కోనసీమలో కొబ్బరి తో చేసే 5 ప్రత్యేక వంటలు | సంప్రదాయ రుచులు

By konaseema life

Updated On:

Gongura -kobbari kura

 

కొబ్బరి తో చేసే 5 ప్రత్యేక వంటలు- పల్లెటూరి రుచులు వాటి తయారీ విధానం తెలుసుకోండి                                       

గోదావరి జిల్లా లలో  ప్రతి ఇంటి వంటల్లో కొబ్బరి వాడకం సాధారణ విషయం.  ఇక్కడి ప్రజల దైనందిన ఆహారంలో కొబ్బరి ఒక ముఖ్య భాగం.  పచ్చడి ,  కూరలు, పులుసులు – ఏ వంటకం చేసినా కొబ్బరి రుచి  తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది  .

కోనసీమ లో  కొబ్బరి వంటలు కేవలం రుచికే కాదు, సంప్రదాయం మరియు ఆరోగ్యానికి కూడా ప్రతీకగా నిలుస్తాయి.  పాతకాలం నుంచి వచ్చిన  సాంప్రదాయ  వంట  విధానాల్లో కొబ్బరి ప్రధాన పదార్థంగా ఉపయోగించబడుతోంది.  అందుకే కోనసీమ ఆహారం అంటే సంప్రదాయం + ఆరోగ్యం + అపూర్వమైన రుచి అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కొబ్బరి తో చేసే 5 ప్రత్యేక వంటలు   సాంప్రదాయ వంటలు  Top 5 Coconut Foods  మన పల్లెటూరు రుచులు ఒకసారి  ఎలా తాయారు చేస్తారో తెలుసుకుందాము .

Coconut Top 5 Coconut Foods
Coconut Top 5 Coconut Foods

Top 5 Coconut Foods కొబ్బరి + చింతకాయ పచ్చడి  

ఈ వంటకం ప్రత్యేకత  :

కొబ్బరి తో చేసే 5 ప్రత్యేక వంటలు  – కోనసీమ లొని  ప్రతి ప్రాంతంలో  కొబ్బరిచెట్లు  అదికంగా ఉండటం తో  స్తానికంగా  లభించే  కూర గాయాలతో  రుచికరమైన  వంటలు చేయడం  ఇక్కడ  పూర్వికుల నుండి  సంప్రదాయం గా వస్తున్న  అలవాటు .  అటువంటి  పురాతన కాలం  నుండి  తయారుచేసే  వంటకాలలో  కొబ్బరి చింతకాయ పచ్చడి  ప్రత్యేకమైనది .

 

కావలసిన పదార్థాలు 

: 1.  కొబ్బరి తురుము    2. పచ్చి చింతకాయలు    3.పచ్చ్హి మిరపకాయలు  4.  ఉప్పు      5.ఎండుమిర్చి  6. ఆవాలు 7.  మినపపప్పు వెల్లుల్లి , దనియాలు , జిలకర

కొబ్బరి తో చేసే 5 ప్రత్యేక వంటలు- చింతకాయ కొబ్బరి పచ్చడి
కొబ్బరి తో చేసే 5 ప్రత్యేక వంటలు- చింతకాయ కొబ్బరి పచ్చడి

 

తయారీ విధానం

ముందుగా  పచ్చి కొబ్బరికాయను తీసుకుని   దానినుండి కొబ్బరిని  తురుము  వేరుచేసుకోవాలి . చేతి తో గాని యంత్రం తో గాని  కొబ్బరి తురుము తీయడం మంచిది .   పచ్చి చింత కాయలు పై ఉన్న  గట్టి పొరను  జాగ్రత్తగా తొలగించాలి . దీని కోసం ప్రత్యేకంగా చాకును ఉపయోగిస్తారు  . కొంచెం లేత చింతకాయలు ఐతే  ఈ తొక్క తీయకుండా వాడుకోవాచ్చు  .  తర్వాత చింత కాయలో ఉన్న గింజా తీయడం కోసం కాయను నిలువుగా చీల్చి ,  లోపల పచ్చి  గింజల్ని తొలగించాలి .

