కోనసీమలో
ఒక రోజు… లొల్ల లాకుల వద్ద
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, లొల్ల గ్రామం సమీపంలో ఉన్న
ప్రసిద్ధ లొల్ల లాకులు ప్రక్రుతి ప్రేమికులను తమ సహజ సౌందర్యం తో ఆకర్షిస్తున్నాయి . గోదావరి జిల్లాల జీవనాడిగా నిలిచిన ఈ లాకులు కేవలం సాగునీటి వనరు మాత్రమే కాదు… ప్రకృతి ప్రేమికులకు, ప్రయాణికులకు, సినిమా అభిమానులకు ఒక
అపూర్వ అనుభూతి.
తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పంట పొలాలకు సాగునీరు అందించాలనే మహత్తర లక్ష్యంతో బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ గారు నిర్మించిన ఈ లాకులు, నేటికీ రైతుల జీవితాలకు ఆధారం.
![]() |
| లోల్లలాకులు – ఆత్రేయపురం మండలం |
లొల్ల లాకుల స్థానం & దూరాలు
లొల్ల లాకులు చేరుకోవడం చాలా సులభం.
- 📍 రాజమండ్రి
నుండి – సుమారు
24 కిలోమీటర్లు - 📍 రావులపాలెం
నుండి – సుమారు
8 కిలోమీటర్లు - 📍 ఆత్రేయపురం
నుండి – సుమారు
2 కిలోమీటర్లు
రావులపాలెం నుంచి ఆత్రేయపురం లేదా వాడపల్లి వైపు ప్రయాణిస్తుంటే, కాస్త మలుపు తిప్పితే ఈ అద్భుత ప్రదేశం మీ ముందే కనిపిస్తుంది.
వర్షాకాలంలో లొల్ల లాకుల అందం
వర్షాకాలంలో గోదావరికి వరద నీరు చేరగానే లొల్ల లాకులు మరో రూపం దాలుస్తాయి. కాలువలో నీరు ఎర్రగా, నిండుగా
ప్రవహిస్తూ కనిపిస్తుంది. లాకుల నుంచి జలపాతంలా పడే నీరు, చుట్టూ విస్తరించిన పచ్చని పంట పొలాలు… ఈ దృశ్యం చూస్తే మనసు ఆగిపోతుంది. లాకుల నుంచి పడే నీటి చప్పుడు… చల్లని గాలి… ప్రశాంతమైన వాతావరణం…
ఇక్కడ కొద్ది సేపు కూర్చుంటే చాలు… జీవితంలోని అలసట అంతా మాయమైపోతుంది. నేను చెప్పడం కాదండి… ఒకసారి మీరు స్వయంగా వచ్చి ఆ జలపాతాల శబ్దం వినండి. అక్కడే ఉండి సేదతీరాలని అనిపిస్తుంది.
![]() |
| రావులపాలెం లో కొనసీమ ముఖద్వారం |
లొల్ల లాకులు – సినిమా దర్శకుల ఫేవరెట్ లొకేషన్ 🎬
మా గోదావరి జిల్లాల్లో సినిమా తీస్తే అది సూపర్ హిట్ అవుతుందనే మాట ఊరికే రాలేదు. అందుకే లొల్ల లాకులు అనగానే సినిమా వాళ్లకు ప్రత్యేకమైన ప్రేమ. ఈ అందమైన లొకేషన్లో వందలాది సినిమాల్లో సాంగ్స్,
సీన్స్ చిత్రీకరించారు.
లొల్ల లాకులపై చిత్రీకరించిన ప్రముఖ సినిమాలు
- 🎶 అందాల
రాముడు – సునీల్ నటించిన చిత్రం (సాంగ్) - 🎬 ముద్దుల
ప్రియుడు – వెంకటేష్,
రమ్యకృష్ణ - 🎶 వెంకీ
మామ – నాగ చైతన్య,
వెంకటేష్ (సాంగ్) - 🎬 నా
ఆటోగ్రాఫ్ – స్వీట్ మెమొరీస్
– రవితేజ - 🎬 గంగోత్రి – అల్లు
అర్జున్ - 🎬 మనసిచ్చి
చూడు - 🎬 పల్నాటి
పౌరుషం - 🎬 మా
పెళ్లికి రండి - 🎬 సీతయ్య
ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. ఈ లాకుల అందం వెండితెరపై కనిపించిన ప్రతీసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
![]() |
| లొల్ల గ్రామం లో సహజమైన ప్రక్రుతి అందాలు |
ఎందుకు లొల్ల లాకులు చూడాలి?
- 🌿 ప్రకృతి
అందాలను దగ్గరగా చూడాలంటే - 🌊 జలపాతాల
శబ్దంతో మనసు ప్రశాంతం కావాలంటే - 🎥 సినిమా
షూటింగ్ లొకేషన్స్ చూడాలంటే - 🚗 చిన్న
ట్రిప్గా కోనసీమలో ఒక మంచి ప్లేస్ వెతుకుతుంటే
లొల్ల లాకులు తప్పకుండా మీ లిస్ట్లో
ఉండాలి.
చివరిగా…
లొల్ల లాకులు అనేవి కేవలం ఒక సాగునీటి నిర్మాణం కాదు… అవి కోనసీమ గుండె చప్పుడు.
గోదావరి నీటితో రైతుల జీవితాలకు వెలుగు నింపిన ఈ లాకులు, నేటికీ ప్రకృతి ప్రేమికులకు ప్రశాంతతను పంచుతున్నాయి.
మీరు రావులపాలెం – ఆత్రేయపురం – వాడపల్లి వైపు వెళ్తుంటే, 👉 ఒక్కసారి లొల్ల లాకులు చూసి వెళ్లండి…
ఈ అనుభూతి మీ మనసులో చాలా రోజుల పాటు నిలిచిపోతుంది.
![]() |
| లోల్లలాకుల అందాలు |
కోనసీమజిల్లా ఆత్రేయపురం మండలం లో ఉన్న లొల్ల లాకుల అందాలు క్రింద వీడియో లో చూడగలరు













