పలివెల 100 స్తంభాల శివాలయం – కోనసీమలోని అరుదైన పురాతన దేవాలయం
![]() |
| పలివెల గ్రామంలో ఉన్న 100 స్తంభాల ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం |
పలివెల గ్రామం – చారిత్రక నేపథ్యం
గోదావరి పరివాహక ప్రాంతమైన కోనసీమను పురాతన కాలంలో అనేక రాజవంశాలు పరిపాలించాయి. ఈ ప్రాంతాన్ని పల్లవులు పాలించిన కాలంలో “పల్లవపురం” గా పిలిచేవారని, కాలక్రమంలో అదే పేరు “పలివెల” గా మారిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.
ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం విశేషాలు
తూర్పు చాళుక్యుల కాలం నాటి శిల్పకళ
ఈ మండపాలపై చెక్కబడిన గ్రానైట్ శిల్పాలు, స్తంభాల కళాకృతులు మన భారతీయ చరిత్రకు జీవంత సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
|
పలివెల |
![]() |
| Umakoppulingeswara Swamy Temple Konaseema |
100 స్తంభాల విశిష్టత
ఈ ఆలయంలోని గ్రానైట్ స్తంభాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ నిలిచి ఉండటం విశేషం.ప్రతి స్తంభంపై ఉన్న శిల్పకళ దర్శనమిచ్చే వారిని మంత్రముగ్ధులను చేస్తుంది.
పలివెల శివాలయంలోని శాసనాలు ఈ ఆలయంలోని శిలాశాసనాలు అప్పటి రాజులు, ఆలయ నిర్మాణ విధానం, దాన ధర్మాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి.ఇవి చరిత్ర పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
తూర్పు చాళుక్యుల కాలం నాటి శిలాశాసనాలు ఈ ఆలయం లో
చూడవచ్చు . గ్రానైటు పై చెక్క బడిన శిల్పాలు , గ్రానైటు స్తంబాలు మనల్ని ఆకర్షిస్తాయి . ఈ ఆలయం లో పురాతన కాలం నాటి రాజగోపురం , ఉయ్యాలా మండపం , స్వామివారి మండపము ,నిత్యస్థాన మండపము , చిలుకు ద్వాదశ మండపం , వాటిపై కళాకృతులు మన చరిత్రకు ఆధారాలుగా ఉన్నాయి . ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం లో ఉన్న గ్రానైట్ స్తంబాలు చెక్కుచెదరకుండా
చూసే వారికీ కనువిందు
చేస్తున్నాయి .
|
పలివెల |
శిలాశాసనాలు పలివెల
![]() |
| Palivela 100 Pillars Shiva Temple |
పలివెల గ్రామం లో ఉన్న విషేశం ఏమిటంటే గ్రామదేవతకి పుట్టినిల్లు ,మెట్టినిల్లు రెండు దేవాలయాలుఒకేగ్రామంలోఉండటంమనంఈగ్రామంలోచూడవచ్చు. ఈ తాళ్ళమ్మతల్లి దేవాలయం మరో చోట ఉంది . ఈ తాల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఉగాదికిఉత్సవాలు
అంగరంగ వైభవంగా జరుపుకుంటారు .
ఈ శివాలయానికి ఎలా చేరుకోవాలి
: ఈ పలివెల గ్రామం రావులపాలెం నుండి 12
కిమీ దూరం లో ఉంది , కొత్తపేట నుండి 3 కిమీ దూరం లో ఉంది . అమలాపురం ..25 కిమీ . రాజమండ్రి నుండి 50 కిమీ దూరం లోను , కాకినాడ నుండి పలివెల 90 కిమీ దూరం లో ఉంది .
అమలాపురం – కొత్తపేట రూట్ లో కొత్త పేట వంతెన వద్ద్దనుంది పలివెల పురాతన శివాలయానికి చేరుకోవచ్చు .
బస్సు సౌకర్యం తక్కువగా ఉంటుంది . కనుక కొత్తపేట నుండి ఆటో లో సులువుగా
చేరుకోవచ్చు . సొంత వాహనాలు ఉంటే పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ పలివెల గ్రామాన్ని చేరుకోవచ్చు .
![]() |
| Ancient Shiva Temple in Palivela Village |
ముగింపు
కోనసీమలో చారిత్రక ప్రాముఖ్యత, అద్భుతమైనశిల్పకళ, గతకాలం నాటి వైభవాలు ఇక్కడి శాసనాలు బట్టి తెలుసుకోవచ్చు . 100 స్తంభాల ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం తప్పక సందర్శించాల్సిన పుణ్యక్షేత్రం. భక్తులు, చరిత్ర ప్రేమికులు, పర్యాటకులు అందరికీ ఇది ఒక అరుదైన దర్శన స్థలం.