కొబ్బరి  తురుము ,చింత కాయలు సిద్దం చేసుకున్న తర్వాత  ,  బాణలి లో పోపు సామానులు  మినపపప్పు , పచ్చి శనగపప్పు , పచ్చి మిర్చి , వేసి సన్నని సెగ మీద వేగనివ్వాలి . మంటను ఆపి , ఈ వేడి చేసిన , తాళింపుల కలయిక ను వేరే గిన్నిలోనికి తెసుకుని , చల్లారనివ్వాలి .  ఈ చల్లారిన తాళింపు  లో కొబ్బరి తురుమును , సిద్దం చేసిన పచ్చి  చింత కాయ ముక్కలు  పాత కలం పద్దతిలో  రోటిలో గాని , సనికాలి అనే పొత్రము సహాయంతో  కొంచెం మెత్తగా రుబ్బుతారు . ఇక్కడే రుచికి సరిపడా ఉప్పు ను జోడించి రుచిని సరిచేసుకుంటారు  . ఇలా రోటిలో కుదరని వారు మిక్షి లో కొద్దిగా మెత్తగా చేస్తే సరిపోతుంది .

తర్వాత  బాణలి లో కొద్దిగా నునే పోసి  పోపు సామానులు  జీలకర్ర , వెల్లుల్లి , ఎండుమిర్చి , వేసి  రుబ్బిన కొబ్బరి చింతకాయ పచ్చడి  ముద్ద్దను కొంచెం  సన్నని సెగ మీద  ఉడకనిస్తారు . తదుపరి  కరివేపాకు , కొత్తిమీర వేసి  కలుపుతారు . అంతే  కమ్మని చింతకాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోనట్లే !

 

ఎప్పుడు తింటారు? (వేసవి/గ్రామీణ భోజనం)

పేదవాడి  పసందైన విందు ఈ కొబ్బరిపచ్చడి .  ఫిబ్రవరి నెల  నుండి  వేసవికాలం  వరకు లభించే  చింత కాయలతో  చేసే కొబ్బరి పచ్చడిపచ్చడి   రుచి అమోఘం !  ఈ ”  కొబ్బరి పచ్చడి  వేడివేడిగా అన్నంలో కలిపితే అసలైన కోనసీమ చింతకాయ కొబ్బరి పచ్చడి  రుచి తెలుస్తుంది.”  అల్పాహారాలు ఐన ఇడ్లి , మినపరోట్టే లో కుడా ఈ పచ్చడి  చాలా బాగుంటుంది . గ్రామిన ప్రాంతాలలో  నేటికి చింతకాయలు దొరికే   సీజన్లో  ప్రతి ఇంటిలోనూ ఈ పచ్చడి  తప్పకుండా చేస్తారు .పూర్వం  పెళ్ళిళ్ళు సమయం లో బోజనాలలో ఈ కొబ్బరి పచ్చడి తప్పని సరిగా ఉపయోగించేవారు .నేటి ఆదునికయుఘం  లో ఎన్ని రకాల వంటకాలు వచ్చిన  కొబ్బరి చింతకాయ పచ్చడి మాత్రం ప్రత్యెక రుచితో పాటు ,   గుర్తింపు ను సంపాదించించి .,

 

కొబ్బరి తో చేసే 5 ప్రత్యేక వంటలు – కొబ్బరి + సెనగపప్పు కూర

Protein rich traditional curry

కొబ్బరి తో చేసే 5 ప్రత్యేక వంటలు  లో   2 వది  కొబ్బరి సెనగపప్పు  కూర .  కొబ్బరి తో తాయారు చేసే వంటకాలలో  గ్రామీణ ప్రాంతాలలో తరచూ వండుకునే   వంటకం  కొబ్బరి శనగపప్పు కూర  . ముక్యంగా పండుగ సమయాలలో  పర్వదినాలలో  ఉపవాసాల సమయం లో  శరీరానికి కావలసిన ప్రోటీన్ ని అందించే బలవర్ధకమైన ఆహారం  ఈ వంటకం  .

