కోనసీమ అంగర చేనేత చీరల గొప్పతనం | సంప్రదాయం & చేనేత కళ

కోనసీమ అంగర చేనేత చీరల గొప్పతనం

 అంగర గ్రామం చేనేత  పరిచయం

కోనసీమ ప్రాంతంలోని అంగర గ్రామం చేనేత కళకు చిరునామాగా నిలిచింది. ఈ గ్రామంలో తరతరాలుగా చేతి మగ్గాలపై చీరలు నేసే నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు నివసిస్తున్నారు. వారి కృషి, అంకితభావానికి గుర్తింపుగా భారత ప్రధాని చేతుల మీదుగా బంగారు, వెండి పథకాలు పొందిన చేనేత కళాకారులు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. అంగర గ్రామంలో 1977 సంవత్సరంలో 22 మంది సభ్యులతో గణపతి చేనేత సహకార సంఘం” ఏర్పాటు చేయబడింది. కాలక్రమంలో ఈ సంఘం అభివృద్ధి చెందుతూ, ప్రస్తుతం 670 మంది సభ్యులతో విజయవంతంగా కొనసాగుతోంది.

రాట్నం పై నూలు వాడుకుతున్న మహిళ
రాట్నం పై నులు వాడుకుతున్న మహిళ

ఈ చేనేత సహకార సంఘాల ద్వారానే ముడిసరుకైన నూలు, జరీ తదితర వస్తువులు నేతకారులకు అందజేయబడుతున్నాయి. నేతకారులుచేతి మగ్గాలపై తయారు చేసిన వివిధ రకాల చేనేత ఉత్పత్తులు తిరిగి ఈ సహకార సంఘాలకే అందించబడతాయి. అంగర గ్రామంలో తయారయ్యే గద్వాల్ చీరలు, జంధాని చీరలు, జరిచీరలు, డ్రెస్ మెటీరియల్, ధోతి,కండువాలు వంటి ఉత్పత్తులను ఈ సహకార సంఘాల ద్వారానే మార్కెటింగ్ చేయడం జరుగుతుంది.ఈ చేనేత
సహకార సంఘాలకు
 ప్రజలు నేరుగా వచ్చి తమకు నచ్చిన చీరలు,ఇతర చేనేత వస్త్రాలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. దీంతో మధ్యవర్తులు లేకుండా నేరుగా నేతకారులకు మద్దతు అందుతుంది. అంగర గ్రామం చేనేత కళ కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది కోనసీమ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన జీవన విధానం.

నేత చీరాల తయారీ విదానం :

1.రాట్నంపై నులు వడకడం  నూలుకావలసిన రంగులలో డైయింగ్ చేయబడి వస్తాయి.   ఈ నూలును  రాట్నం అనే  చక్రాలమీద తిరిగే  చిన్న  డబ్బాలకు   నూలును దారం గా చుడతారు .  పని చాల కష్టంగా కూడుకున్న పని . నూలు సరిగా లేకపోతే  దారం తెగిపోతు ఉంటుంది . దానిని మరల అతికి రాట్నం పై చుడతారు

2. మరసు ( పెద్ద చేక్రం )     నూలు వడికిన దారాల డబ్బాలు  ఒక మగ్గానికి సుమురు 30 నుండి 32 అవసరంఅవుతాయి .  32 డబ్బాలను  మరసు అనే పెద్ద  చక్రానికి  దారాలు వరస క్రమం లో మగ్గానికి  కావలిసిన డిజైన్ ప్రకారం వరసగా చుడతారు . ఇలా ఒక batch పూర్తీ అవడానికి మూడుగంటల సమయం పడుతుంది . ఇది కరెంటు లేకుండా  మనిషి సహాయంతో తిప్పబడుతుంది
ఇలా దారాలన్నీ వరసక్రమం లో బయటికి తీస్తారు
 . 

మరాసు (పెద్దచక్రం )
మరాసు ను ఉపయోగిస్తున్న నేతన్న

3. పడుగు  ( సైజింగ్ )   మరాసు అనే చక్రం నుండి తెచ్చిన దారాల  సముదాయాన్ని  గంజి పెట్టి  పొడవుగా  సాగ దీస్తారు .  పని చేయడానికి 3 నుండి నలుగురు మనుషులు అవసరం అవుతారు .  పనిని సాదారణంగా ఉదయం పూట చేస్తారు . ఇలా పడుగు మీద సాగ దీసి మగ్గానికి ఎక్కించడానికి వీలుగా చుడతారు .   ప్రాసెస్ అంటా అవడానికి 3 నుండి 5 గంటలు సమయం పడుతుంది .  పడుగు మీద సాగ దీసిన నూలు దారాలు  ఒక batch కి  సుమారు 9 నుండి 10 చీరాలను  మగ్గం మీద నేయగలరు .

