A Story Behind Elisha Fish – పులస స్టోరీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లభించే పులస చేప (Elisha Fish) కు అపారమైన డిమాండ్ ఉంది. గోదావరి నదికి జూలై–ఆగస్టు నెలల్లో వరద నీరు చేరినప్పుడు, ఈ పులస చేపలు సుదూర సముద్ర తీర ప్రాంతాల నుంచి తమ సంతతిని పెంచుకోవడానికి నీటికి ఎదురు ఈదుతూ గోదావరి నదిలోకి ప్రవేశిస్తాయి.
గోదావరి నదిలోని ఎర్ర నీటిలో పులస చేప ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు, లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలు పెట్టడానికి, అవి ఎదగడానికి గోదావరి నది తీరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అందుకే సముద్రంలోని ఉప్పు నీటి ప్రాంతాల నుంచి మంచినీటి నదీ పాయల వైపు పులస చేపలు వలస వస్తుంటాయి.
శాస్త్రీయ నామం : Tenualosa ilisha
![]() |
| గోదావరి పులస చేప |
గోదావరి పులస చేప – ప్రత్యేకత
పులస చేపను ఇలిష్, ఇలిషి, హిల్సా, హిల్షా హెర్రింగ్ లేదా హిల్సా షాడ్ అని కూడా పిలుస్తారు. ఇది Clupeidae ఫ్యామిలీకి చెందిన హెర్రింగ్ జాతి చేప.
భారత ఉపఖండం అంతటా ఈ చేపలు లభించినప్పటికీ, గోదావరి డెల్టాలో దొరికే పులసకు ప్రత్యేకమైన రుచి, పేరు ఉంది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు, మాంసాహార ప్రియులు
👉 “మార్కెట్లో పులసలు వచ్చాయా?”
అని అడగడం మొదలుపెడతారు.
గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలోనే ఈ చేపలు ఎక్కువగా వేటకు చిక్కుతుంటాయి.
ఖండాలు దాటి ప్రయాణం
ఇలిషా లేదా హిల్సా చేపలు ఆస్ట్రేలియా, టాంజానియా వంటి సుదూర దేశాల సముద్ర ప్రాంతాల నుంచి ఉష్ణమండల ప్రాంతాల వైపు ప్రయాణించి, భారత ఉపఖండంలోని నదీ తీరాలకు పిల్లలు పెట్టేందుకు చేరుకుంటాయి. ఈ ప్రయాణంలో మంచినీటి నదుల్లోకి ఎదురు ఈదుతూ ముందుకు సాగుతుండగా మత్స్యకారుల వలలకు చిక్కుతుంటాయి.
బంగ్లాదేశ్ జాతీయ చేప
హిల్సా చేప (మన పులస చేప) బంగ్లాదేశ్ జాతీయ చేప.
ప్రపంచవ్యాప్తంగా జరిగే హిల్సా చేపల ఎగుమతుల్లో సుమారు 86% బంగ్లాదేశ్ నుంచే జరుగుతాయి.
అందుకే 2017లో బంగ్లాదేశ్ ప్రభుత్వం
Hilsa Fish కు GI (Geographical Indication) హోదాను మంజూరు చేసింది.
ఈ చేపలు
. బంగ్లాదేశ్లో: బ్రహ్మపుత్ర, మేఘన, జమున డెల్టాలలో
. భారత్లో: రుప్నారాయణ, హుగ్లీ, మహానది, నర్మదా, గోదావరి నదుల్లో లభిస్తున్నాయి.
పుస్తలు అమ్మి ఐన పులస తినాలి అనేది గోదావరి జిల్లాల నానుడి .
ఈ పులస చేపల రుచి ని తెలుసుకున్న మాంసాహార
ప్రియులు ఈ పులస చేపలు ఒక సారైనా రుచి చూడాలి అని అనుకుంటారు . గోదావరి జిల్లాలలో
ఉన్నవారు , దూర ప్రాంతలో ఉన్న బందువులకు,స్నేహుతులకు,
లేదా అధికారులకు ఇవ్వడానికి
ఈ చేపను ఎగబడి మరి కొంటారు . అందుకే ఈ పులస చేప ధరలు ఆకాశంలో ఉన్నాయి . చేప
తుకాన్ని బట్టి 3 వేల నుండి 25 వేల వరకూ ధర పలుకుతుంది అంటే నమ్మితీరాలి .