కావలసిన పదార్దములు :  1. కొబ్బరి తురుము  అర  కప్పు    2 . పచ్చి శనగపప్పు ఒక కప్పు    3.  ఎండుమిర్చి   4 .  ఆవాలు  5 . వెల్లుల్లి   6.  మినపపప్పు  7 .  కరివేపాకు   8 . ఇంగువ  9 . పసుపు   10 . ఉప్పు   11. అర కప్పు  ఉల్లిపాయముక్కలు  12. కొత్తిమీరా

kobbari - sanagappapu kura
kobbari – sanagappapu kura

తయారీ విధానం   

పచ్చి కొబ్బరి ని తురుము తీసుకుని ప్రక్కన పెట్టుకోవాలి . శుబ్రంగా కడిగిన  పచ్చి శనగపప్పు ను   ఒక గంట  నాన బెట్టి  ఉంచుకోవాలి .  తర్వాత  . . ఒకగిన్నిలో   పప్పు కు తగిన ఉప్పుని  వేయాలి . తర్వాత  దీనిని  ఉడక నివ్వాలి . పప్పు జాగ్రత్తగా  పలుకుగా ఉడికేలా చూసుకోవాలి . మెత్తగా అవ్వ కూడదు  .    కుక్కర్ లో  ఉడికించే వారు పప్పు నాన బెట్టకుండా  శనగపప్పు ను కుక్కర్ లో   1 గాని 2 గాని  విసిల్ రానివ్వ్వాలి .   ఇలా ఉడికిన  పప్పు నీళ్ళు లేకుండా వడకట్టి ఒక ప్రక్క పెట్టుకోవాలి .

పొయ్యి మీద  బాణలి లేదా కడాయి పెట్టుకుని  3 నుంచి 4 టేబుల్ స్పూన్ ల వరకు నునే వేసుకోవాలి .  నూనే వేడెక్కాక  పావు టీస్పూన్  పసుపు , పావు టీస్పూన్  ఇంగువా ,  అర టీస్పూన్  మెంతి పొడి వేసుకోవాలి  .  తర్వాత  పోపు సామానులు  మినపప్పు ,ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి   వేసుకుని  , కొంచెం వేగిన తరువాత  4 నుంచి  6 వెల్లుల్లి  పాయలు రెమ్మలు  , 2 కరివేపాకు రెమ్మలు   వేసుకోవాలి .  వెల్లుల్లి లో పచ్చి వాసన పోయే వరకు  దోరగా వేయించు కోవాలి  . 4 పచ్చిమిర్చి నిలువుగా చేల్చి వేసుకోవాలి . చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు  వేసి కొంచెం సేపు దోరాగా వేగా నివ్వ్వాలి . గోల్డెన్ కలర్ లోకి ఉల్లిపాయలు  వచ్చిన తరువాత ముందుగా సిద్డ్డం చేసిన  ఉడికిన శనగపప్పు ను   వేసి  5 నిముషాలు కలుపుతూ ఉండాలి .

తరువాత ముందుగా తీసుకున్న పచ్చి కొబ్బరి  తురుము ను వేసి  , రుచికి సరిపడా ఉప్పు వేసి  చిన్న మంట మీదా  5 నుంచి 10 నిముషాలు  కలుపుతూ  ఉండాలి .  చివరలో కొంచెం  చిన్నగా తరిగిన  కొత్తిమీర ను వేయాలి .  ఇప్పటికే  కమ్మని వాసన తో  కొబ్బరి శనగపప్పు కూర  ఘుమ ఘుమ లాడుతుంది .

ఎప్పుడు తింటారు?

తక్కువ ఖర్చు తో  కూరగాయలు లేని సమయం లో  కోనసీమ లో దొరికే  కొబ్బరితో సులువుగా చేసే కూర ఇది . అధిక  ప్రోటీన్ కలిసిన ఆరోగ్య కరమైన ఆహారం , పండుగ సమయాల్లో  శరీరానికి కావలసిన  తక్షణ శక్తిని  అందిచే బలవర్ధకమైన ఆహారం .  ఈ కూర ను  అన్న లో గాని చపాతీ ల లోకి కుడా ఈక్కువగా వాడుతుంటారు .   పూర్వకాలం నుండి  అనాదిగా వాడు తున్న  సాంప్రదాయ వంటల్లో  కొబ్బరి శనగపప్పు  కూర ఒకటి .

రుచికి   రుచి !  తక్షణ  శక్తి  !

 

Top 5 Coconut Foods  కొబ్బరి + మామిడికాయ పులుసు

కొబ్బరి తో చేసే 5 ప్రత్యేక వంటలు  : గోదావరి  జిల్లా లలో వేసవి కాలం రాగానే మామిడికాయ లతో  ఎన్నో రుచికరమైన వంటకాలు  చేస్తుంటారు .  వేసవి కాలం దొరికే మామిడి కాయలతో   కోనసీమ లో కొబ్బరికాయలతో  చేసే వంటకాలలో   కొబ్బరి మామిడికాయ కూర  మంచి రుచి కరమైంది .    అన్నం లోకి  మంచి కాంబినేషన్  ఈ కూర  .

