ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండలం, కొప్పవరం గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సత్తెమ్మ తల్లి జాతర ఎంతో ప్రసిద్ధి పొందింది. విచిత్ర వేషాలు, భిక్షాటన, కత్తెర కుండ, పుట్టలో పాలు పోయడం వంటి ఆచారాల వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవాలనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ ఆర్టికల్లో కొప్పవరం సత్తెమ్మ తల్లి చరిత్ర, మహిమలు, జాతర విశేషాలు వివరంగా తెలుసుకుందాం.
పూర్వ కథనం ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని ఈతకోట గ్రామంలో కర్రి వారి వంశానికి చెందిన ఐదుగురు అన్నదమ్ములు తీవ్ర బీదరికంలో జీవించేవారు.
జీవితానికి దారి కనిపించక గోదావరి నది వైపు వెళ్లిన వారికి ఒక బాలిక దర్శనం ఇచ్చిందట.
ఆ బాలిక,
“నాతో వస్తే కరువు కాటకాలు లేని ప్రదేశానికి తీసుకెళ్తాను”
అని చెప్పి వారిని ఒక గ్రామానికి తీసుకువచ్చి అదృశ్యమైందట.
ఆ బాలిక తీసుకొచ్చిన గ్రామమే కొప్పవరం.
ఈ ఐదు గురు అన్నదమ్ములు కొప్పవరం గ్రామం లోనే నివాసం ఉండసాగారు . ఇలా కొన్ని సంవత్సారాలు గడుస్తున్నాయి . కొప్పవరం గ్రామం లో ఈ ఐదు గురు అన్నదమ్ములు చాల గొప్ప వారిగా ఎదిగి ,ధనవంతులుగా తయారయ్యరట . కూటికి గతిలేని వారు పదిమందికి అన్నం పెట్టే స్తాయికి ఎదిగారట . అప్పుడు వాళ్ళకు గతం గుర్తుకు వచ్చి , మనల్నిఇక్కడికి తీసుకువచ్చింది ఒక సాదారణమైన బాలిక కాదు అని నమ్మి , ఆమె ఒక దేవత అని గ్రహించిన వారు ఆమెను సత్తెమ్మ తల్లిగా పూజించడం ప్రారంభించారు.
సత్తెమ్మ తల్లి మహిమలు
కొప్పవరం గ్రామంలో కాలక్రమేణా కర్రి వారి వంశీకులు ధనవంతులుగా ఎదిగారు.
పంటలు బాగా పండేవి, కానీ అప్పట్లో దొంగతనాలు ఎక్కువగా జరిగేవి.
🔸 పాము రూపంలో కాపలా
అలాగే పూర్వికుల కధనం ప్రకారం పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పండిన పంటను
కాపాడుకోవటం కుడా అంతే ఎత్తు అయింది . అప్పట్లో దొంగతనాలు ఎక్కువగా జరిగేవి .
పండిన పంటను దొంగలు దోచుకునేవారు . ఆ దొంగలను సత్తెమ్మ తల్లి ఒక పాము రూపం లో
చేలల్లో తిరుగుతూ వారి దాన్యాన్ని కాపాడుతూ ఉండేదట . ఒక వేల దొంగలు దొంగిలేస్తే వాళ్ళు
అక్కడి నుండి కదలకుండా నిలిపి ఉంచేది . యజమాను వచ్చే వరకు వారిని కదలకుండా చేసి దొంగలను పట్టించేదట . ముక్యం గా కర్రి వారికి
ఇటువంటి సమస్య ఉండేది కాదు అట . కర్రి వారి కులదేవత కాబట్టి వారిని ఎక్కువగా
కాపాడుతూ ఉండేదట.
గాజుల వ్యాపారి కథ – సత్తెమ్మ తల్లి మహాత్మ్యం
కొప్పవరం
గ్రామం లో సత్తెమ్మ తల్లి ఒక బాలిక రూపం లో తిరుగుతూ ఉండేదట . ఒక రోజు గాజుల వ్యాపారి
వచ్చాడట . తనకి గాజులు వేయమని ఆ బాలిక రూపం లో ఉన్న సత్తెమ్మ అడిగిందట . ఆ
గాజుల వ్యాపారి గాజులు వేసాడు . డబ్బులు ఇవ్వమని అడుగగా కర్రి వారి వంశీయుల దగ్గర
తెసుకుమని చెప్పిందట . ఆ గాజుల వ్యాపారి జరిగిన విషయం కర్రి వారికి చెప్పి గాజుల
డబ్బులు తెసుకున్నాడట . ఒక సారి గాజుల
వ్యాపారి బాలికకు గాజులు వేయకుండా నే బాలికకు గాజులు వేశానని అబద్దం చెప్ప్పి
కర్రి వారి వద్ద డబ్బులు తెసుకున్నాడు . అలా అబద్దం చెప్పి డబ్బులు తీసుకున్నందుకు
గాజుల వ్యాపారి వద్ద ఉన్న గాజులన్ని పగిలి పోయాయంట . అప్పుడు గాజుల వ్యాపారికి
చేసిన తప్పును గ్రహించి సత్తేమ్మతల్లి ని తప్పుచేసాను ,నా తప్పును క్షమించు తల్లి
అని వేడుకున్నాడట . అప్పుడు ఆ సత్తెమ్మ తల్లి బాలిక రూపం లో వచ్చి ఆ గాజులు అన్నీ
అతికించి ఇచ్చిందట . ఇలా ఎన్నో మహిమలు,
సత్తెమ్మ తల్లి నిరూపించింది .
