పట్టిసీమ – గోదావరి తీరంలో పవిత్ర పుణ్య క్షేత్రం

By konaseema life

Updated On:

పట్టిసీమ

 

పట్టిసీమ తీర్థం చరిత్ర & ప్రాముఖ్యత      

పట్టిసీమ అనే పేరు ఎలా వచ్చింది .

పూర్వము పట్టిసీమ ను  పట్టిసాచల  క్షేత్రం గా పిలుచుకునే వారు  ,  కాలక్రమం లో పట్టిసీమ గా మారింది .  వాడుక బాషలో పట్టిసిమ గా ఉన్నా  ,   స్తానికంగా  పట్టిసీమ నిధి పిలుస్తారు .  గుడి దగ్గర   బ్యానర్లు   కుడా  అలానే ఉన్నాయి. పురాణాల ప్రకారం  మరో కధనం  తెలుస్తుంది . వీరభద్రుడు  ” పట్టిసం ” అనే ఆయుధం తో దక్షుడి శిరస్సు  ఖండించి  నప్పుడు  ఆ ఆయుధము పేరు మీద  “పట్టిసం”  అనే  పేరు వచ్చినదని మరో కధనం . ఈ చారిత్రాత్మక గుడిని  11 వ శతాబ్దం లో చోళులు నిర్మించారు .  తర్వాత కాలం లో రుద్రప్రతాపుడు ఈ గుడిని పునరుద్దరించినట్లు  ఇక్కడి శాసనాలను బట్టి తెలిస్తుంది .   ఇప్పటికి  పట్టిసం అనే గ్రామం రేవు ద్వారానే  లాంచీలు  , పడవల్లో  ఈ పట్టి సీమ కు చేరుకుంటారు . గతం లో ఈ పట్టిసీమ పశ్చిమ గోదావరి జిల్లా లో ఉండేది , ప్రస్తుతం ఏలూరు  జిల్లా  , పోలవరం మండలం లో ఉంది  ఈ పట్టిసీమ .

పట్టిసీమ
పట్టిసీమ

 

పురాణాల ప్రకారం తీర్దం ప్రాముక్యత

పంచశైవ క్షేత్రాలు :  శ్రీశైలం,  కాశి ,  కేదారం , కాళహస్తి , పట్టిసం .  శ్రీ వీరభద్రస్వామి ఆలయం   పంచ శైవ క్షేత్రాలలో  ఒకటి అయిన ” పట్టిసం”   దేవకూట పర్వతముపై  ,  పవిత్ర గోదావరినది  ఇసుక తెన్నుల మద్యలో  ఉన్నది . ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ వీరేశ్వరస్వామి వారు  భద్రకాళిసమేతుడై  స్వ్యంబు వై కొలువై ఉన్నారు .   పూర్వము దక్ష ప్రజాపతి  ద్రాక్షారామం లో  నిర్విశ్వర యాగం చేయసంకల్పించెను .  ఆ యాగామునకు సతిదేవి  వచ్చుట చూచిన  దక్ష ప్రజాపతి  , పిలవని  పెరంటంమునకు  వచ్చినదని   సతీదేవిని అవమాన పరిచెను .   ఆ అవమాన భారం బరించలేక  శివుని చెంతకు  చేరుటకు  మనసు అంగీకరించక   సతీదేవి అగ్నికి  ఆహుతి అయ్యెను .  