కొబ్బరి తో చేసే 5 ప్రత్యేక వంటలు లో   3 వది  కొబ్బరి + మామిడికాయ పులుసు

కావలసిన పదార్దములు :  1. కొబ్బరి తురుము  అర  కప్పు   2 . మామిడికాయ  కప్పు   3.  పచ్చి  మిర్చి   4 .  కరివేపాకు   5 . పసుపు   6. ఉప్పు  7. అర కప్పు  ఉల్లిపాయముక్కలు  11. కొత్తిమీరా

తయారీ విధానం

స్టవ్ మీద లేదా పొయ్యి మీద  కడాయి పెట్టి   4 స్పూన్ ల నూనే వేసి  , కొంచెం వేడి అయిన తరువాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగనిచ్చి  , ఉల్లిపాయ ముక్కలు  పచ్చి మిర్చి  ముక్కలు వేసి  మాడి పోకుండా దోరగా  గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి .  తరువాత  సన్నగా  తరిగిన  మామిడికాయ ముక్కలు వేసి  , రుచికి సరపడి నంతా ఉప్పు , కారం వేసి కొంచెం సమయం పచ్చి వాసన  పోయే వరకు వేయించవలెను .

తదుపరి మామిడి  ముక్కలకు తగినంత  నీటిని వేసి మామిడి  ముక్కలు ఉడక నివ్వాలి . మామిడి ముక్కలు ఉడికిన తరువాత  కొబ్బరి తురుము వేసి  బాగా దగ్గరగా అయ్యే వరకు  ఉంచి   స్టవ్ ఆఫ్ చేయాలి .  సన్నగా తరిగిన కొత్తిమీర  వేయ వలెను  . కమ్మని వాసనతో  ఘుమ ఘుమ లాడే మామిడికాయ  కొబ్బరికాయ  పులుసు  అన్నంలోకి  కలుపుకు  తింటే  చాలా  బాగుంటుంది . వేసవి కాలం లో దొరికే మామిడికాయ తో  చేసి ఈ వంటకం   కొబ్బరి కమ్మదనం , మామిడి ముక్కలు  మృదుత్వం   కలపి  మంచి రుచి  అందిస్తాయి .   ఈ కూర అన్నం లోకి చాల బాగుంటుంది .

Top 5 Coconut Foods  గోంగూర +కొబ్బరి కూర

కొబ్బరి తో చేసే 5 ప్రత్యేక వంటలు  – ఆంధ్రుల గోంగూర తో చేసిన వంటకాలలో  గోంగూర పఛ్దీ తరువాత అంతటి ఇష్టంగా తినే  గోంగూర కొబ్బరి  కూర .

కావలసిన పదార్దములు :  1.  పుల్ల గోంగూర   2. కొబ్బరి తురుము   3.  వెల్లుల్లి   4. పచ్చిమిర్చి   5. ఉల్లిపాయముక్కలు

6. నూనె    7 . పసుపు   8.  కారం   9.  ఉప్పు    10.  ( తాలింపు సామానులు )  ఆవాలు , జీలకర్ర , మినపపప్పు,  పచ్చిసనగాపప్పు , కరివేపాకు

Gongura -kobbari kura
Gongura -kobbari kura

తయారీ విధానం

శుబ్రం చేసిన గొంగురను  ఒక పాత్రలో నీళ్ళు పోసి  4 నుంచి 5 నిముషాలు  ఉడికించ వలెను .  ఉడికించ గోంగూర ను నీరు వేరుచేసి   పప్పు గుత్తి తో మెత్తగా చేయవలెను .  తరువాత స్టవ్ మీద  కడాయి పెట్టి  కొద్దిగా నూనె పోసి  , ఉల్లిపాయముక్కలు , నిలువుగా చేల్చిన పచ్చిమిరపకాయలు దోరాగా వేయిన్చుకోవలెను .  దీనిలో మెత్తగా చేసిన గోంగూర  ను  వేసి  బాగా కలపవలెను . 2 నిముషాలు పచివాసన పోయే వరకు  ఉన్దికిన తరువాత సిద్దం చేసిన కొబ్బరి తురుము వేయవలెను . దీనిలో కొద్దిగా పసుపు , రుచికి సరిపడా ఉప్పు , కారం వేసి బాగా కలిపి 10 నిముషాలు  ఉడికించ వలెను .