4. మగ్గం    పడుగు నుండి వచ్చిన  నూలు దారాల చుట్ట ని  మగ్గం పై ఎక్కించి , మగ్గానికి ఉన్న  దారాల కి అటాచ్ చేయబడతాయి . దీనిలోనే జరి మరియి చీర  డిజైన్  కూడా నేతన్నలు  ఏర్పాటు చేస్తారు . మగ్గం కుర్చుని ఒక  వ్యక్తి  ఉదయం నుండి సాయంత్రం వరకు ఆగకుండా చేస్తే 2 రోజులకు ఒక చీర పూర్తి అవుతుందని  అంగర గ్రామం లోని  నేతన్న తెలియజేసారు .

మగ్గం నేస్తున్న మహిళ
మగ్గం నేస్తున్న మహిళ

        

అద్బుతమైన అందమైన చీరలు నేయడానికి ఒకకుంటుంబం మొత్తం శ్రమ పడవలసి వస్తుంది.నూలు  వడకడం నుండి మరాసు ,పడుగు చేయడం ,మగ్గ్గం నేయడం అన్నీ పనులు  కుటుంబం లోనిసబ్యులు చేస్తుంటారుఇలా చేయడానికి లేని వారు కూలికి మనుషులను పెట్టి చేయించ వలసి వస్తుంది .  ఇంత కాస్త కస్టపడి   చీర తాయారు చేస్తే  ఒక చీరకు 5 వందల నుండి 8 వందలు  మిగలటంచాలా కష్టం గా ఉందని  చెబుతున్నారు .

ముడిసరుకు కొరత

నూలు డబ్బాలు
నూలు డబ్బాలు

   
సహకారాసంగాల ద్వారా లబించే  నూలు సరిగా లబించడం లేదని ,  గ్రామం లో ఉన్న మగ్గాలకి 
సరిపడా నూలు  అండడం లేదని ఇక్కడి నేతన్నలు తెలిపారు .   ముడి సరుకు కొరత కారణంగా  బయటి దళారుల వైపు చుడవలసి వస్తుంది .  బయటి  వ్యాపారులుఅంగర గ్రామంలోచేనేతకళాకారులకు  ముడిసరుకు ఇచ్చి చీరలు నేయించు కుంటారు .   గ్రామం లోయారు చేసిన చీరలకు వీరే బ్రాండింగ్ వేసుకుని అమ్ముకుంటారని  ఇక్కడి వారు అన్నారు .  కనీసం పని దొరికుతుంది కదా అని చీరలు చేసినా… ఆశించిన ఆదాయం పొందడం లేక పోతున్నారు .   సహకార సంగం ద్వారా చీర తయారు చేస్తే కొంచెం లాభం ఉంటుందని చెబుతున్నారు .

మార్కెటింగ్

అంగర గ్రామం లో ఉన్న గణపతి చేనేత సహకార సంఘం ఇక్కడి సబ్యులకి ముడిసరుకు ఇచ్చి  చీరలు తయారీ చేయిస్తారు .  ఇలా తయారైన  గద్వాల్ , జందాని , వేంకటగిరి జరి చీరలు  సహకార సంగాల ద్వార మార్కెటింగ్   హోల్ సేల్ గా
, రిటైల్ గా చేయబడతాయి .  మనం కుండా  నేతన్నలు తాయారు చేసిన చీరలను కొనుగోలు చేయవచ్చు .   ఆప్కో ద్వారా  చేనేత కాటన్ చీరలు వివిధ ప్రముఖ పట్టణాలలో అమ్మబడుతున్నాయి .   అంగర గ్రామం లో ఉన్న గణపతి చేనత సహకారసంగం  సంవత్సరానికి 2 కోట్ల  టర్నోవర్  తో ఉంది.

నేత కార్మికులు
అంగర గ్రామం లోని నేత కార్మికులు

ముగింపు  

నేటి ఆధునిక యుగంలో చేనేతరంగాన్ని చాలామంది తక్కువగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.  అయితే మనం కొనుగోలు చేసే ఒక్క చేతి మగ్గం చీర కూడా ఒక నేతన్నకు అందించేచిన్నసహాయంగామారుతుంది. తరతరాలుగా మనకు అందిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వ సంపదే చేనేతరంగం. మనుగడ కోసం పోరాడుతున్న ఈ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమజిల్లా, కపిలేశ్వర మండలంలోని అంగరగ్రామంలో తయారయ్యే చేనేత చీరలు దీనికి సజీవ ఉదాహరణ. అవకాశం దొరికితే అంగర గ్రామాన్ని సందర్శించి, లేదా మీ ఊరిలోని చేనేతసహకార సంఘాన్ని దర్శించిఈ నేతన్నలు తయారు చేసినచీరలను కొనుగోలు చేసి వారి జీవితాలకు తోడ్పాటు అందిద్దాం. 

చేనేతను ఆదరించడం అంటే ఒక వృత్తిని కాదు, ఒక సంస్కృతిని, ఒక జీవన విధానాన్ని కాపాడటమే.

ఆన్ లైన్  లో ఈ శారీలు కొనుగోలు చేయడానికి ఈ మొబైల్ నెంబర్ ను కాంటాక్ట్ చేయండి  : 910304 8964

 

 

 

ఈ  క్రింద వీడియో ద్వారా అంగర గ్రామం లో తయారయ్యే చేనేత చీరలను  చూడండి

 

 

 

 

Leave a Comment