ఇది తెలిసిన శంకరుడు కోపోద్రోక్తుడై  ప్రలయతండవము  చెయుచూ ,  తమ జడల యందు  ఒక జడను విడువగా ,  వీర భద్రుడు ఉద్బవించెను . ఆ వీరభద్రుడు పరమశివుని  ఆజ్ఞా మేరకు  “పట్టిసం” అనే ఆయుధం తో  దక్షయాగమును  ద్వంసం చేసి  , దక్షప్రజాపతి ని సంహారము గావించి ,  సతీ వియోగం తో ఉగ్రరుపుడై  దేవకూట పర్వతమున ప్రలయతండావము చేయుచుండగా , లోకం వినసనం అవుతుందని  దేవతల కోరిక మేరకు ,  అగస్త్య మహాముని వీరభద్రుని  ఆలింగనము  చేసుకోనగా   వీరభద్రుడు లింగాకా రమై , స్వ్యంబుడై  వేలిసినారు . ఆలింగనము చేసుకొన్నప్పుడు  వీరభద్రుని జడ ను  పట్ముటుకుని ముడి వేసెను . నేటికి   లింగా కరము చుట్టూ , అగస్త్య మహామేని భాహువులు,  హస్త చిహ్నములు  , లింగాగ్రమున కనిపించును . వీరభద్రుని జడలు , శిఖముడి  నేటికి దర్శన మిచ్చ్నును .  ఇది పట్టిసీమ స్తలపురాణం .  

గోదావరి నది ప్రక్రుతి అందాల తీరం

దర్శనీయ ప్రదేశాలు – ఉప ఆలయాలు

శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం  –  స్థలపురాణం . ఈ ఆలయం లో భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడుగా  శంఖు , చక్రములు తారుమారు రూపమున కొలువై ఉన్నారు .  అదెలా  అంటే గజేద్రమోక్షం సమయం లో   మొసలి భారి  నుండి గజెంద్రుదుని రక్షించుటకు  విష్ణువు , శంఖు చక్రములను , వైకుంటము నందు మరచి భూలోకమునకు వచ్చెను . గరుత్మంతుడు  ఆ శంకు చక్రములను తీసుకువచ్చి  విష్ణువుకు ఎదురుగా ఇవ్వడం వలన అవి తారుమారు అవినవి. తదుపరి మొసలిని సంహరించి ఏనుగుకు మోక్షం ను ప్రసాదించెను . అదే సమయమున జాంబవంతుడు  ఈ పర్వతము పై తపస్సు చేసుకోను చుండగా  విష్ణువు  జాంబవంతునకు దర్శన మిచ్చేను . ఈ విధముగా విష్ణువు ఈ  నీలాచల పర్వతము మీద స్వయంభువై  వెలసి ఉన్నారు .

ఈ ఆలయం నందు ఉప ఆలయములు కలవు .  శ్రీ  కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహిసాసుర మహిషాసురమర్ధిని అమ్మ వారు కొలువై ఉన్నారు .   పట్టిసీమ దేవాలయం లో  మరో అమ్మ వారి ఆలయం కలదు . శ్రీ అనిస్త్రీ  , పున్యస్త్రీ అనే ఇద్దరు అమ్మవార్లు కొలువై ఉన్నారు .  సంతానం లేని వారు వారు భక్తితో ఈ అమ్మవార్లను పూజిస్తే పిల్లలు కలుగుతారని ఇక్కడి భక్తుల ప్రగాడ విశ్వాసం .  ఈ దేవకూట పర్వతము  పై  మరోవైపు    శ్రీ సీతా రాముల వారి గుడి కుడా ఉన్నది .   

పట్టిసంనిధి - దేవకూట పర్వతము
పట్టిసంనిధి – దేవకూట పర్వతము

 