తాలింపు కోసం వేరొక కడాయి తెసుకుని  దానిలో ఒక చెంచా నూనె వేసి  తాలింపు సామానులు  ఆవాలు , జీలకర్ర , మినప పప్పు ,పచ్చిసనగ పప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి . తరువాత 6 వెల్లుల్లి  రెమ్మలు తీసుకుని దంచుకుని  తాళింపు లో వేయవలెను . కొద్దిగా కరివేపాకు , ఎండుమిర్చి వేసి వేగిన తరువాత    ఈ తాలింపు ను ముందుగా సిద్దం చేసుకున్న   గోంగూర కొబ్బరి కూరలో  వేసి మూతపెట్టి ఉంచవలెను .

తక్తకువ సమయం లో  వండ గలిగే    తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచి  కలిగిన ఈ గోంగూర కొబ్బరి కూర అన్నం లో కలుపుతూ  ఉంటే   భలే రుచి గా ఉంటుంది .

 

దొండకాయ + కొబ్బరి వేపుడు

కావలసిన పదార్దములు :  1.  సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు    2. కొబ్బరి తురుము   3.  వెల్లుల్లి   4. పచ్చిమిర్చి   5. ఉల్లిపాయముక్కలు

6. నూనె    7 . పసుపు   8.  కారం   9.  ఉప్పు    10.  ( తాలింపు సామానులు )  ఆవాలు , జీలకర్ర , మినపపప్పు,  పచ్చిసనగాపప్పు , కరివేపాకు

Dondkay kobbari fry
Dondkay kobbari fry

తయారీ విధానం

స్టవ్ మీద కడాయి పెట్టి  4 చెంచాల  నూనె వేసి  ఆవాలు వేసి చిటపట  మని వేగిన  తరువాత జీలకర్ర , వేరుసనగాపప్పు, పచ్చి శనగపప్పు , మినపప్పు దోరగా వేయించి , తరువాత ఎండుమిర్చి కరివేపాకు వీసి బాగా వేగనివ్వాలి .

సిద్దం చేసిన దొండకాయ ముక్కలను  దీనిలో వేసి 1/4 స్పూన్  పసుపు , తగినంత ఉప్పు  వేసి బాగా కలపి  మూతపెట్టి  కొంచెం సేపు మగ్గనివ్వాలి .దొండకాయ ముక్కలు వేగే వరకు కలుపుతూ ,  ముక్కలు వేగిన తరువాత  కొబ్బరి తురుము వేయవలెను .  కొబ్బరి తురుము మాడి  పోకుండా  కలుపుతూ ఉండాలి .

కూర   పొడి పొడి గా అయిన తరువాత 2 స్పూన్ ల కారం  , ( కుదిరితే )    జీడిపప్పు పొడి  1 స్పూన్ వేసి  బాగా కలపవలెను . దొండకాయ కొబ్బరి కూర పొడి పొడి లాడుతూ  చాలా  బాగుంటుంది .  లంచ్ బాక్స్ లోకి ప్రత్యేకమైన వంటకం  కొబ్బరి దొండకాయ ఫ్రై .  పిల్లలు  పెద్దలు  ఇష్టం గా  తినే ఈ కాంబినేషన్   మీరు ఒక సారి ట్రై చేయండి .

Lunch box special , Dry curry lovers కి perfect  

ముగింపు

Konaseema ప్రాంతం సహజసిద్ధమైన కొబ్బరి తోటలతో ప్రసిద్ధి. ఇప్పటికి  గ్రామిన ప్రాంతాలలో తక్కువ కర్చుతో దొరికే కూరగాయలతో  వంటకాలు చేసుకుంటారు .   అందుకే ఇక్కడి వంటల్లో కొబ్బరి ప్రధాన పదార్థంగా మారింది.   రుచి, పోషకాలు, సంప్రదాయం…..ఈ మూడు కారణాల వల్ల కోనసీమ ప్రజలు కొబ్బరిని ఎక్కువగా వాడుతారు.  అది కేవలం ఆహారం కాదు,  వారి జీవనశైలి మరియు సంస్కృతిలో భాగం.

 

Related Post

Leave a Comment