పలివెల 100 స్థంభాల శివాలయం పరిచయం
పలివెల 100 స్థంభాల శివాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. ప్రత్యేకంగా వంద స్థంభాలతో నిర్మించబడిన ఈ ప్రాచీన శివాలయం తన అద్భుత శిల్పకళ, పురాణ విశేషాలు మరియు భక్తుల ప్రగడా విశ్వాసాలతో ఎంతో ప్రత్యేకతను సంపాదించుకుంది. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసి శివుని అనుగ్రహాన్ని పొందుతారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో , బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , కొత్తపేట మండలం లో ఉంది పలివెల 100 స్థంభాల శివాలయం ఈ దేవాలయం.

పురాతన శివాలయం చరిత్ర & పురాణ కథలు
ఆలయ నిర్మాణ అసలు కథ
గోదావరి పరివాహక ప్రాంతమైన కోనసీమను పురాతన కాలంలో అనేక రాజవంశాలు పరిపాలించాయి. ఈ ప్రాంతాన్ని పల్లవులు పాలించిన కాలంలో “పల్లవపురం” గా పిలిచేవారని, కాలక్రమంలో అదే పేరు “పలివెల” గా మారిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. పచ్చని పంటపొలాల మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ దేవాలయం 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని రాజరాజనరేంద్రుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. పురాణాల ప్రకారం, కౌసకినది తీరంలో అగస్త్య మహాముని చేత ఈ శివలింగం పలివెల 100 స్థంభాల శివాలయం లో ప్రతిష్టించబడిందని ఇక్కడి శాసనాల ఆధారంగా తెలుస్తుంది .
ఆలయస్థానము ప్రాదాన్యం
ఈ దేవాలయంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన శిలాశాసనాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఆలయంలో చూడదగిన నిర్మాణాలు: పురాతన రాజగోపురం ,గాలి గోపురం ,ఉయ్యాలా మండపం, స్వామివారి మండపం, నిత్యస్థాన మండపం ,చిలుకు ద్వాదశ మండపం, ఈ మండపాలపై చెక్కబడిన గ్రానైట్ శిల్పాలు, స్తంభాల కళాకృతులు మన భారతీయ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

పలివెల శివాలయం లో రాతి స్తంభాల విశిష్టత
ఈ ఆలయంలోని గ్రానైట్ స్తంభాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ నిలిచి ఉండటం విశేషం. ప్రతి స్తంభంపై ఉన్న శిల్పకళ ఇక్కడికి వచ్చే భక్తులను , పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. పలివెల శివాలయంలోని శాసనాలు అప్పటి రాజులు, ఆలయ నిర్మాణ విధానం, దాన ధర్మాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇవి చరిత్ర పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురావస్తుశాఖ పర్యవేక్షణలో ఉన్న దేవాలయం చాల పురాతనమైనది .
తూర్పు చాళుక్యుల కాలం నాటి శిలాశాసనాలు ఈ ఆలయం లో చూడవచ్చు . గ్రానైటు పై చెక్క బడిన శిల్పాలు , గ్రానైటు స్తంబాలు మనల్ని ఆకర్షిస్తాయి . ఈ ఆలయం లో పురాతన కాలం నాటి రాజగోపురం , ఉయ్యాలా మండపం , స్వామివారి నిత్యకళ్యాణమండపము , నిత్యస్థానమండపము , చిలుకు ద్వాదశ మండపం , వాటిపై కళాకృతులు మన చరిత్రకు ఆధారాలుగా ఉన్నాయి . రాతి స్తంబాలపై చెక్క బడిన చిన్న చిన్న శిల్పాలు ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి . పలివెల 100 స్థంభాల శివాలయం ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం లో ఉన్న గ్రానైట్ స్తంబాలు చెక్కుచెదరకుండా చూసే వారికీ కనువిందు చేస్తున్నాయి .

పలివెల గ్రామంలో ఉన్న విషేశం ఏమిటంటే గ్రామదేవతకి పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండు దేవాలయాలు ఒకే గ్రామంలో ఉండటం మనం ఈగ్రామంలో చూడవచ్చు. ఈ తాళ్ళమ్మతల్లి దేవాలయం మరో చోట ఉంది . ఈ తాల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఉగాదికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు .

సందర్శక సూచనలు
శ్రీ ఉమా కొప్పులిన్గేస్వరస్వామి వారి గుడిలో నిత్యం ప్రత్యెక అభిషేకాలు , పూజలు , దోష నివారణ పూజలు జరుగుతూ ఉంటాయు . ఉదయం 5 గంటల మధ్యానం 12 గంటల వరకు , సాయంత్రం 4 గంటలనుండి 8 గంటలవరకు స్వామి వారి దర్శనం ఉంటుంది . ప్రత్యెక పండుగ సమయాలలో ఈ సమయాలు మార్పులు ఉంటాయు .
పలివెల లో శివాలయాన్ని ఎలా చేరుకోవాలి
రావులపాలెం నుండి అమలాపురం వెళ్ళే దారిలో కొత్తపేట కి దగ్గరలో ఉన్న గ్రామం ఈ పలివెల . పలివెల గ్రామం చేరుకోవాలంటే కొత్తపేట మీదుగా చేరుకోవచ్చు . పలివెల గ్రామం రావులపాలెం నుండి 12 కిలోమీటర్లు దూరంలో ఉంది , కొత్తపేట నుండి 3 కిలోమీటర్లు దూరం లో ఉంది . అమలాపురం .25 కిలోమీటర్లు . రాజమండ్రి నుండి 50 కిలోమీటర్లు దూరం లోను , కాకినాడ నుండి పలివెల 90 కిలోమీటర్లు దూరం లో ఈ పలివెల శివాలయం ఉంది .
అమలాపురం – కొత్తపేట రూట్ లో కొత్త పేట వంతెన వద్ద్దనుంది పలివెల పలివెల 100 స్థంభాల శివాలయం చేరుకోవచ్చు . బస్సు సౌకర్యం తక్కువగా ఉంటుంది . కనుక కొత్తపేట నుండి ఆటో లో సులువుగా చేరుకోవచ్చు . సొంత వాహనాలు ఉంటే పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ పలివెల గ్రామాన్ని చేరుకోవచ్చు .
కోనసీమ లో రాజోలు నుండి వెళ్ళే వారు గన్నవరం మీదుగా నరేంద్రపురం మీదుగా వెళ్ళవచ్చును . ఈ రూట్ లో బస్సు లు తక్కువగా తిరుగుతా ఉంటాయు . సొంత వాహనాలలో వెళ్ళే వారు గన్నవరం నుండి ముంగండ మీదుగా వేలేతే తక్కువ సమయం లోనే ఈ శివాలయం చేరుకోవచ్చు .
సమీప రైల్వే స్టేషన్ : రాజమండ్రి లో కలదు . రాజమండ్రి నుండి ప్రతి అరగంటకు రావులపాలెం బస్సు లు అందుబాటులో ఉంటాయి .
సమీప ఎయిర్పోర్ట్ : రాజమండ్రి కోరుకొండ లో ఎయిర్పోర్ట్ కలదు .

ముగింపు
మొత్తంగా చూస్తే, పలివెల 100 స్థంభాల శివాలయం కోనసీమ ప్రాంతంలో ఆధ్యాత్మిక ను అందించే పవిత్ర క్షేత్రంగా నిలుస్తుంది. వంద స్థంభాలతో నిర్మితమైన ఈ శివాలయం తన విశిష్ట శిల్పకళ, పురాణ చరిత్ర మరియు భక్తుల అచంచల విశ్వాసాలతో ప్రత్యేక గుర్తింపును పొందింది. ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనుకునే ప్రతి భక్తుడు కనీసం ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోవాల్సిందే.

ఇలాంటి కోనసీమ ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర ఆలయ కథనాలను కూడా చదవండి. అయినవిల్లి
ఇలాంటి కోనసీమ ఆలయ కథనాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర ఆలయ విశేషాలను కూడా చూడండి. వాడపల్లి
మీరు ఒకసారి క్రింద ఉన్న వీడియో ద్వారా పలివెల గ్రామా సౌందర్యం తో పాటు ఈ గుడిని చూడగలరు .