పట్టిసీమదేవాలయం -ప్రత్యేక ఉత్సవాలు

శివరాత్రి  పట్టిసం  లో మహాశివరాత్రికి  అత్యంత  ఘంనంగా ఉత్సవాలు ,  తీర్ధం జరుగుతుంది . 3 లక్షల మంది భక్తులు  ఆ పరమాత్మా స్వరూపుడైన వీరభద్రున్ని దర్శించుకుంటారు . పట్టిసం ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి   సాధారణ రోజుల్లో  పడవలు , లాంచీ లలో  ఈ పట్టి సీమను దర్శించు కోవచ్చు .  ముఖ్యంగా  శివరాత్రికి  వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని  గోదావరి నదిలో తాత్కాలిక వారధి  నిర్మిస్తారు .  పంటి ( ఫెర్రీ ) లు  గోదావరి లో వంతెనగా  పెట్టి  , చుట్టూ  , రక్షణ గా  ఏర్పాట్లు చేసి  , మిగిలిన గోదావరి  ప్రాంతం ఇసుకలో   ఇసుక నింపిన గొని సంచులతో గట్టు ఏర్పాట్లు చేస్తారు .  పోలిసుల పర్యవేక్షణలో   తొక్కిసలాట జరగకుండా  వెళ్ళు దారి , వచ్చు దారీ లో  పోలీసులు జాగ్రత్తలు  చెబుతూ   భక్తులను  దర్శనానికి పంపుతారు . ఇలా పట్టిసీమ  లో తయారు చేసిన తాత్కాలిక వారధి సుమారు 4 కిలోమీటర్లు ఉంటుంది .  ఇలా కాలి నడకన స్వామి వారి దర్శనానికి వెళుతుంటారు .

చల్లని పిల్ల గాలులను ఆస్వాదిస్తూ , గోదావరి  అందాలను చూసుకుంటూ , శివనామ స్మరణతో  ముందుకు సాగుతారు .  దారి మధ్యలో  ఇసుకలో ఏర్పాటు చేసిన  చిరుతిళ్ళు అమ్మే షాప్లు ,  బొమ్మలు అమ్మే షాప్ లు  పిల్లలకు బాగా  అకార్శిస్తాయి .   సాయంత్రం  వీరభద్రస్వామి వారి సంబరం అత్యంత వైభవంగా జరుగుతుంది .

గోదావరి లో శివరాత్రి కి తాత్కాలిక వారధి
గోదావరి లో శివరాత్రి కి తాత్కాలిక వారధి

 

కార్తిక మాసం  లో  ప్రత్యక అభిషేకాలు  , పూజలు నిర్భివహిస్తారు .  కార్తిక మాసం లో రోజుకి  800 నుండి 1200 మంది భక్తులు స్వామి వారిని  భక్తి శ్రద్ద లతో  దర్శించు  కుంటారు .

దసరా ఉత్సవాలు  కూడా చాలా వేడుకగా జరుపుతారు  . వేలాది మంది భక్తులు  ఈ ఉత్సవాలలో పాల్గొంటారు .

పట్టిసీమనిధి లో జంగం దేవరలు

శివరాత్రి కి  పట్జంటిసీమ తీర్ధం లో ,  గోదావరి నదీ తీరాన  చాల మంది  జంగం  దేవరలు శంఖం , గంటలు పట్టుకుని పూజలు చేస్తూ కనిపిస్తారు . తెప్పలు పై దీపాలు పెట్టి చని పాయిన వారి ఆత్మకి శాంతి కలగాలని వీరభద్రుని వేడుకుంటూ పూజలు చేస్తారని  వారు తెలిపారు .  ఉత్సవాలలో జరిగే  అన్నదానం లో జంగం దేవరలు శంఖం ఊదిన తరవాత అన్నదానం ప్రారంభం  అవుతుంది వారు తెలిపారు .

పట్టిసంనిధి లో జంగందేవరలు
పట్టిసంనిధి లో జంగందేవరలు

 

గోదావరి నదీ మద్యలో పట్టిసీమ  అందాలు

గోదావరి  నది ఇసుక  తెన్నులపై  నదీ తీరం అందాలు  ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తాయి .  గోదావరి అందాలను ఆస్వాదించాలి అనుకునే  పర్యాటకులకు  చూడదగ్గ  ప్రదేశం  ఈ పట్టిసీమ.

