేపను రుచి  ఒక్కసారి చూసారంటే…మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

పులస పులుసు -Pulasa fish curry webp
Pulasa fish curry webp

 

అయ్! అవునండి…

మా గోదావరి జిల్లాల “పులసపులుసు” రుచి కుదిరితే తప్పక ఒకసారి ఆస్వాదించండి 😋🐟

మా వెబ్ సైట్ లో మరికొన్ని ఆర్టికల్స్ చదవండి  :

 అయినవిల్లి విగ్నేశ్వరుడు 

అంబాజీపేట పోట్టిక్కలు   

100 స్తంభాల పలివెల శివాలయం

ఈ క్రింద వీడియో లో గోదావరిలో పులసలు ఎలా పడతారు ఎలా వండుతారు అనేది చూడగలరు

 

Related Post

Leave a Comment