సత్తెమ్మ తల్లికి మొక్కులు ఎందుకు చేస్తారు?
సత్తెమ్మ తల్లి చల్లని తల్లి, చక్కని తల్లిగా భక్తులచే పూజించబడుతుంది.
కోరికలు నెరవేరితే భక్తులు —
. విచిత్ర వేషాలు వేయడం . భిక్షాటన చేయడం . వచ్చిన డబ్బులు , బియ్యం మొత్తం అమ్మవారికి సమర్పించడం ద్వారా తమ మొక్కులు చెల్లిస్తారు.
కొప్పవరం సత్తెమ్మ తల్లి జాతర విశేషాలు (3 రోజులు)
🔸 మొదటి రోజు – కత్తెర కుండ
మొదటి రోజు అమ్మ వారి వద్దనుండి కత్తెర కుండ
దింపుతారు . దీనితో జాతర మొదలవుతుంది . కత్తెర కుండ విశషం ఏమిటంటే ఎన్నో ఏళ్లుగా పిల్లలు కలగని వారికి పిల్లలు,
ఆరోగ్యం ,ఐశ్వరం ,అభివృద్ధి అన్నీ కలుగుతాయి .
🔸 రెండవ రోజు – కింద వేషాలు
రెండవ రోజు కింద వేషాలుగా పిలుస్తారు . వందలాది
భక్తులు రకరాల చిత్ర విచిత్ర వేషాలు వేసి , అమ్మ వారి పుట్ట దగ్గరకి వెళ్లి పుట్టలో పాలు పోసి తమ కోర్కెలు తీర్చమని
సత్తెమ్మ తల్లిని వేడుకుని , తమ కోరిక తీరినట్లయితే 2 సంవత్సరాలకు వచ్చే నీ జాతరలో మరల మేము వేషాలు వేసు కుంటామని మ్రొక్కు కుంటారు
. ఆ పుట్ట దగ్గరినుండి సత్తెమ్మ తల్లి
గుడి దగ్గరకి వచ్చి పూజారుల చేతిలో ఉన్న బెత్తాలతో, విచిత్ర వేషాలు వేసిన వేషదారులు
కావాలని దెబ్బలు తింటారు . తమకు రాబోయే కష్టాలన్నీ ఈ దెబ్బల రూపంలో పోతాయని భక్తుల
ప్రగాడ విశ్వాసం
🔸 మూడవ రోజు – బల్ల మీద వేషాలు / ట్రాక్టర్ వేషాలు
మూడవ రోజు : ట్రాక్టర్ల మీద వేషాలు బల్ల మీద
వేషాలుగా పిలుస్తారు . భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు గాను , అమ్మ వారికి
మొక్కు చేల్లిద్దామని విచిత్ర వేషాలు
వేసుకుని గ్రామం లో భిక్షాటన చేయడం
జరుగుతుంది . రకరకాల వేషాలు వేసి , చిన్న పెద్దా , పేద ధనిక తేడా లేకుండా భిక్షాటన
చేసి వచ్చిన డబ్బులు , బియ్యం గాని మొత్తం అమ్మవారికి చెల్లిస్తారు .
ముగింపు
ఇది కొప్పవరం సత్తెమ్మ తల్లి చరిత్ర,
ఆమె మహిమలు, జాతర విశేషాలు, భక్తుల అచంచల విశ్వాసానికి నిదర్శనం.
ఈ జాతర కొప్పవరం గ్రామానికి మాత్రమే కాదు,
చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక ఆధ్యాత్మిక పండుగగా నిలిచింది.
కొప్పవరం సత్తేమ్మతల్లి జాతరల వీడియో లు చూడండి