గోదావరి నదీ తీరం లో తగ్గిన పులసలు :
గోదావరి నది లో కలుస్తున్న
జలకాలుష్యం , గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుగా కడుతున్న
బ్రిడ్జి లు వలన పులసచేప ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడి, పులసచేపలు గోదావరిలో ప్రయనించ లేకపోతున్నాయి. మత్యకారులు ఈ పులస చేపలు పట్టడం కోసం ప్రత్యేకంగా
వలలు సిద్దం చేస్తారు .గోదావరి నది లో ప్రవాహ వేగం లోనే ఈ వేట సాగిస్తుంటారు . ఇలా రోజంతా కష్టపడితే ఒక పులస
దొరికేనా వారికి సంతోషమే . కాని ఈ సీజన్లో లో గోదావరి లోకి పులసలు రావటం తగ్గిందని, కోనసీమ లోని స్తానిక మత్యకారులు చెబుతున్నారు .
![]() |
| Hilsa Fish (Tenualosa ilisha) |
ధరలు ఆకాశంలోకి
పులస రుచి తెలుసుకున్న మాంసాహార ప్రియులు, ఈ చేపను ఒక్కసారైనా రుచి చూడాలనుకుంటారు.
గోదావరి జిల్లాల వారు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు, స్నేహితులకు, అధికారులకు కూడా ఈ పులసను బహుమతిగా పంపిస్తారు.
అందుకే పులస ధరలు భారీగా ఉంటాయి.
చేప బరువును బట్టి రూ.3,000 నుంచి రూ.25,000 వరకు ధర పలుకుతుంది.
తగ్గుతున్న పులసలు – ఆందోళన
గోదావరి నదిలో పెరుగుతున్న జల కాలుష్యం,
నది ప్రవాహానికి అడ్డుగా నిర్మిస్తున్న బ్రిడ్జీలు, బ్యారేజీలు
వల్ల పులస చేపల ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
మత్స్యకారులు ప్రత్యేకంగా వలలు సిద్ధం చేసి, గోదావరి ప్రవాహ వేగంలోనే వేట సాగిస్తారు.
రోజంతా కష్టపడ్డాక ఒక పులస దొరికినా వారికి అదే సంతోషం.
కానీ ఇటీవల కాలంలో గోదావరిలోకి పులసలు రావడం తగ్గిందని కోనసీమ స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.
డూప్లికేట్ పులసల సందడి
పులస ధరలు సామాన్యుడికి అందని స్థాయికి చేరడంతో, ఇప్పుడు మార్కెట్లో ఒడిశా పులసలు కనిపిస్తున్నాయి.
ఇవి రాజమండ్రి, ధవళేశ్వరం, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, భీమవరం, ఏలూరు తదితర మార్కెట్లకు దిగుమతి అవుతున్నాయి.
ఒడిశా పులస రుచి సుమారు 50% మాత్రమే ఉంటుందని చాలామంది అభిప్రాయం.
తాజాగా లేకపోతే “ఇదేనా పులస రుచి?” అని అనుకునే పరిస్థితి కూడా ఉంటుంది.
కాబట్టి పులస కొనేటప్పుడు స్థానికంగా తెలిసిన వారిని అడిగి కొనడం మంచిది.
ఒడిశా పులసలు
రూ.300 నుంచి రూ.1,500 వరకు లభిస్తున్నాయి.
అయితే పులస కూరను రాత్రి వండి మరునాడు తింటే రుచి ఇంకా పెరుగుతుంది.
ఒరిజినల్ గోదావరి పులస రుచి ఒక్కసారి చూసారంటే…
మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
అయ్! అవునండి…
మా గోదావరి జిల్లాల “పులస పులుసు” రుచి కుదిరితే తప్పక ఒకసారి ఆస్వాదించండి 😋🐟