సినిమా షూటింగ్ స్పాట్  :   అబ్డుతమైన అందాలను తన సొంతం చేసుకున్న గోదారమ్మ  –  వెండి తెరపై    చాల సినిమాలలో కనువిందు చేసింది  .  ఈ పట్టిసీమ పరివాహక ప్రాంతాలలో తీసిన సినిమాలు చాలానే ఉంటాయి .ముఖ్యంగా  కె విశ్వనాద్ గారి  స్వాతిముత్యం (1989) , సూత్రదారులు , వంశీ గారు తీసిన ప్రేమించి పెళ్ళాడు , దాసరి నారాయణ రావు తీసి , అక్కినేని నాగేశ్వరరావు నటించిన  మేఘసందేశం ,  మూగమనసులు  , బద్రాచలం , శ్రీకాంత్ నటించిన  నిన్నే ప్రేమిస్తా , తొలికోడి కూసింది . ఇలా చాల సినిమాల లో  చాల అందంగా  ఈ పట్టిసీమ గుడి  కనిపిస్తుంది .

Sunset - Godavari
Sunset – Godavari

పట్టిసీమగుడి కి  ఎలా చేరుకోవాలి 

రోడ్ మార్గం :  రాజమండ్రి నుండి  బస్సు లలో  పట్టిసం చేరుకో  వచ్చును   . రాజమండ్రి నుండి పట్టిసం  35 కిలోమీటర్లు దూరంలో ఉంది .  అలాగే నిడదవోలు నుండి  కూడా  బస్సు లు కలవు .  కొవ్వూరు నుండి సింగల్ రూట్ కావడం తో శివరాత్రి లాంటి పండుగ  సమయాలలో  రోడ్ పై రద్దీ ఎక్కువగా  ఉంటుంది .  పట్టిసం కి  అవతల  సీతానగరం  మండలం  వైపు నుండి  పురుషోత్తపట్నం , వంగలపూడి మీదుగా  చిన్న రేవుదాటి  ట్రాక్టర్  ల ద్వారా  , కాలినడకన చేరుకోవచ్చు .

గోదావరిలో ట్రాక్టర్లు
గోదావరిలో ట్రాక్టర్లు

 

రైల్ మార్గం : సమీప పెద్ద రైల్వే స్టేషన్  రాజమండ్రి .

విమాన యానం :  రాజమండ్రి కి సమీపం లో కోరుకొండ లో  ఎయిర్పోర్ట్ కలదు .

పట్టిసీమ సందర్శించడానికి  ఎ కాలం బెటర్ ? 

పట్టిసం ను శీతాకాలం సందర్శించడం ఉత్తమ మైనది .  వర్షాకాలం గోదావరి వరదల కారణం గా కొంచెం ఇబ్బంది ఉండవచు .  అందువలన అక్టోబర్ నుండి  మార్చ్ వరకు  వాతావరణం అనుకూలంగా ఉంటుంది .

ముగింపు 

గోదావరి నది మధ్యలో దేవకూట పర్వతంపై ఉన్న ఈ పట్టిసీమ ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమే కాకుండా, ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను, అలాగే సినిమా రంగానికి చెందిన వారిని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. కార్తిక మాసంలో గోదావరినది  ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెల్లో వనభోజనాలు చేయడానికి యువత ఎంతో ఉత్సాహం చూపిస్తారు. మనసుకు హత్తుకునే ఈ అందమైన గోదావరి దృశ్యాలను వీలైతే మీరు కూడా ఒకసారి ప్రత్యక్షంగా చూసి రావడం తప్పక మర్చిపోకండి.

వీరభద్రస్వామి టెంపుల్
వీరభద్రస్వామి టెంపుల్

 

మా వెబ్ సైట్ లో మరికొన్ని ఆర్టికల్స్  చదవండి :  అంబాజీపేట పోట్టిక్కలు 

పట్టిసీమ లో మహాశివరాత్రి  కి జరిగిన తీర్ధం ఈ వీడియో లో చుడండి :    పట్టిసీమ నిధి 

Related Post

Leave a Comment