200 సంవత్సరాల పురాతన మేడ found
at Konaseema
అమలాపురం పసర్లపూడి
బ్రిడ్జి కి మద్య లో హైవే ప్రక్కనే గోదావరి నదిని అనుకుని ఉన్న అందమైన పురాతన పల్లెటూరు బోడసకుర్రు . ఈ బోడసకురు గ్రామం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ,
br అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండల కేంద్రమైన అల్లవరం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది. రాజోలు
నుండి పట్టణానికి 16 కిలోమీటర్ల దూరం లోను , కాకినాడ నుండి పట్టణానికి 69 కిలోమీటర్ల దూరం లోను ఉంది .
హై వే రోడ్ నుండి కొచెం దూరం వెళ్ళేటప్పటికి దొమ్మేటి వారి మేడ గంబీరంగా
ఒకసారి నిలబడి చూడాలి అనిపించేలా కనిపిస్తుంది . ఈ
ఇంటిని 200 సంవత్సరాల
క్రితం దొమ్మేటి వెంకట రెడ్డి గారు నిర్మించారు
. సుమారు 50 గదులు , 50 గుమ్మాలు ఉన్న ఈ బావనం లోపల 2 మండువా లోగిళ్ళు ఉన్నాయి . సుమారు 4 ఎకరాల్లో నిర్మించిన ఈ బవనం గత చరిత్రకు
నిదర్శనగా నిలిస్తుంది .
దొమ్మేటి వెంకట రెడ్డి గారు 1853 లో కోనసీమ
లోని బోడసకురు గ్రామం లో జన్మించారు . వెంకటరెడ్డి
గారి తల్లి వెంకటస్వామి
, తల్లి ఆచమ్మ గారు .
పూర్వకాలం ఉపాది కోసం గాని , వ్యాపారం కోసం చాల మంది బర్మా దేశం వెళ్ళేవారు . అలా దొమ్మేటి
వెంకట రెడ్డి గారు 1880 లో వ్యాపారం
నిమిత్తం బర్మదేసం వెళ్లారు . అయన షిప్పింగ్ బిజినెస్ లో చాల
ఉన్నత శిఖరాలు అడిరోహించారు . వ్యాపార వేత్తగా పేరు ప్రతిష్టలు సంపాదించడమే
కాకుండా , ఉపాది
కోసం బర్మా దేశం వచ్చే వారిని , కుల మత ప్రాంత బేదం లేకుండా వారికి సహాయం
చేసేవారు . బ్రిటిష్ కాలం లో నే బర్మా దేశం లో ( ప్రస్తుత మయన్మార్ లో ) ఎన్నో సేవాకార్యక్రమాలు
చేసారు . వయోజన విద్య కోసం అప్పట్లోనే స్కూల్స్ ఏర్పాటుకు దొమ్మేటి వెంకట రెడ్డి గారు కృసి చేసారు . అలాగే బర్మ లో రామాలయం నిర్మించారు .
బర్మా దేశం లో అక్కడ
తెలుగు వారందరితో కాళీ మాత ఉత్సవాలు చాల
వైబవంగా జరిపించేవారట . అప్పటి ఫోటో లు కూడా ఇక్కడ మనము చూడవచు . దసరా కి కొనాసీమ
లో బేతాళ స్వామి ఉత్సవాలు బ్రరంబించింది కుడా దొమ్మేటి వెంకటరెడ్డి గారే నని
వారి వారి వారసులు చెబుతున్నారు .
గత చరిత్రకు అదారమైన పురాతన ఫోటోలు వీరి బావనం
లోపల చూడవచ్చు .
|
Kalimata |
బర్మా దేశం లో బ్రిటిష్ వారితో సమన హోదా తో
షిప్పింగ్ వ్యాపారాలు చేసిన వెంకటరెడ్డి
గారు మన కోనసీమ లో అమలాపురం లో ఒక లైబ్రరీ , పేరూరు లో 1906 లోనే high school నిర్మించి దానికి పోషణ నిమితం 46 ఎకరాలు స్కూల్ కి రాసిచారు
. బోడసకురు గ్రామం లో కులమతాలకు అతీతం గా అందరికి
అవసరమైన అన్నిరకాల సహకారాలు చేసేవారు . venkara
redidy గారి గురించి
గ్రామం లో ఎవరిని అడిగిన వారి గురించి ,
వారు చేసిన సేవలు గురించి చుబుతున్నారు.
కళ్ళు గీత కార్మికులు ఉన్న తమవారు eduga అనే పేరుతో పిలిచే పిలిపు
తమ జాతి వారికి అవమాన కరంగా ఉందని , జాతిని ఏకం తమ జాతి పేరు శెట్టిబలిజ గా గవర్నమెంట్ రికార్డ్స్ లోకి చేర్చేలా దొమ్మేటి వెంకట రెడ్డి గారి
కృషి చేసారు . ఎప్పటికి
సెట్టిబలిజ కులస్తులు సంఘాలు వెంకటరెడ్డి
గారిని తమ ఆరాధ్య దైవంగా తమ గుండెల్లో నిలుపుకున్నారు
. అందుకనే అయన విగ్రహాలు చాల గ్రామాలలో నెలకొల్పి ఆయన చేసిన సేవలు గుర్తుకు
తెచుకున్తున్నారు .
1906 లో నిర్మించిన పేరూరు high
school
|
Peruru High school 1906 |
బ్రిటిష్ వారి కలం లో నే చదువు యొక్క విలువ
గుర్తించిన రెడ్డి గారు తమ ప్రాంతం లో ఉన్నత విద్య చదివే అవకాసం లేక పోవడం తో స్వంతంగా ఖర్చులతో స్కూల్ నిర్మించారు . స్కూల్ ఫోషణ నిమిత్హం 46 ఎకరాలు ఈ స్కూల్ కి ఇచారు . బోడసకురు గ్రామం
నుండి ప్రస్తుతం హైవే ప్రక్కన అకిరా హాస్పటల్ ప్రక్క రోడ్ లో
వెళితే పేరూరు గ్రామం లో దొమ్మేటి వెంకట రెడ్డి గారు
నిర్మించిన స్చ్చూల్ కనిపిస్తుంది .
ఇప్పటికీ దొమ్మేటి వారి వారషులు పిల్లలకి కి పుస్తకాలూ ,
అవసరమైన సహాయ సహకారాలు ఇప్పటికి వారు చేస్తుండటం వారి మంచి మనసుకు నిదర్శనం .
1906 నుండి ఈ స్కూల్ లో 10
క్లాసు వరుకు చదువుకుని పై
చదువులు చదివి ఈన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు చాల మంది
ఉన్నారు . వారుకూడా స్కూల్ కి కవలైసన మైలిక సదుపాయాల
ఏర్పాటులో సహకరిస్తునారని హెడ్ మాస్టర్ గారు తెలిపారు . అత్యదునిక సదుపాయాలతో
ఉన్న ఈ గవర్నమెంట్ స్కూల్ లో cc కెమెరా లు క్లాస్స్
రూమ్ పర్యవేక్షణ , సౌండ్ సిస్టం తో ప్రైవేటు
స్కూల్స్ కి దీటుగా ఈ స్కూల్ ఉంది .











